ఎల్. జీ పాలిమ‌ర్స్ ని చంద్ర‌బాబు అప్పుడెందుకు త‌ర‌లించ‌లేదు?

విశాఖ ఎల్ జీ పాలిమ‌ర్స్ గ్యాస్ దుర్ఘ‌ట‌న దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఘ‌ట‌న‌ జ‌రిగినే వెంట‌నే ప్ర‌భుత్వం హుటాహుటిన చ‌ర్య‌లు చేపట్ట‌డంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. లేదంటే ప్రాణ న‌ష్టం ఊహించ‌ని విధంగా ఉండేంది. ఇక ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు అండ్ కో ఇప్ప‌టికే రాజ‌కీయాలు మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అన్నేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు క‌నీసం బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌క‌పోగా…హైద‌రాబాద్ లోనే ఉంటూ వైకాపా ప్ర‌భుత్వంపై దిగ‌జారుడు వ్యాఖ్య‌లు…రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం వైకాపా ప్ర‌భుత్వ‌మే అంటూ విమ‌ర్శించారు.

దీంతో వైకాపా మంత్రులు, కార్య‌క‌ర్త‌లు ఆ వ్యాఖ్య‌ల్ని కొట్టిపారేసారు. తాజాగా ఎల్ జీ పాలిమ‌ర్స్ కంపెనీ విస్త‌ర‌ణ వెన‌క చంద్ర‌బాబు కీల‌క పాత్ర‌ధారి అని తేలింది. 2015 లో ఎల్ జీ పాలిమ‌ర్స్ విస్త‌ర‌ణ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనుమ‌త‌లిచ్చింద‌ని..కానీ ఇప్పుడు క‌బుర్లు చెబుతున్నార‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మండిపడ్డారు. 1998లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడే ఎల్జీ పాలిమ‌ర్స్ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అప్పుడే ఆ సంస్థ‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటే ఇప్పుడిలాంటి ప‌రిస్థితిలు వ‌చ్చేవి కాద‌న్నారు. ఇప్పుడు త‌న‌కేమి తెలియ‌న‌ట్లు..ఇప్పుడున్న ప్ర‌భుత్వానిదే వైఫ‌ల్య‌మ‌న్న‌ట్లు బాబు మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు.

2015కే అక్క‌డ నివాసాలు పెరిగాయి. అప్పుడే అలాంటి కంపెనీలు ప్ర‌జ‌ల మధ్య‌లో ఉండ‌కూడ‌ద‌ని స్థానికులు అప్ప‌టి ప్ర‌భుత్వాన్ని కోరారు. కానీ చంద్ర‌బాబు కంపెనీ నుంచి రాష్ర్టానికి వ‌చ్చే ఆదాయ‌న్ని చూసుకున్నారు త‌ప్ప ప్ర‌జ‌ల ప్రాణాలు ఏమైపోతే త‌న‌కేంటి అన్న‌ట్లే! వ్య‌వ‌రించార‌ని తాజాగా స్థానిక ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై మండి ప‌డుతున్నారు. 2015లో కంపెనీ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌క‌పోయి ఉంటే ఇప్పుడీ ప్ర‌మాదం జ‌రిగేది కాద‌ని…అంతా చంద్ర‌బాబు పుణ్య‌మే అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వైజాగ్ ప‌రామ‌ర్శికి వెళ్తే త‌న‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తార‌ని అందుకే హైద‌రాబాద్ వ‌దిలి బ‌య‌ట‌కు రాలేద‌ని అంటున్నారు. చంద్ర‌బాబుకి కుర‌సాల సూటి ప్ర‌శ్న‌లు.

1)మీరు( చంద్ర‌బాబు) సీఎంగా ఉన్న‌ప్పుడే జీవీఎంసీ ప‌రిధిని అక్కడ వ‌ర‌కూ పెంచిన‌ప్పుడు ఆ సంస్థ‌తో అక్క‌డ ప్ర‌జ‌ల‌కు హాని అని తెలియయాదా?

2)మీరు సీఎంగా ఉన్న‌ప్పుడు అప్ప‌టి పెందుర్తి ఎమ్మెల్యే ఎం. ఆంజ‌నేయులు లేఖ‌రాస్తే ఎందుకు స్పందించ‌లేదు? ప్ర‌మాదం జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే బాధితుల్ని సీఎం ప‌రామ‌ర్శించి, అధికారుల‌తో, సంస్థ యాజ‌మాన్యంతో స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, మృతి చెందిన కుటుంబాల‌కు కోటి పరిహారం ప్ర‌క‌టించ‌లేదా?

3)ఎల్జీ పాలిమ‌ర్స్ చేసిన త‌ప్పిదాల‌పై యాజ‌మాన్యాన్ని ఆరా తీసి, వాటిపై ఉన్న‌త‌స్థాయి క‌మిటీని వేసిన విష‌యం గుర్తుంచుకోవాలని చంద్ర‌బాబుకు గుర్తు చేసారు.

ఇక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఘ‌ట‌న జ‌రిగిన‌వ వెంట‌నే ఎల్ జీ పాలిమ‌ర్స్ ను అక్క‌డ నుంచి జనావాసం లేని ఇండ‌స్ర్టీయ‌ల్ ఏరియాకి త‌ర‌లిస్తాన‌ని మాటిచ్చిన సంగ‌తి తెలిసిందే.