ఉండవల్లి ఎక్కడా తగ్గట్లేదు – జగన్ రియాక్షన్ ఏంటి ?

undavalli and cm jagan

 ఉండవల్లి అరుణకుమార్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు వైఎస్ బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ లో చక్రం తిప్పిన ఉండవల్లి ఆ తర్వాత రాజకీయంగా రాణించలేకపోయాడు, అయినాగానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా, మేధావి వర్గానికి చెందిన వ్యక్తిగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు, అధికారంలో ఏ పార్టీ ఉన్నకాని ఎలాంటి అసమానతలు చూపించకుండా ప్రభుత్వం చేసే తప్పులను ఎట్టి చూపిస్తూ తనకు తోచిన సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు.

undavalli and cm jagan

నవరత్నాలు అవసరమా..?

గతంలో కొంచం జగన్ కు అనుకూలంగా వ్యవహరించినట్లు అనిపించిన ఉండవల్లి, ఇప్పుడు జగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుంది. కనీసం రెండు మూడు నెలలకు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, ప్రభుత్వం అసమర్థతను బయట పెట్టటం, కేంద్రానికి సీఎం జగన్ భయపడుతున్నాడా అంటూ ప్రశ్నించటం లాంటివి చేస్తున్నాడు, తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన ఉండవల్లి జగన్ అమలుచేస్తున్న నవరత్నాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవరత్నాలను చూసి.. జగన్‌కు ఓట్లేయలేదని. కేవలం.. పోలవరం, ప్రత్యేకహోదా అంశాలను చూసే ఓట్లేశారని..అందుకే సంక్షేమం పేరుతో సంక్షోభం తెచ్చుకోవద్దని సలహాలిస్తున్నారు.

  అసలు ఉపాధే లేనప్పుడు.. సంక్షేమం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నార, ఇదే సమయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిదులు కేంద్రమే ఇవ్వాలన్నదె పార్లమెంట్ లో చేసిన చట్టం అని, పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా ? నిజాలు చెప్పండి అన్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానికి కి రాసిన లేఖ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి అడిగే దమ్ము లేదు. ముఖ్యమంత్రి జగన్ అయినా నీతి ఆయోగ్ లేఖ తీసుకురావాలి కదా ? ఆలా చేయటం లేదంటే ప్రజలు అనుకుంటున్నట్లు గా సీబీఐ కేసులు కు భయపడుతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు.

ఉపేక్షిస్తే నష్టమే.. !

 ఉండవల్లి అరుణకుమార్ సీఎం జగన్ ను అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కానీ, జగన్ మోహన్ రెడ్డి నుండి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. గతంలో అనేకసార్లు ఉండవల్లి ఇదే విధంగా ప్రశ్నించిన కానీ ప్రభుత్వ వర్గాలు దేనికి సమాధానం ఇవ్వలేదు. కనీసం వైసీపీ మంత్రులు కూడా ఉండవల్లి వ్యాఖ్యలపై పెద్దగా స్పందించటం లేదు. ఆయన వ్యాఖ్యలకు స్పందించి అనవసరంగా ఆయన్ని హీరో చేయటం ఎందుకని సైలెంట్ గా ఉన్నారేమో..? అయితే ఉండవల్లి మాటలు డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్తున్నాయి, అదే సమయంలో ఎల్లో మీడియా కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉండవల్లి మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాయి, కాబట్టి దీనిపై వైసీపీ నేతలు కొంచమైనా దృష్టి పెడితే మంచిది