కాంగ్రెస్ విషయంలో చేతికి మట్టి అంటకుండా పని ముగించే ప్లాన్ వేస్తున్న బీజేపీ పార్టీ!

The BJP is looking to follow a strange strategy in the case of the Congress party

తెలంగాణలో ప్ర‌స్తుతం బీజేపీ పార్టీ ఫోకస్ అంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది. కాంగ్రెస్ పార్టీని అసలు లెక్కలోకి తీసుకోవట్లేదని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉండ‌టంతో ఆ పార్టీపై విమ‌ర్శ‌లు పూర్తిగా మానుకోవాల‌ని బీజేపీ నాయ‌క‌త్వం నిర్ణ‌యించుకుంద‌ని తెలిసింది. టార్గెట్ చేసి అనవసరంగా మనమే ప్రచారం చేసినట్లవుతుందని, కాంగ్రెస్ విష‌యంలో ఎంత సైలెంట్‌గా ఉంటే… ఆ పార్టీని అంత దెబ్బ‌తీసిన‌ట్టేన‌ని క‌మ‌లద‌ళం భావిస్తోంది. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ త‌మ‌నే భ‌విష్య‌త్ ప్ర‌త్య‌ర్థిగా భావిస్తూ మాట‌ల దాడి పెంచుతుండటాన్ని… బీజేపీ త‌మ‌కు రాష్ట్రంలో పెరిగిన బ‌లంగా అభిప్రాయ‌ప‌డుతోంది. గులాబీ నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తే… అంత‌గా బ‌ల‌ప‌డుతున్న‌ట్టుగా ఖుషీ అవుతోంది.

The BJP is looking to follow a strange strategy in the case of the Congress party
The BJP is looking to follow a strange strategy in the case of the Congress party

తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష హోదా తమదేనని, దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌స్తావ‌న తీసుకురాక‌పోవ‌డంతో… ప్ర‌జ‌లు త‌మ‌నే ప్ర‌త్యామ్నాయంగా భావించార‌న్న అంచ‌నాకు వ‌చ్చారు బీజేపీ నేతలు. ముఖ్యంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఇది చాలా వ‌ర్కువ‌ట్ అయ్యింద‌ని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏ ర‌కంగానూ త‌మ‌కు పోటీ కాద‌ని.. అధికార పార్టీతో ఫైట్ మాత్రమే లాభిస్తుంద‌ని కింది స్థాయి నేత‌ల‌కు కూడా రాష్ట్ర నాయ‌క‌త్వం సూచ‌న‌లు చేస్తోంద‌ట‌. కాంగ్రెస్‌లో ఎంత‌టి సీనియ‌ర్ నేత బీజేపీపై విమ‌ర్శ‌లు చేసినా కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే…వారిని కౌంట‌ర్ చేసిన‌ట్టుగా అవుతుంద‌ని రాష్ట్ర బీజేపీ అధిష్టానం భావిస్తోందట.