ఘనంగా రామ్‌- సునీత వివాహం.. హాజ‌రైన ప్ర‌ముఖులు

గ‌త ఏడాది వ‌రుస పెళ్ళిళ్ళ‌తో టాలీవుడ్ సెల‌బ్రిటీలు సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నుండి మొద‌లు పెడితే నిహారిక వ‌ర‌కు వ‌రుస‌గా వివాహాలు చేసుకున్నారు. వీరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ఇక ఈ ఏడాది సింగ‌ర్ సునీత రెండో వివాహం చేసుకుంది. గ‌త ఏడాదిలోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని భావించిన‌ప్ప‌టికీ, వీరిద్ద‌రి జాత‌ల‌కాల‌కు త‌గ్గ‌ట్టు ముహూర్తాలు లేని కార‌ణంగా జ‌న‌వ‌రి 9న ఏడ‌డుగులు వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ ఆల‌యంలో సునీత-రామ్ వీర‌ప‌నేనిల వివాహం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.ఈ పెళ్లి వేడుకకు సినీ,రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజ‌ర‌య్యారు. దిల్ రాజు త‌న భార్య తేజ‌స్వితో క‌లిసి సంద‌డి చేయ‌గా, కొత్త జంట నితిన్- శాలిని కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

సునీత పెళ్లికి ముందు ఆమె ఇంట మెహందీ, హ‌ల్దీ వేడుక‌లు కూడా జ‌రిగాయి. ముఖానికి పసుపు పూసుకొని పిల్ల‌ల‌తో సునీత దిగిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కాగా, సునీత‌, రామ్‌లు నిశ్చితార్ధం చాలా సింపుల్ గా జ‌రిగింది. డిసెంబ‌ర్ 26న వీరు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేయ‌గా ఈ కార్య‌క్ర‌మానికి సుమ‌, రేణూ దేశాయ్ ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు సింగ‌ర్స్ హాజ‌ర‌య్యారు.