టాటూ వేయించుకున్న‌ సోనూసూద్ అభిమాని.. ఇలాంటివి చేయోద్దు అంటూ దండం పెట్టిన రియ‌ల్ హీరో

రీల్ హీరో కంటే రియల్ హీరో బెస్ట్ అంటూ నిరూపించారు సోనూసూద్. ఎంతో మంది హృదయాల్లో గుడి కట్టుకుని మరీ కూర్చున్నారు. మరెంతో మంది కి స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన ఎన్నో పనులు వేల మందికి జీవితాల్ని నిలబెట్టాయి. నిజమైన హీరో అంటూ ఎంతోమంది అభిమానులు సోనూ సూద్ ని దేవుడిగా కొలుస్తున్నారు. ఆయన పేరుతో ఎన్నో షాపులు, వాహనాల పై రాసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి సోనూ సూద్ పేరుని ఏకంగా తన చేతి మీద టాటూ వేయించుకున్నారు.

ఆ టాటూ వేయించుకున్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. మా గుండెల్లో ఉన్న దేవుడివి నువ్వే అంటూ సోనూ ని టాగ్ చేశాడు. ఆ పోస్ట్ కు సోనూ స్పందిస్తూ.. తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఇలా తన పేరుని టాటూ గా వేయించుకుని బాధ పెట్టుకోవద్దని కోరారు. మీరు అలా చేస్తే చాలా బాధ పడతానని పోస్ట్ చేసారు.
ఏది ఏమైనా సోనూ సూద్ కు ఇప్పుడు యావత్ భారత దేశం అంతటా అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం సోనూ సూద్ పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గా ఉన్నారు. ఆచార్య లాంటి బిగ్గెస్ట్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. దీంతో పాటు బాలీవుడ్ లో కూడ భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ.. ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు సోనూ సూద్ ఒక రియల్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్నారు. లేటెస్ట్ గా సోనూ సూద్ లాక్ డౌన్ సమయంలో ఎదుర్కున్న పరిస్థితులు.. సందర్భాలు ఎన్నో ఓ పుస్తకం రూపంలో ఆవిష్కరించారు. ఐ యామ్ నో మెసియ్య అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసారు. దీనిపై సోషల్ మీడియా లో ఎన్నో పోస్టులు, కామెంట్లు వచ్చాయి.