Home News బిగ్‌బాస్ 4: మెహ‌బూబ్ సైగ‌లు‌.. ఆగ్ర‌హం వ్యక్తం చేసిన సోహైల్

బిగ్‌బాస్ 4: మెహ‌బూబ్ సైగ‌లు‌.. ఆగ్ర‌హం వ్యక్తం చేసిన సోహైల్

క‌రోనా వ‌ల‌న వినోదం లేక విసిగిపోతున్న ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్4. గ‌త ఆదివారం ఫినాలే ముగియ‌గా అభిజీత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ర‌న్న‌ర్‌గా అఖిల్‌, మూడో స్థానంలో సోహైల్ ఉన్నాడు. ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న వీరు బ‌య‌ట‌కు వ‌చ్చాక ఫుల్ చిల్ అవుతున్నారు. ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ అంద‌రిలో ఉన్న అనుమానాల‌ని క్లారిఫై చేస్తున్నారు. అయితే సోహైల్ విష‌యానికి వ‌స్తే మెహ‌బూబ్ సైగ చేయ‌డం వ‌ల‌న‌నే సోహైల్ రూ.25ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని ఇద్ద‌రిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

Sohail Meha | Telugu Rajyam

డబ్బులు తీసుకునే ఆఫర్‌ గనుక వస్తే వదిలిపెట్టొద్ద‌ని మెహ‌బూబ్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న క్ర‌మంలో సోహైల్ స్పందించాడు. మంగళవారం సోహైల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియోలోకి వ‌చ్చి నెటిజ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధానం ఇచ్చాడు. మెహ‌బూబ్ సైగ విష‌యం కూడా ప్ర‌స్తావ‌న‌కు రాగా, దీనిపై స్పందించిన సోహైల్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఏం జ‌రుగుతుంద‌నేది ఎవ‌రికి తెలియ‌దు. ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు పోతారో కూడా తెలియ‌దు. వాడు ఏదో గ్లాస్‌పై చేయి ప‌ట్టి అలా అన్నాడు, నాకు అస‌లు ఏం అర్ధం కాలేదు. టాప్‌ 3లో ఎవరుంటరనేది ఎవరూ జడ్జ్‌ చేయలేదు. నేడు విన్నర్‌ అయ్యే వాడినేమో, టాప్‌ 2లో ఉండే వాడినేమో. వాడు ఎలా చెప్తడు. వాడికి ఎలా తెలుస్తోంది. మెహబూబ్‌ బిగ్‌బాస్‌ కాదు అంటూ సోహైల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మెహ‌బూబ్ ఏమ‌న్నాడో నాకు అర్ధం కాక అఖిల్‌ని కూడా అడిగాను. ఏదో ఒకటి ప‌ట్టుకొని వీడియోలు చేయ‌డం అస్స‌లు బాలేదు. ప‌ది సంవ‌త్స‌రాల క‌ష్టం మీద ఒట్టేసి చెబుతున్నా. వాడు అన్న‌ది నాకు అర్ధం కాలేదు. టాప్ 3లో ఉంటాన‌ని నాకు తెలియ‌దు. అస‌లు థర్డ్‌ ప్లేస్‌లో ఉన్న వాళ్లకు డబ్బులు ఇస్తారని మెహబూబ్‌కు ఎలా తెలుసు. నేను మోసం చేస్తే నా కెరీర్‌లో బాగుప‌డ‌ను. అభిజీత్ ఫ్యాన్స్‌కు చెబుతున్నా. నేను తప్పు చేయలేదు. బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవరికి తెలియ‌దు అని సోహైల్ స్ప‌ష్టం చేశాడు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News