శాకుంత‌లం నుండి బిగ్ స‌ర్‌ప్రైజ్ .. శకుంత‌ల‌గా అక్కినేని కోడ‌లు..!

భారీ సెట్స్‌, అద్భుత‌మైన గ్రాఫిక్స్‌తో మెమోర‌బుల్ చిత్రాల‌ని తెర‌కెక్కించిన గుణ‌శేఖ‌ర్ కొన్నాళ్ళుగా సైలెంట్‌గా ఉన్నాడు. ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన గుణ‌శేఖ‌ర్ కొన్నాళ్ళుగా రానాతో హిర‌ణ్య‌క‌శ్య‌ప అనే సినిమా చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తూ వ‌చ్చాడు. అయితే ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్న రానా ఈ సినిమా చేయాలంటే కొన్నాళ్ళు టైం ప‌ట్టేలా ఉంది. ఈ లోపు మ‌రో సినిమా చేయాలని భావించిన గుణ‌శేఖ‌ర్ సొంత నిర్మాణ సంస్థలో శాకుంతలం అన్న సినిమా ప్రకటించాడు.

మ‌హాభార‌తంలోని అద్భుత ఘ‌ట్టం ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్‌ని జ‌న‌వ‌రి నుండి ఇస్తాన‌ని చెప్పిన గుణ‌శేఖ‌ర్ ఈ రోజు న్యూయ‌ర్ సంద‌ర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సమంత అక్కినేని శాకుంతలంగా నటించబోతున్నట్టు గుణశేఖర్ బృందం మోషన్ టీజర్ ని రిలీజ్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌కి సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. విశ్వామిత్రుడు, మేన‌క‌ల కుమార్తె అయిన శకుంత‌ల.. దుష్యంతునితో ప్రేమ‌లో ప‌డుతుంది. శకుంత‌ల పుట్టుక, గాంధ‌ర్వ వివాహం, క‌ష్టాలు అన్నింటిని త‌న సినిమాలో అద్భుతంగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. రానా ఇందులో దుష్యంతుడిగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ ఏడాది జ‌ర్నీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌మంత మ‌ళ్ళీ ఏ సినిమాకు సైన్ చేయ‌లేదు. నందిని రెడ్డితో సినిమా అన్నారు త‌ప్ప దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న లేదు. ప్ర‌స్తుతం సామ్ జామ్, ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లు చేస్తున్న స‌మంత ఈ ఏడాది తొలి ప్రాజెక్ట్‌గా శాకుంత‌లం అనే సినిమా ప్ర‌క‌టించే స‌రికి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు స‌మంత ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.