Samantha: ఆ డైరెక్టర్ తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న సమంత… ఏదో తేడా కొడుతోందిగా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడైతే నాగచైతన్య రెండవ వివాహం చేసుకున్నారో సమంత కూడా రెండో పెళ్లి తప్పకుండా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉంది అంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా సమంత డేటింగ్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఎక్కడ కూడా సమంత స్పందించలేదు కానీ తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం సమంత డేటింగ్ లో ఉందని ఏ క్షణమైన ఈమె తన రెండవ పెళ్లి గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. తాజాగా సమంత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పికిల్‌బాల్ టోర్నమెంట్‌ కి సంబందించిన ఫోటోలు షేర్ చేసింది.

ఇందులో పికిల్‌బాల్ ప్లేయర్స్ తో కలసి సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫొటోలలో సిటాడెల్: హనీ బన్నీ దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించాడు. ఈ ఫోటోలలో సమంత ఏకంగా తన చేయి పట్టుకుని కనిపించడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ సమంత డేటింగ్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇలాంటి తరుణంలోనే వీరిద్దరూ ఇలా చట్టా పట్టాలేసుకొని కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని నేటిజన్స్ ఫిక్స్ అయ్యారు అయితే ఈ వార్తలను కొంతమంది సమంత అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఇద్దరు మనుషులు కాస్త చనువుగా కనపడితే వారి మధ్య ఏదో ఉన్నట్టేనా అంటూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అయితే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటించిన విడుదల అయిన తరువాతనే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడంతో సమంత డైరెక్టర్ రాజ్ డేటింగ్ వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.