సిక్కోలు సింహం కోసం దిగొచ్చిన‌ రామ్మోహ‌న్ నాయుడు!

ఇటీవ‌లే గాల్వానా దుర్ఘ‌ట‌న‌లో అమ‌రుడైన క‌ల్న‌ల్ సంతోష్ బాబు ను తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఎంత భ‌రోసా క‌ల్పించిందో చూసాం. ఐదుకోట్ల రూపాయ‌లు, సంతోష్ బాబు భార్య‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్ స్థాయి ఉద్యోగాన్ని ఇచ్చారు సీఎం కేసీఆర్. అదే ఘ‌ట‌న‌లో వీర‌మ‌ర‌ణం పొందిన మిగ‌తా సైనికుల‌కు కేసీఆర్ ఒక్కొక్క‌రికి 10 ల‌క్ష‌లు చొప్పున అంద‌జేసారు. మ‌న రాష్ర్టం కాక‌పోయినా ఓ సైనికుడికి ఇవ్వాల్సిన భ‌రోసా అంటూ సీఎం కేసీఆర్ ఆ విధంగా ముందుకెళ్లారు. నిజంగా ఇది గొప్ప విష‌యం. ఏ రాష్ర్ట ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ ఇలా స్పందించ‌లేదు. అందులో కేసీఆర్ ని ఓ లెజెండ్ లా కీర్తించాల్సిందే.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాన్స్ నాయ‌క్ ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కార్గిల్ స‌మీపాన అశువులు బాసిన సంగ‌తి తెలిసిందే. విస్ఫోటన ప‌దార్థాల‌ను నిర్వీర్యం చేస్తోన్న స‌మ‌యంలో అవి పేల‌డంతో ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అమ‌రుడ య్యారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి వారం పూర్త‌యింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై రాష్ర్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ప‌క్క రాష్ర్ర సీఎం కేసీఆర్ ఓ సైనుకుడ్ని ఎంతో గొప్ప‌గా గౌర‌విస్తే ఏపీ ప్ర‌భుత్వ అధికారులు గానీ, సీఎం గానీ ఈ వీరుడి గురించి క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా స్పందించoదిలేదు. మ‌రీ ఈ విష‌యం సీఎం కు తెలుసా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ ఘ‌ట‌న జ‌రిగి వారం పూర్త‌యిన స్పందిక‌చ‌క‌పోవ‌డంతో విమ‌ర్శ‌లైతే వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు ముందుకొచ్చారు. ఆయ‌న కుమార్తెల పేర‌టి 25 వేల చొప్పున ఫిక్స్ డు డిపాజిట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా న‌గ‌రిలో ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విగ్రహం ఏర్పాటు చేస్తాన‌న్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్ప‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. అమ‌రుల త్యాగాల‌కు విలువ ఇవ్వాల‌న్నారు. ఎవ‌రి ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా  సైనికుల్ని క‌చ్చితంగా గౌర‌వించుకోవాల‌న్నారు. సిక్కోల సింహాన్ని ఆదుకునేందుకు జిల్లా వాసులంతా ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. అదేవిధంగా తండ్రి దివంగ‌త నేత ఎర్ర‌న్నాయుడు స్థాపించిన భవానీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున లావేటి ఉమామ‌హేశ్వర‌రావు విగ్ర‌హం ఏర్పాటు చేస్తాన‌న్నారు.