Home News ప్ర‌ణీత‌ది ఎంత మంచి మ‌న‌సు..రామమందిర నిర్మాణానికి కూడా సాయం చేస్తుంది

ప్ర‌ణీత‌ది ఎంత మంచి మ‌న‌సు..రామమందిర నిర్మాణానికి కూడా సాయం చేస్తుంది

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో కొత్త అధ్యాయం లిఖిత‌మైంది. 492 ఏళ్లు సాగిన పోరాటంకు న‌రేంద్ర మోదీ కొత్త అధ్యాయం లిఖించారు. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్య‌క్తుల మ‌ధ్య‌.. విశిష్ట భూమిపూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వేద మంత్రాల న‌డుమ పూజ చేయగా, న‌వ‌భార‌త నిర్మాణం, లోక‌క‌ళ్యాణం కోసం, రామ‌రాజ్యం కోసం త్వ‌ర‌లోనే రామాల‌య నిర్మాణాన్ని పూర్తి చేయ‌నున్నారు. అభిజిత్ ముహూర్తంలో పూజ‌ను నిర్వ‌హించారు. 31 ఏళ్ల క్రితం తెచ్చిన 9 ఇటుక‌ల‌తో శిలాపూజ నిర్వ‌హించారు. ఆల‌యాన్ని అత్య‌ద్భుతంగా నిర్మించాల‌ని భావించిన ట్ర‌స్ట్‌ రామ మందిర్ నిధి పేరుతో విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుటికే ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు చేప‌డుతున్నారు.

Prani | Telugu Rajyam

రామ్ మందిర్ నిర్మాణానికి ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజకీయ‌, క్రీడా ప్ర‌ముఖులు త‌మ వంతు విరాళాలు అందించారు. బాపు బుట్ట‌బొమ్మ ప్ర‌ణీత కూడా సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. క‌రోనా పాండ‌మిక్ సమ‌యంలో ఎన్నో విరాళాలు అందిచ‌డ‌మే కాక ఆక‌లితో ఉన్న వారికి సొంత ఖ‌ర్చుతో భోజ‌నాలు పెట్టిన ప్ర‌ణీత ఇప్పుడు రామ మందిర నిర్మాణం కోసం ల‌క్ష రూపాయ‌ల‌ను ఇస్తున్న‌ట్టు పేర్కొంది. అలానే విరాళాలు అందించాలని కోరుతూ ఓ వీడియోను ప్రణీత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కరోనా స‌మయంలో అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చిన ప్ర‌ణీత ఇటీవ‌ల మాల్దీవుల‌కు వెళ్ళిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక ఒక‌ప్పుడు తెలుగు సినిమాల‌తో బాగానే అల‌రించిన ప్ర‌ణీత ఇప్పుడు పెద్ద‌గా టాలీవుడ్లో ఆఫ‌ర్స్ అందుకోలేకపోతుంది.

- Advertisement -

Related Posts

త్వరలో రైతులకి తీపికబురు చెప్ప‌నున్న మోడీ సర్కార్ … ఏంటంటే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అతి త్వ‌ర‌లో రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నుందా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రైతులకు ఏడాదికి రూ.6వేల‌ను కిసాన్ స‌మ్మాన్ నిధి...

విడుదలకు ముందు అనూహ్యపరిణామాలు .. కరోనా బారిన పడ్డ శశికళ !

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లను ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే...

గవర్నర్ తో భేటీ కానున్న నిమ్మగడ్డ.. ఆ వ్యవహారమే కారణమా ?

నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని కలవనున్నారు. ఆయన కలవడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు చిత్తూరు, కలెక్టర్ ల వ్యవహారం...

ఈ సారి హిట్ పక్కా.. నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ వైరల్

యంగ్ హీరో నాగ శౌర్య ఓ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం రకరకాల పాత్రలను, కథలను ఓకే చేస్తున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లోపెట్టేశాడు. ప్రస్తుతం నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. లక్ష్య...

Latest News