బాలయ్య ‘అఖండ’ టీజర్ రివ్యూ – భీభత్సం

Power packed Akhanda teaser from Balakrishna

Power packed Akhanda teaser from Balakrishna

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కొత్త చిత్రం మీద ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ‘సింహ, లెజెండ్’ లాంటి హిట్ల తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రం కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది. ఆ క్రేజ్ ను అందుకోవడానికి బోయపాటి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఛాన్నాళ్లుగా సినిమా టైటిల్, బాలయ్య లుక్ మీద అనేక పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉగాది సంధర్బంగా టైటిల్ టీజర్ రివీల్ చేశారు.

సినిమాకు ‘అఖండ’ అనే పేరును ఫైనల్ చేశారు. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టే టైటిల్ హెవీగానే ఉంది. ఇక బోయపాటి సినిమా అంటే బాలయ్య పాత్రలో వేరియేషన్స్ ఖాయం. ఇందులో కూడ అలాంటి వేరియేషనే ఒకటి ఉంది. దాన్నే రివీల్ చేశారు. అఘోరా స్థాయిలో కాకపోయినా ఆ పోలికలతో ఉంది బాలయ్య గెటప్. అన్ని సినిమాల్లోనూ హెయిర్ స్టయిలే కవర్ చేసే ఆయన ఈ పాత్రలో మాత్రం ఒరిజినల్ లుక్ ఉంచుకున్నారు. అది బాగా సెట్టైంది. బాలయ్య వేషధారణ, చేతిలో త్రిసూలం, విభూది బొట్లతో పవర్ఫుల్ గా కనబడ్డారు.

ఇక ‘హ‌ర‌హ‌ర మ‌హాదేవ శంభో శంకర. కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది. కారు కూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్దీ’ అంటూ చెప్పిన డైలాగ్ మాస్ జనానికి కావాల్సిన కిక్ ఇచ్చేలా ఉంది. మొత్తానికి టైటిల్, లుక్, డైలాగ్ తో టీజర్ భీభత్సం అనేలానే ఉంది.

YouTube video player