జేసి ఫ్యామిలీకి మద్దతుగా పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు

Paritala Shriram comments in support of the Jc family

అనంతపురంలో జేసి, పరిటాల ఫ్యామిలీల మధ్య రాజకీయ శత్రుత్వం గత రెండు దశాబ్దాల ముందు నుండే ఉంది. రాజకీయ చదరంగం లో ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పటికీ వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గు మంటుంది. గత కొన్నేళ్లుగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. తాజాగా జేసీ పై జరిగిన దా-డిని పరిటాల శ్రీరాం ఖండించారు. జేసి కుటుంబానికి మద్దతుగా శ్రీరాం మాట్లాడటం, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శ్రీరామ్ మాట్లాడుతూ… “అనంతపురంలో స్నేహలత అమ్మాయి సంఘటన కానీ, తాడిపత్రిలో జరిగిన సంఘటన కానీ, జిల్లాలో శాంతిబధ్రతలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది. స్నేహలత అయితే, వాళ్ళ తల్లి దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోవ పోవటం వలన, ఈ రోజు ఆ అమ్మాయి దూరం అయ్యింది. అదే దిశా చట్టం, ఘటనలు జరగక ముందే భయం కల్పించే విధంగా ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది కానీ, ఘటనలు జరిగిపోయిన తరువాత, గొప్పగా చెప్పుకోవటానికి తప్ప దేనికీ ఉపయోగపడదు.

Paritala Shriram comments in support of the Jc family
Paritala Shriram comments in support of the Jc family

దిశ పోలీస్ స్టేషన్ లు కానీ, ఆ యాప్ లు కానే పెట్టేది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి, ఘటనలు జరిగిన తరువాత స్పందించటానికి కాదు. ఇప్పుడు ఉండే పోలీసులు అంతా, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టటం, తప్పుడు కేసులు బనాయించటం, ఏది జరగకుండానే, జరిగినట్టి చిత్రీకరించి ఇబ్బంది పెట్టటం చేస్తున్నారు. రాజకీయ నాయకులు చెప్పినట్టుగా పోలీసులు చేయటం మానేసి, సామాన్య ప్రజల భద్రత గురించి చూసుకుంటే, ఇలాంటి స్నేహాలతలు బ్రతికేవారు.”

“తరువాత రోజే తాడిపత్రిలో, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి, ఒక ఎమ్మెల్యే వెళ్లి హడావిడి చేసి వస్తే, ఇప్పటి వరకు కేసు కట్టే వాడు లేడు. వాళ్ళు పెట్టలేదు అని కాకుండా, రాష్ట్రం మొత్తం భయానక పరిస్థితి తెప్పించిన ఇలాంటి కేసులు పై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలి. చాలా ఏళ్లుగా, సంవత్సరాలుగా, ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత నెలకొల్పటానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ ఈ రోజు అదే పధ్ధతులు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం ఉందని, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, జేసీ ప్రభాకర్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పోయి ఉంటే, మీరు మీ మగతనాన్ని కరెక్ట్ గా ప్రూవ్ చేసుకునే వారు. వాళ్ళు లేనప్పుడు పోయి హడావిడి చేయటం కాదు. కానీ చేస్తున్నారు. ప్రతి సారి టైం మీదే ఉండదు. ప్రభుత్వం మారుతుంది. పరిణామాలు మారతాయి. దానికి మూల్యం కచ్చితంగా చెల్లించుకుంటారు. ముఖ్యంగా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ కోరుకునేది, ప్రశాంతంగా ఉండాలని మేము కృషి చేస్తున్నాం. మీరు ఇలాగే రెచ్చగోడితే, మీరే ఇబ్బందులు పడతారు” అని శ్రీరాం అన్నారు.