ట్రోలింగ్ వ‌ల‌న నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాన‌ని చెప్పిన స‌మంత‌!

0

అక్కినేని స‌మంత సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్ట‌డం లేదా నెటిజ‌న్స్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించ‌డం వంటివి చేస్తూ ఉంటుంది. నెటిజ‌న్స్ ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగిన చాలా ఓపిక‌గా, త‌న‌దైన శైలిలో బ‌దులిస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌కు వ‌చ్చిన స‌మంత నెటిజ‌న్స్‌తో కొద్ది సేపు ముచ్చ‌టించింది. ఇందులో భాగంగా 2020లో మంచి చెడులు ఏంటనే అంశాల గురించి అడిగారు. అంతేకాక ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన ఏ సినిమాలోని పాత్ర ఎక్కువ‌గా ఇష్టం అని అడ‌గ‌గా, వాటికి సామ్ ఓపిక‌గానే స‌మాధాన‌లు ఇచ్చింది.

Samantha Akkineni Enjoys Goa In 2021 New Year Celebration
 

ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌లో ఓ బేబీ, ది ఫ్యామిలీ మెన్ రోల్స్ చాలా బాగా ఎంజాయ్ చేసానంటుంది స‌మంత‌. తొలిసారి ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ చేస్తుండ‌గా, ఇందులో నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక 20 ఏళ్ల వ‌య‌స్సులో మీ ఆలోచనా ధోర‌ణి ఎలా ఉండేది అన్న ప్ర‌శ్న‌కు అప్పుడు ఏం ఉంటుంది జీవితంలో ఎద‌గాలి అనే తాప‌త్ర‌యం ఒక్కటే ఉండేద‌ని పేర్కొంది. ఇక 2020లో మంచి జ్ఞాపకం అంటే రానా పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫొటో షేర్ చేసింది. ఇక సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌పై మీ ఆలోచ‌నా ధోర‌ణి ఏంటంటే దానికి మంచి స‌మాధానం ఇచ్చింది.

ట్రోలింగ్ ఒక‌ప్పుడు నిద్ర‌లేని రాత్ర‌లు గ‌డిపాను. కాని ఇప్పుడు వాటిని చూస్తు న‌వ్వుకుంటున్నాను. అయిన మ‌న‌పై ట్రోల్ చేస్తున్నారంటే ఎదిగామ‌నే క‌దా అని స్ట‌న్నింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చిన సామ్ నెటిజ‌న్స్‌కు మంచి వినోదాన్ని పంచింది. ప్ర‌స్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న స‌మంత త్వ‌ర‌లో గుణశేఖ‌ర్ తెర‌కెక్కించ‌నున్న శాకుంత‌లం సినిమాలో న‌టించ‌నుంది. ఇందులో శ‌కుంత‌ల‌గా క‌నిపించి అల‌రించ‌నుంది. 

వామ్మో! ప్ర‌దీప్‌తో శ్రీముఖి, అన‌సూయ‌, ర‌ష్మీల రచ్చేంది.. వైర‌ల్‌గా మారిన వీడియో

0

బుల్లితెర రారాజుగా పేరొందిన ప్ర‌దీప్ త‌న చ‌లాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్‌ని కూడా త‌న షోకు పిలిపించి వారితో ఫ‌న్ చేయించాడు. ప్ర‌దీప్ హోస్ట్ చేసిన ఈ షోకు అయిన మినిమం రేటింగ్ త‌ప్ప‌క వ‌చ్చి తీరుతుంది. అయితే ఇన్నాళ్ళు బుల్లితెర‌పై సంద‌డి చేసిన ప్ర‌దీప్ ఇప్పుడు వెండితెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నాడైరెక్ష‌న్‌లో 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా అనే సినిమా చేశాడు.

30 Rojullo 1 | Telugu Rajyam

క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డ ఈ చిత్రం జ‌న‌వ‌రి 29న థియేట‌ర్స్‌లోకి రాబోతుంది. రిలీజ్‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్రమే ఉండ‌డంతో వీలైనంత మేర‌కు మూవీని జ‌నాల్లోకి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ప్ర‌దీప్‌తో జ‌ర్నీ కొన‌సాగిస్తూ వ‌స్తున్న అన‌సూయ‌, శ్రీముఖి, ర‌ష్మీలు ఆయ‌న‌కు త‌మ వంతూ స‌పోర్ట్ అందిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘వా వా మేరే బావ’ అంటూ సాగే ప్ర‌మోష‌నల్ సాంగ్‌లో ప్ర‌దీప్‌తో క‌లిసి ర‌చ్చ ర‌చ్చ చేశారు. సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించిన ఈ సాంగ్‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ భారీ రెస్పాన్స్ ద‌క్కించుకోగా, మిగ‌తా పాట‌లు కూడా శ్రోత‌ల‌ను అల‌రించాయి.తాజాగా విడుద‌లైన వా వా మేరే బావ అనే పాట కూడా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అదిరిపోయింది. ఇక ప్ర‌దీప్ స‌ర‌స‌న క‌థా‌నాయిక‌గా న‌టించిన అమృతా అయ్య‌ర్ గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌తో ఆక‌ట్టుకోనుంది. క‌న్నడలో ప‌లు విజయవంతమైన సినిమాలు తీసిన ఎస్‌.వి.బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. జీఏ2, యూవీ క్రియేష‌న్స్ 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. 

ఈ దాడి మోడీ, అమిత్‌షా పతనానికి నాంది అవుతుంది: రేవంత్ రెడ్డి

0

హైదరాబాద్: ఢిల్లీలో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతుల‌పై పోలీసుల లాఠీచార్జ్, బాష్ప‌వాయువు గోళాలు ప్ర‌యోగించ‌టంపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఢిల్లీలో దాడి జరగడం అమానుషమని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులపై జరిగిన దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షాపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే కల్పించిందన్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy Sensatiional Comments On Modi And Amit Shah
revanth reddy sensational comments on modi and amit shah

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే రైతుల హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతన్నలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ కి పోలీస్ లే అనుమతిచ్చి దాడి చేశారని మండిప‌డ్డారు. ఢిల్లీ వీధుల్లో రైతన్న పై దాడి చేసిన చరిత్ర ప్రధాన మంత్రి మోడి కే దక్కుతోందన్నారు రేవంత్. ఇది రైతు ప్రభుత్వం కాదని.. అదాని, అంబానీల ప్రభుత్వమ‌ని ఆరోపించారు. ఈ దాడితో మోడీ, అమిత్‌షా పతనానికి నాంది పడిందన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఇంటరెస్టింగ్ న్యూస్ !

ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల హడావిడి ఉన్నప్పటికీ పార్టీలన్నీ తిరుపతి ఉప ఎన్నిక మీదనే వ్యూహాలు తయారు చేస్తున్నారు. ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ బలంగా ఆ సీటు కోసం వెంపర్లాడుతున్నాయి, ఈ కోవలోనే ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ-జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ గెలుపు కోసం అహర్నిశలు పాటు పడుతోంది. ఉప ఎన్నిక వ్యూహంలో భాగంగా పార్టీలన్నీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తున్నారు.

Janasena And Bjp Parties Are Changed Their Strategy In Tirupati By Elections
janasena and bjp parties are changed their strategy in tirupati by elections

వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కుటుంబానికి కాకుండా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతున్నాయి. గురుమూర్తిని దాదాపుగా ఖాయం చేశాయి. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఇప్పటికే ఖరారయ్యారు. ఇప్పుడు ఇరుపార్టీలు ఇప్పుడు మరో కొత్త ఆప్షన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సహజంగానే బీజేపీలో మేధావులు బ్యూరోక్రాట్లకు పెద్దపీట వేస్తారు. ఈ క్రమంలోనే బీజేపీతోపాటు జనసేన కూడా ఇప్పుడు ఓ కొత్త అభ్యర్థి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

తిరుపతిలో జనసేన లేదా బీజేపీ ఎవరు పోటీచేసినా గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బీజేపీ తరుఫున మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు బ్యూరోక్రాట్ దాసరి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయం అంటున్నారు. ఇక తాజాగా తిరుపతి ఉప ఎన్నిక కోసం బీజేపీ-జనసేన అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు బలంగా వినిపిస్తోంది. ఏపీకి చెందిన ఈమె రిటైర్ మెంట్ తర్వాత బీజేపీలో చేరారు. ఈమె అయితేనే బెటర్ అని మిత్ర పార్టీలు బలంగా నమ్ముతున్నాయట, ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.

‘లవ్ స్టోరీ’ దెబ్బకి వెనక్కి తగ్గుతున్న ‘టక్ జగదీష్’ !

కోవిడ్ కారణంగా అతలాకుతలం అయిన చిత్ర పరిశ్రమకి ప్రాణం పోస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన సడలింపులివ్వటంతో వరుసపెట్టి షూటింగ్స్ జరుపుకుంటూ , పూర్తయిన సినిమాలన్నీ ఇబ్బడిముబ్బడిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పోటీ ఎక్కువయిపోయి కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు కలుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ లో రెండు సినిమాలు ఓకే విడుదల తేదీ ప్రకటించటంతో ఇండస్ట్రీలో హాట్ గా చర్చ జరుగుతుంది.

Nani'S Tuck Jagadish Makers Planning To Change The Release Date
nani’s tuck jagadish makers planning to change the release date

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ మూవీ ఏప్రిల్ 16న విడుదల కాబోతోందని ఈనెల 9న సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. గతేడాది నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కంబినేషన్ లో వచ్చిన ఈ ‘V’ సినిమా ఓటీటీలో విడుదలవగా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ మూవీతో తిరిగి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్న నానికి, అక్కినేని నాగచైతన్య పెద్ద షాక్ ఇచ్చారు.

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీలో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 16న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం సోమవారం నాడు వెల్ల‌డించింది. దీంతో నాని, నాగచైతన్య సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతూ పోటీపడబోతున్నాయి.

పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలయినా వారికున్న అశేష అభిమానుల వలన కలెక్షన్స్ లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఒకేరోజు వస్తే కలెక్షన్స్ మీద ప్రభావం బాగానే ఉంటుంది. లవ్ స్టోరీ ని నైజాంలో అత్యధిక థియేటర్లు కలిగి ఉన్న దిల్ రాజు, సునీల్ నారంగ్ లు పంపిణి చేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్స్, కలెక్షన్స్ ల విషయంలో ఇబ్బందులుంటాయని టక్ జగదీష్ నిర్మాతలు ఒక అడుగు వెనకేయబోతున్నట్లుగా సమాచారం. లవ్ స్టోరీ విడుదలయిన వారం తర్వాత ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకి వస్తారట. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన అతి త్వరలోనే ప్రకటిస్తారట.

సలహాదారుల మీద పిచ్చ సీరియస్ గా ఉన్న జగన్ ?

ఆంధ్ర ప్రదేశ్ : పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సుప్రిం కోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరటంలో తప్పు లేదు. అందుకు చూపించిన కారణంలో తప్పు పట్టాల్సిందీ లేదు. అయినా సుప్రింకోర్టు ప్రభుత్వ వాదనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయాలు అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా సుప్రింకోర్టు మాత్రం సమర్ధించింది. పైగా ప్రభుత్వ-నిమ్మగడ్డ వివాదాన్ని సుప్రింకోర్టు ‘ఇగో బ్యాటిల్’ అని అభివర్ణించింది. మరి ఇగో బ్యాటిల్ కు కారణం ఎవరు ? ఎవరి దగ్గర నుండి మొదలైంది.

Jagan Mohan Reddy Serious On Advisory Team
jagan mohan reddy serious on advisory team

ఎన్నికల కమీషన్ తో వివాదం పెట్టుకోవాల్సిన అంత అవసరం జగన్ ప్రభుత్వానికి లేదు. పంచాయితి ఎన్నికలకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వగానే ప్రభుత్వం నుండి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు మొదలైపోయుంటే ఇప్పుడింతగా గొడవ ఉండేది కాదు. ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసినాక కోర్టులు కూడా జోక్యం చేసుకోదన్న విషయాన్ని జగన్ కు సలహాదారులు చెప్పలేదా ? సరే ఏదో ప్రత్యేక పరిస్ధితులున్నాయని ప్రభుత్వం అనుకుంటే దాన్ని సమర్ధవంతంగా కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా.

ఒకే కారణాన్ని హైకోర్టు, సుప్రింకోర్టులో పదే పదే చెప్పినందువల్ల ఉపయోగం లేదని సలహాదారులు, అడ్వకేట్ జనరల్ ముఖుల్ రోహిత్గీ లాంటి వాళ్ళు చెప్పలేదా ? ఎప్పటికిప్పుడు వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని సలహాదారులు చెప్పారో లేదో తెలీదు. ఇంతక ముందు కమీషనర్ కు నిమ్మగడ్డను తీసేసినపుడు కూడా ఇదే సమస్య వచ్చింది. నిమ్మగడ్డను కమీషనర్ గా తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్న విషయం జగన్ కు తెలీదా ? ఒకవేళ జగన్ కు తెలీకపోయినా సలహాదారులు చెప్పాలి కదా.

నిమ్మగడ్డతో వివాదం పెట్టుకోవటం వల్ల జగన్ తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లయ్యింది. కమీషనర్ హోదాలో నిమ్మగడ్డకు రాజ్యాంగబద్దమైన రక్షణ ఉంటుందన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు. కాబట్టి నిమ్మగడ్డను దెబ్బకొట్టాలంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాకుండా తెలివిని ఆయుధంగా చేసుకోవాలన్న విషయాన్ని సలహదారులు చెప్పినట్లు లేరు. తన పక్కనున్న సలహాదారుల నిర్ణయాల వల్ల కోర్టుల్లోనూ, బయటనూ దెబ్బతినటంతో విసిగిపోయిన జగన్ వారందరి మీద సీరియస్ అయ్యారట.

పవన్ కు బీజేపీ వల్లనే నష్టం కలుగుతుందా!! మత, కుల రాజకీయాల రంగు పవన్ కు కూడా అంటుకుందా!!

జనసేన పార్టీని స్థాపించి కొత్తతరమైన రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పిన విధంగానే మొదట నుండి ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రజల పక్షాన నిలబడటానికి అధికారం అవసరం లేదని పవన్ కళ్యాణ్ నిరూపించారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కు కుల, మతాల రంగు అంటుకుంది. దీనికి కారణం బీజేపీతో పొత్తునేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
Bjp Should Sacrifice For Pawan Kalyan 
BJP should sacrifice for Pawan Kalyan 

బీజేపీ రాజకీయాలు పవన్ ను దెబ్బతిస్తున్నాయా!!

ఇక తాను అందరి వాడిని అని 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ 2019 నాటికి మాత్రం చాలా రకాలుగా జనంలో నానారు. ఆయన చివరికి పోటీ చేసిన రెండు సీట్లూ కూడా కాపులు ప్రాబల్యం ఉన్నవి కావడంతో కోరి మరీ ఆ కులం రొచ్చులోకి దిగారా అన్న విమర్శలు అయితే వచ్చాయి. పైగా ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ చేస్తున్న కుల, మత రాజకీయాలు జనసేనకు కూడా అంటుకుంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవిని పెట్టినప్పుడు కూడా ఈ కుల, మత రంగు అంటుకోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

పవన్ కుల రాజకీయాలను దాటి ఎదగగలడా!!

ఏపీ రాజకీయాలు చూసిన వారికి కుల ప్రభావం ఎంత ఉన్నా కూడా దాన్ని దాటి ఆలోచించేవారి వల్లనే ఘనమైన విజయాలు దక్కాయని చరిత్ర నిరూపించిన సత్యం. ఏపీలో మత రాజకీయాలకు అసలు తావు లేవు. అలాగే ఒక కులానికి చెందిన నాయకులకు గుత్తమొత్తంగా ఓట్లు వేసి గెలిపించిన చరిత్ర కూడా లేదు. కాబట్టి రానున్న రోజుల్లో సీఎం కావాలనుకుంటున్న పవన్ ఇప్పుడు బీజేపీ వల్ల వచ్చిన కుల, మత రంగును దాటుకుని ఎదగగలడో, లేదో వేచి చూడాలి.

లోకేష్ కోసం బాబు ప్రత్యేకమైన వ్యూహం రచిస్తున్నాడా!! వైసీపీకి లోకేష్ చెక్ పెట్టనున్నారా!!

2019 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఇప్పుడు పతనావస్థకు చేరువలో ఉంది. ఇప్పుడు ఆ అపార్టీని కాపాడటానికి ఒక కొత్త శక్తి రావాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో టీడీపీని తానే కాపాడుతానని లోకేష్ అంటున్నట్టు టీడీపీ నాయకులు చెప్తున్నారు. 2019 ఎన్నికల వరకు నారా లోకేష్ ను రాజకీయాల్లో ఎవ్వరు సీరియస్ గా తీసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు లోకేష్ యొక్క దూకుడును చూసి ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా భయపడుతున్నారు. లోకేష్ ను రాజకీయంగా బలపరచడానికి బాబు ప్రత్యేకమైన వ్యూహం రచిస్తున్నారు.
Nara Lokesh Comes With Different Strategy On Cm Jagan
nara lokesh comes with different strategy on cm jagan

లోకేష్ రాజకీయం- బాబు వ్యూహం

రానున్న రోజుల్లో టీడీపీని నడిపించే నాయకుడిగా లోకేష్ ను తయారు చెయ్యడానికి చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు. ఒక నాయకుడిగా పార్టీని ఎలా నడిపించాలో లోకేష్ కు నేర్పించే పనిలో బాబు ఒక టీం ను ఏర్పాటు చేశారు. లోకేష్ దూకుడు చంద్రబాబును సైతం మించిపోయింద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు. ప్రస్తుతం లోకేష్ దూకుడు భ‌విష్యత్ రాజ‌కీయ ప‌రిణామాలు అనే అంశంపై చంద్రబాబు సూచ‌న‌ల మేర‌కు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, స‌హా కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామ‌హేశ్వ‌రరాలు రిపోర్టు త‌యారు చేస్తున్నార‌ట‌. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని అంటున్నారు. పొలిటిక‌ల్ డేటా బేస్‌లో లోకేష్ హీరోగా మెరిసేందుకు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు స‌ల‌హాలు వీరు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

లోకేష్ పార్టీని నడిపించగలడా!!

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోలేదు. కానీ ఇప్పుడు పార్టీని నడిపించే బాధ్యతను చంద్రబాబు నాయుడు లోకేష్ పై పెడుతున్నారు. ఈ భాధ్యతను లోకేష్ ఎంతవరకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి. ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విధానం చూస్తుంటే రానున్న రోజుల్లో వైసీపీకి లోకేష్ వల్ల కష్టాలు రానున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

Today Horoscope : జనవరి 27th బుధవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి : ఈరోజు వివాదాలు సర్దుకుంటాయి !

ఈరోజు మీకు శుభఫలితాలు ఉంటాయి. నూతన వస్తువులు, ఇళ్లు కొంటారు. ఈరోజు మీకు గౌరవం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈరోజు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ భార్య నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఈరోజు ఆనందంగా సరదాగా గడుపుతారు. శ్రీలక్ష్మీగణపతిని ఆరాధించండి.

వృషభ రాశి:  ఉద్యోగాలలో నిరాశ !

ఈరోజు పనుల్లో ప్రతిబంధకాలు. ఈరోజు మీరు తీరిక లేకుండా గడపుతారు. కొత్త రుణాలు చేస్తారు. ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. పనిలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ప్రయోజనాలు. ఈరోజు కుటుంబసభ్యులతో విభేదాలు. శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. ఈరోజు ఉద్యోగాలలో నిరాశ. సూర్యారాధన చేయండి.

మిథున రాశి : ఈరోజు వివాదాలు తీరతాయి !

ఈరోజు శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. సామాజిక కార్యకలాపాల్లో కొంత ఆటంకాలు ఉండవచ్చు. ఈరోజు ఆకస్మిక ప్రయోజనం కారణంగా ఆధ్యాత్మిక, ధార్మిక ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. మీ నుదుటి మీద తెలుపు గంధాన్ని వర్తించండి.

Today January 27Th  2021 Daily Horoscope In Telugu
today january 27th 2021 daily horoscope in telugu

కర్కాటక రాశి: వ్యాపారాలు మందగిస్తాయి !

ఈరోజు పనులలో ఆటంకాలు.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. కష్టపడి పనిచేస్తే ఫలితాలను పొందుతారు. పిల్లలపై మీ విశ్వాసం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. ఈరోజు మీరు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు నూతన పనులు చేసేందుకు సంతోషంగా ఉంటారు. అశ్వత్థవృక్షం ప్రదక్షణలు చేయండి.

సింహ రాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవహారాలలో విజయం. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు, ఆశీర్వాదాలతో పెద్ద విషయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఈరోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని విజయం సాధిస్తారు. ఆర్ధికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డులను విరాళంగా ఇవ్వండి.

కన్య రాశి: ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది !

ఈరోజు విద్యార్థుల యత్నాలు సఫలం.ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. మీకిష్టమైన పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. అనవసర ఖర్చులను నివారించండి. ఈరోజు మీరు బాగా ఆలోచిస్తారు. వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. నుదిటిపై కుంకుమను వర్తించండి.

తులారాశి: వ్యవహారాలలో అవాంతరాలు !

ఈరోజు మీకు శుభఫలితాలుంటాయి. ఈరోజు వ్యవహారాలలో అవాంతరాలు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఈరోజ మీరు గురువు పట్ల పూర్తి భక్తి, విశ్వాసం, విధేయత చూపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. మీకు మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. 11 సార్లు “ఓమ్ బ్రాం బ్రీం బ్రమ్ సః బుధాయ నమహా” పఠించండి.

వృశ్చిక రాశి: ఈరోజు మీ ప్రయత్నాలు విఫలం !

ఈరోజు సన్నిహితులతో విభేదాలు. మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు మీ ప్రయత్నాలు విఫలం కావచ్చు. వ్యాపారం కోసం వృద్ధి చేసిన ప్రయత్నాలు నేడు ఫలించవు. ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు మీరు విజయం సాధించే అవకాశముంది. రోజువారి దుస్తులలో ఆకుపచ్చ రంగు చేర్చండి.

ధనస్సు రాశి: వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి !

ఈరోజు సానుకూల ఫలితాలుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఈరోజు పనుల్లో విజయం. మీరు ఆధ్యాత్మిక వేడుకలపై ఆసక్తి చూపుతారు. ఈరోజు మీకు అదృష్టం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

మకర రాశి: పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. ఈరోజు ఇబ్బంది కలిగించే వస్తువులను స్వీకరించడంతో పాటు మీరు ఎలాంటి ఖర్చులనైనా ఎదుర్కోవచ్చు. విలువైన వస్తువులు కొంటారు. ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారంలో శుభకరంగా ఉంటుంది. ఈరోజు భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. గురుగ్రహారాధన చేయండి.

కుంభ రాశి: ఈరోజు ఉద్యోగాలలో చికాకులు !

ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. మీరు పరిమితమైన, అవసరమైన వాటిని మాత్రమే ఖర్చు చేస్తారు. దైవదర్శనాలు. ఈరోజు మీరు ప్రాపంచీక ఆనందాలు, సేవకులను ఆనందిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. శ్రీకనకధార స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి: ఈరోజు విలువైన వస్తువును పొందుతారు !

ఈరోజు ప్రయాణాలలో మార్పులు.ఈరోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. సామాజిక గౌరవం పొందడం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగాలలో వివాదాలు. ఈరోజు మీరు విలువైన వస్తువును పొందుతారు. శ్రీసూక్తపారాయణం చేయండి.

 

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ని చూడగానే రానా దగ్గుబాటి షూటింగ్ మొదటి రోజు ఏమన్నాడో తెలుసా ?

0

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కలిసి మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కాగా ఈ మల్టీస్టారర్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తున్నాడు.

1600X960 1004621 Pawan Kalyan | Telugu Rajyam

సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.12 గా తెరకెక్కుతున ఈ తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో షూటింగ్ కోసం జరుగుతున్న పనులను చూపించడం తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టడాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పవన్ బైక్ పై ఓ లాడ్జిలోకి ఎంటర్ అయ్యే సీన్స్ ని షూట్ చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలిపింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో పవన్ నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Pawan kalyan : రానా కామెంట్స్ తో జోష్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..!

మలయాళ రీమేక్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి.. పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో పూర్తిగా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ భారీ మల్టీస్టారర్ లో నటించడం రానా కి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని తెలిపాడట. అంతేకాదు ఈ భారీ మల్టీస్టారర్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాడని తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరసగా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక రానా కూడా అరణ్య, విరాట పర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

krack : క్రాక్ బ్లాక్ బస్టర్ తో పూనకం లో ఉన్న రవితేజ ఫ్యాన్స్ కి మరొక భారీ బ్లాక్ బస్టర్…!

0

krack :క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. దాదాపు మూడేళ్ళ తర్వాత సాలీడ్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. టాగూర్ మధు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో కూడా రవితేజ క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతోంది. ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలిచాడు రవితేజ. ఈ క్రమంలో నే తాజా చిత్రం ఖిలాడీని సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు. రీసెంట్ గా ‘రాక్షసుడు’ సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Krack Movie Release | Telugu Rajyam

‘ప్లే స్మార్ట్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఖిలాడి సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొల్పగా తాజాగా రవితేజ పుట్టిన రోజుని అలాగే రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ‘ఖిలాడి’ టీమ్ విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలో రవితేజ అల్ట్రా-స్టైలిష్ లుక్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు.

Ravi Teja New Movie Khiladi | Telugu Rajyam

కాగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఖిలాడి సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. చిన్న గ్లిమ్స్ తోనే సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. అంతేకాదు క్రాక్ సినిమాని మించి భారీ హిట్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఖిలాడీ’ సినిమాని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు.

బాబూ అశోకా.. ఈ ‘పచ్చ’ నీతులకు కాలం చెల్లిందయ్యా.!

0

అశోక్‌బాబు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘ఆరడుగుల బుల్లెట్’గా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. అప్పటికి ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు. అయితే, తెలుగుదేశం పార్టీ నేత తరహాలో.. చంద్రబాబుకి బాకా ఊదిన అశోక్‌బాబు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏం సాధించారో అందరం చూశాం. ప్రత్యేక హోదా కోసం కూడా చంద్రబాబు కనుసన్నల్లో నానా యాగీ చేసి.. ఆ ఉద్యమాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు. చంద్రబాబు కోసం ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిగా చేసిన సేవల నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశం కూడా దక్కించుకున్నారు. నిజానికి, ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగులు వేరు కాదు. ఉద్యోగుల నుంచే ఉద్యోగ సంఘాల నేతలు పుట్టుకొస్తారు. దురదృష్టమేంటంటే, ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనివారు, రాజకీయ పార్టీలకు చెంచాగిరీ చేసేవాళ్ళు మాత్రమే ఉద్యోగ సంఘాల నేతలవుతున్నారిప్పడు.

The Attitude Of Union Leaders Has Not Changed
The attitude of union leaders has not changed

అప్పడు చంద్రబాబు, ఇప్పడు వైఎస్ జగన్.. జమానా మారిందిగానీ.. ఉద్యోగ సంగాల నేతల తీరు మారలేదు. అప్పట్లో తానేదో చాలా చిత్తశుద్ధితో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేసేసినట్లు, ఇప్పటి ఉద్యోగ సంఘాల నేతలపై విరుచుకుపడిపోతున్నారు ఎమ్మెల్సీగా మారిన ఒకప్పటి ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన తయారైంది పరిస్థితి. ఒక్క తేడా అయితే వుంది.. ఒకప్పటికి, ఇప్పటికి. ఉద్యోగ సంఘాల నేతలు గతంతో పోల్చితే, ఇంకో రెండు మెట్లు తమ స్థాయిని దిగజార్చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానం అందుకే మొట్టకాయలేసింది.. ఉద్యోగ సంఘాల నాయకులకి. గూబ గుయ్యిమన్నా కొందరు ఉద్యోగ సంఘాల నేతల తీరు మారడంలేదు. ఈ తీరు ప్రభుత్వంలో వున్నవారికి కూడా సమస్యగా మారుతోంది. అంతే మరి.. వాళ్ళకి రాజకీయాలు నూరి పోస్తున్న రాజకీయ పార్టీలకు తగిన శాస్తి జరగాల్సిందే కదా.. అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

తెలంగాణ సీఎం కేసీఆర్ చారిత్రక తప్పిదం చేస్తున్నారా.?

0

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్థానంలో తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నరా.? అంటే, ఔననే సంకేతాలు తెలంగాణ రాష్ట్ర సమితి నేతల నుంచే వ్యక్తమవుతోంది. పలువురు మంత్రలు కూడా యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలూ వున్నాయని చెబుతున్నారు. కొందరు గులాబీ నేతలైతే, ముహూర్తం కూడా ఖరారైపోయిందని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మాటలే నిజమైతే, వచ్చే నెల.. అంటే, ఫిబ్రవరి ఇదే సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ పేరుకి బదులు కేటీఆర్ పేరు వుండొచ్చు. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు ఇటు కేసీఆర్ కావొచ్చు, అటు కేటీఆర్ కావొచ్చు.. స్పందించలేదు.

Kcr Making A Historic Mistake?
KCR making a historic mistake?

అసలెందుకీ రగడ తెరపైకొస్తున్నట్లు.? కేటీఆర్ లేదా కేసీఆర్ అనుమతి లేకుండా గులాబీ నేతలెవరూ ఇంతటి రిస్క్ తీసుకుని ప్రకటనలు చేసే అవకాశమే లేదు. అంటే, తెరవెనుకాల ఏదో పెద్ద కథే నడుస్తోంది. ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిజానికి, ఇదంతా జస్ట్ కేసీఆర్ మార్కు మైండ్ గేమ్ అనేవారు కూడా లేకపోలేదు. రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఈక్వేషన్స్ మారిపోతాయి. అలాంటిది, భవిష్యత్ రాజకీయాల గురించీ, భవిష్యత్ తెలంగాణ ముఖ్యమంత్రి గురించీ.. ఇంత రచ్చ జరగడమంటే, అది అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా ముప్పు తెచ్చే అంశమే తప్ప, ఏ రకంగానూ టీఆర్ఎస్‌కి మేలు కలిగించే విషయం కాదని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్‌లో కొన్ని శక్తులు, అయిష్టంగానే కేటీఆర్‌కి మద్దతిస్తున్నాయనీ, మరికొందరు మంత్రి పదవుల కోసం కక్కుర్తిపడి భజన చేస్తున్నారనీ.. ఇలాంటివన్నీ, ముందు ముందు కేసీఆర్ కంట్రోల్ చేయలేని సమస్యలుగా కూడా మారొచ్చని సుదీర్ఘకాలంగా టీఆర్ఎస్‌లోనే వుంటున్న ‘గులాబీ శ్రేయోభిలాషులు’ ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారట.

దేశ రాజధానిలో సత్తా చాటిన రైతన్న.. కండిషన్స్ అప్లయ్

0

అనూహ్య పరిణామమిది. ఓ వైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఇంకోపక్క వేలాది ట్రాక్టర్లతో దేశ రాజధానిలో రైతుల ర్యాలీ.. వెరసి, దేశమే కాదు.. ప్రపంచం నివ్వెరపోయింది. ఎర్రకోటపై రైతన్న జెండా రెపరెపలాడింది. దేశ చరిత్రలోనే ఇది ప్రప్రధమం. ‘జై కిసాన్.. భారత్ మాతా కీ జై..’ అనే నినాదాలతో రైతులు ఓ చేత్తో జాతీయ జెండా, ఇంకో చేత్తో తమ జెండా పట్టుకుని నినదించారు. రైతుల ఆందోలనలతో దేశ రాజధాని అట్టుడికింది. నిజానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యాకనే ర్యాలీ చేపడ్తామని రైతు సంఘాలు చెప్పాయి. కానీ, నిర్ణీత సమయానికి కాస్త ముందుగానే రైతుల ట్రాక్టర్ల ర్యాలీ మొదలైంది. పైగా, దారి కూడా తప్పింది. దాంతో, పోలీసులు రైతుల్ని నిలువరించడానికి చాలా కష్టపడ్డారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అయితే, రైతుల్లో కొందరు పోలీసులపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాదు కాదు, పోలీసులే రెచ్చగొట్టారన్నది రైతుల వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా.. ఈ ఆందోళన కొంతమేర రక్తసిక్తమవడం అత్యంత బాధాకరమైన విషయం.

A Farmer Who Settled In The Capital Of The Country
A farmer who settled in the capital of the country

భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్ని ప్రపంచమంతా ఆసక్తితో తిలకిస్తుంటుంది. ఈ సమయంలో రైతుల ర్యాలీ జరగడం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రైతుల్ని తెరవెనుక ఏవో శక్తులు నడిపిస్తున్నాయని కేంద్రంలో అధికారంలో వున్నబీజేపీ ఆరోపించవచ్చుగాక. కానీ, రైతుల ఆందోళనల్ని కేంద్రం పట్టించుకోలేదు.. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బలవన్మరనానికి పాల్పడితే, ఇంకొందరు.. హఠాన్మరణం చెందారు. అయినా, కేంద్రం దిగి రాలేదు. రైతులు వద్దంటున్న చట్టాల్ని రైతుల మీద కేంద్రం బలవంతంగా రుద్దాలనుకోవడాన్ని చాలా రాజకీయ పార్టీలు తప్పుపడుతున్న విషయం విదితమే. కొత్త వ్యవసాయ చట్టాలకు తొలుత మద్దతిచ్చిన పార్టీలు కూడా, ఆ తర్వాత మాట మార్చాయి.. రైతులకు అండగా నిలబడ్డాయి. ఏదిఏమైనా, పంతాలకు పోయే సమయం కాదిది. దేశం పరువు ప్రతిష్టలకు సంబందించిన వ్యవహారంగా మారిందిప్పుడు రైతుల ఆందోళన. బేషజాలకు పోకుండా కేంద్రం, కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడమే మంచిది.

Losliya Mariyanesan Stylish Looks

Losliya Mariyanesan Tamil Most popular Actress,Losliya Mariyanesan Stylish Looks
,Kollywood Losliya Mariyanesan Stylish Looks Shooting spot ,Losliya Mariyanesan ,Losliya Mariyanesan Stylish Looks,

Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks
Losliya Mariyanesan Stylish Looks

RRR : ‘ఆర్ఆర్ఆర్’ కి అన్నీ సినిమాలు భయపడుతుంటే – రాజమౌళి ‘ ఆ ‘ సినిమా పేరు చెప్తే వణుకుతున్నాడు ?

0

RRR : ‘ఆర్ఆర్ఆర్‘.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ కు రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు రాజమౌళి బృందం. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో మరొక వైపు నుంచి రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేయిస్తున్నాడు.

Rrr Releaseedate 25012020 1200 Compressed | Telugu Rajyam

ఈ నేపథ్యంలో అన్నీ కార్యక్రమాలను సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయాలని భావించారట. కాని ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటి ఈ డేట్ లీక్ చేయడం తో పాటు హాలీవుడ్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ అక్టోబర్ 8న విడుదల కాబోతుండటం తో.. ఆర్ఆర్ఆర్ ను వారం ఆలస్యంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాతో గనక ‘ఆర్ఆర్ఆర్’ ని పోటీకి దింపితే ఖచ్చితంగా వసూళ్ళ మీద గట్టిగా ప్రభావం చూపిస్తుందని రాజమౌళి భావిస్తున్నారట.

RRR : రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా..?

అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. మన తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించినప్పటికి ఖచ్చితంగా హాలీవుడ్ సినిమా ప్రభావం మన సినిమా మీద గ్యారెంటీగా గట్టి ప్రభావమే చూపిస్తుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రాజమౌళి తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పుకుంటున్నారట. జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు సార్లు ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ఎట్టకేలకి అక్టోబర్ 13 న రిలీజ్ డేట్ లాక్ చేశారు. అదే డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా చూడాలి.

Varalaxmi Sarathkumar New Pictures

Varalaxmi Sarathkumar Tamil Most popular Actress,Varalaxmi Sarathkumar New Pictures ,Kollywood Varalaxmi Sarathkumar New Pictures Shooting spot ,Varalaxmi Sarathkumar ,Varalaxmi Sarathkumar New Pictures,

Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures
Varalaxmi Sarathkumar New Pictures

Varalaxmi Sarathkumar New Pictures

కొరటాలకు ధమ్‌కి ఇచ్చిన చిరంజీవి.. దెబ్బకు భయపడ్డ డైరెక్టర్

0

మెగాస్టార్ చిరంజీవితో ఆటలంటే మామూలు విషయం కాదు. చిరంజీవికి ఎక్కువ సంతోషం వస్తే ఆపడం ఎవ్వరి తరం కాదు. ఆ ఊపులో చిదంబర రహస్యాన్ని కూడా బయటపెట్టేస్తాడు. అలా చిరు నోటి నుంచి ఎన్నో రహస్యాలు బయటకు వచ్చేశాయి. చిరు లీక్స్ పేరిట అవి ఎంతగానో వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ సస్పెన్స్ విషయాన్ని లీక్ చేశాడు.

Chiranjeevi Conversation With Koratala Siva About Acharya
Chiranjeevi conversation with Koratala siva about Acharya

ఇక మళ్లీ ఆచార్య సినిమా టైటిల్‌ను కూడా అలాగే లీక్ చేశాడు. ఓ పిట్ట కథ ఈవెంట్‌లో భాగంగా మాట్లాడుతూ.. చిరంజీవి తన కొత్త సినిమా టైటిల్ పేరు ఆచార్య అంటూ లీక్ చేసేశాడు. దీంతో అప్పటి వరకు కొరటాల వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా చెత్తబుట్టలోకి పోయాయి. అలా కొరటాల ప్లానింగ్‌కు చిరు అడ్డు కట్ట వేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ రచ్చ చేశాయి. తాజాగా చిరు ఆ ట్రోల్స్, మీమ్స్‌ను తెగ వాడేశాడు.

తన లీక్స్‌పై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను ఆధారంగా చేసుకుని తాజాగా ఆచార్య టీజర్ అప్డేట్ ఇచ్చాడు. కొరటాలనుచిరంజీవి బెదిరిస్తున్నట్టుగా.. ఏమయ్యా కొరటాల న్యూ ఇయర్ పోయింది. సంక్రాంతి పోయింది. ఇంకెప్పుడు టీజర్ అప్డేట్ ఇస్తావయ్యా అని అసహనం వ్యక్తం చేసినట్టు చూపించాడు. నువ్ చెబుతా? లేదా? నన్నే లీక్ చేయమంటావా? అని కొరటాలకు ధమ్‌కి ఇచ్చాడు చిరు. లేదు సర్ రేపు మార్నింగ్ పది గంటలకు కచ్చితంగా అప్డేట్ ఇస్తాను అని అసలు విషయంచెప్పేశారు. రేపు ఉదయం పది గంటలకు ఆచార్య టీజర్ అప్డేట్ రాబోతోంది.

పంచాయితీ పోరు: వైసీపీని ఎదుర్కొనే సత్తా ఎవరికుంది.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో ఊహించలేం. తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల్ని, ఆంధ్రపదేశ్ రాజకీయాలతో పోల్చగలమా.? లేదా.? అన్నదానిపై స్పష్టత కొద్ది రోజుల్లోనే వచ్చేయబోతోంది. పంచాయితీ ఎన్నికలతో అన్ని లెక్కలపైనా స్పష్టత వచ్చేస్తుంది. ‘ఉద్యోగులు, ప్రజల ప్రాణాల్ని దృష్టిలో పెట్టకుని పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో వద్దనుకున్నాం.. వ్యాక్సినేషన్ జరుగుతున్నందున పంచాయితీ ఎన్నికల వాయిదా కోరుతున్నాం..’ అని చెబుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జనాన్ని పెద్దయెత్తున పోగయ్యకుండా వుంటుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషనర్)గా వుండగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించకూడదన్నది వైసీపీ ప్రభుత్వ ఆలోచన.

Who Has The Capacity To Face Ysrcp ?
Who has the capacity to face YSRCP ?

కానీ, కోర్టులు మొట్టికాయలేయడంతో పంచాయితీ ఎన్నికల బరిలోకి దూకక తప్పలేదు. ఇప్పుడు వైసీపీకి కరోనా నిబంధనలేమీ వుండవు. జనాన్ని పోగెయ్యడం ఖాయం. అయితే, అక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వున్నారు ఎస్ఈసీగా.. దాంతో, వైసీపీ పప్పులుడకడం అంత తేలిక కాదు. అధికారాన్ని అడ్డంగా ఉపయోగించేసి పంచాయితీ ఎన్నికల్లో పై చేయి సాధించుదామనుకుంటే వైసీపీకి అది కుదరని పని. కానీ, విపక్షాలు.. అధికార పార్టీకి పోటీ ఇచ్చేంత బలంగా వున్నాయా.? అన్నదే అసలు ప్రశ్న. టీడీపీ గడచిన 18 నెలల్లో దారుణంగా నీరసించిపోయింది. జనసేన – బీజేపీ మధ్య అవగాహనా లోపం వుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రపదేశ్‌లో లేనే లేదు. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుండకపోవచ్చునన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో, పంచాయితీ ఎన్నికలంటే.. రాజకీయ పరమైన ఈక్వేషన్ల కంటే స్థానిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. అలా చూసుకుంటే మాత్రం, గ్రామాల్లో సమస్యలు.. అబివృద్ధి లేమి.. ఇవన్నీ అధికార పార్టీకి సమాధానం చెప్పుకోలేని అంశాలే అవుతాయి.

హ‌ల్వా డ్యాన్స్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌వితేజ‌.. బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరిందంటున్న ఫ్యాన్స్

0

ఐదు ప‌దుల వయ‌స్సులోను ఎంతో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌కు కావ‌ల‌సినంత వినోదాన్ని పంచుతున్న మాస్ హీరో ర‌వితేజ. ముద్దుగా మాస్ మ‌హ‌రాజా అంటూ అభిమానులు ఈయ‌న‌ను పిలుచుకుంటుండ‌గా, ర‌వితేజ సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. రాజా ది గ్రేట్ త‌ర్వాత ర‌వితేజ‌కు ఒక్క హిట్ ప‌డ‌క‌పోవ‌డం ఫ్యాన్స్ చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్ళారు. వారికి క్రాక్ అనే సినిమాతో కిరాక్ పుట్టించాడు. ఈ చిత్రం 16 రోజులకు 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. క్రాక్ మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ బ‌ర్త్‌డే ర‌వితేజ‌కు చాలా స్పెష‌ల్ అయింది.

Ravi Dance | Telugu Rajyam

నేడు 53వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన ర‌వితేజ ఈ రోజుని త‌న ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో స‌ర‌దాగా జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ర‌వితేజ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న డ్యాన్స్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. హ‌ల్వా డ్యాన్స్ అంటూ చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియోలో ర‌వితేజ ఐస్‌క్రీమ్ తింటూ ఫుల్ ఎన‌ర్జీతో డ్యాన్స్ చేస్తున్నారు. జిమ్‌లో ర‌వితేజ చేస్తున్న ర‌చ్చని చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. చేసింది సింపుల్ స్టెప్పులే అయినా కూడా చాలా స్టైలిష్‌గా చంపేసాడు రవితేజ.

ప్ర‌స్తుతం రాక్ష‌సుడు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు ర‌వితేజ.ఈ రోజు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. . ఈ సందర్భంగా ఆయన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ‘ఖిలాడీ’ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజను చాలా పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. చేతిలో సుత్తి పట్టుకుని కంటైనర్‌ బాక్సుల నడుమ రవితేజ స్టైలీష్‌గా నడుస్తున్న లుక్ చూసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ర‌వితేజ ఖిలాడిగా ర‌చ్చ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మాణ బాధత్యలు చేపట్టారు. 

youtube.com/watch?v=joNks9chKvk

కిసాన్ పరేడ్ లో తీవ్ర ఉద్రిక్త‌త .. ర్యాలీ పై అమిత్ షా సమీక్ష

0

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఢిల్లీలో ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగుతుండడం పట్ల అమిత్ షా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేటి ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన అధికారులకు సూచించారు.

Amit Shah

కాగా, ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం పట్ల రైతు సంఘాలు స్పందించాయి. ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. కిసాన్ పరేడ్ ను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మండిపడ్డారు. ర్యాలీలోకి రాజకీయ పార్టీల కార్యకర్తలు చొరబడ్డారని, వారిని తాము గుర్తించామని వెల్లడించారు.

ఇక ఇతర రైతు సంఘాలు స్పందిస్తూ, కిసాన్ పరేడ్ కు భారీగా స్పందన వచ్చిందని తెలిపాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపాయి. ఆందోళన కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగడం బాధాకరమని పేర్కొన్నాయి.

‘మాస్టర్’లో రౌడీ ఇప్పుడు హీరో.. అదిరిపోయిన టైటిల్ అండ్ పోస్టర్

0

కొందరు దర్శకులు గోల్డెన్ హ్యాండ్‌గామారుతుంటారు. కొంత మంది దర్శకులను ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పిలిస్తే సినిమాలు హిట్ అవుతాయని, కొందరు హీరోల చేతులు పడితే ప్రాజెక్ట్‌లు సూపర్ హిట్ అవుతాయని అందరూ భావిస్తుంటారు. సక్సెస్‌లతో దూసుకుపోతోన్న మారుతిపైనా అలాంటి ఓ సెంటిమెంటే ఉంది. దర్శకుడు మారుతిది గోల్డెన్ హ్యాండ్ అని నమ్ముతుంటారు. అలా తాజాగా ఓ కొత్త సినిమా టైటిల్ అండ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Master Fame Mahendran Debut As Hero In Thaniki Kendram 1995
Master Fame mahendran Debut As Hero In THANIKI KENDRAM 1995

దేవీ సినిమాలోని బాలనటుడు మహేంద్రన్.. తాజాగా మాస్టర్ సినిమాలోనూ కనిపించాడు. విజయ్ సేతుపతి బాల్యానికి సంబంధించిన భవాని పాత్రలో మహేంద్రన్ కనిపించి మెప్పించాడు. విజయ్ సేతుపతి నటించిన భవాని పాత్రలో మహేంద్రన్ కనిపించేది కొద్ది సేపే అయినా తనదైన ముద్రను వేసుకున్నాడు. అలాంటి నటుడు ఇప్పుడు హీరోగా మారాడు. కోటేశ్వరావు గూడేలా, పి.వి.చంద్ర కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో మహేంద్రన్ హీరోగా నటిస్తున్నాడు.

దర్శకుడు మారుతి చేతుల మీదు విడుదల చేసిన తనిఖీకేంద్రం 1995 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ గురించి మారుతి మాట్లాడుతూ.. పోస్టర్ చాలా విభిన్నంగా ఉందని, ఇలాంటి సినిమాలు ,ఇలాంటి యువ దర్శకులు పరిశ్రమకి చాలా అవసరం. సినిమా సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకున్నాడు. ఇక మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘మాస్టర్’ చిత్రంలో విజయ్ సేతుపతి టీనేజ్ రోల్ ఎంత పేరు తెచ్చిందో.. ఈ చిత్రం దానికి పదింతలు గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.