స‌ముద్రతీరాన నిహా-చైత‌న్య రొమాన్స్.. తెగ వైరలవుతోన్న ఫోటోలు

సినీ సెలెబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. నెటిజన్లు పండగ చేసుకుంటారు. వాళ్ళ అప్డేట్స్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ వచ్చాయనుకోండి.. ఇక సోషల్ మీడియా వేదికగా లైకులు, కామెంట్లు, పోస్టులతో హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇటీవల ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగా డాటర్ కొణిదెల నిహారికా వివాహం, చైతన్య తో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ క్యూట్ కపుల్ మాల్దీవుల్లో హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా హనీమూన్ నుండి హైదరాబాద్ చేరుకుని.. డిసెంబర్ 31 న తమ స్నేహితులతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్.. తన లైఫ్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్ నిహారిక తమ హనీమూన్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. తన అభిమానుల్ని ఎంటర్ టైన్ చేసింది. అయితే ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తమ హనీమూన్ కి సంబంధించిన క్యూట్ రొమాంటిక్ ఫోటోల్ని షేర్ చేసింది. అందమైన సముద్రం పక్కన అంతులేని తన ప్రేమను చైతన్యకు చూపిస్తూ దిగిన ఎన్నో ఫోటోల్ని చూస్తూ.. నెటిజన్లు మైమరిచిపోతున్నారు. అయితే ఇందులో ఐ సీ యు చై అనే క్యాప్షన్ తో ఉన్న ఒక ఫోటో క్రేజీగా ట్రెండ్ అవుతోంది. మరో ఫోటోలో నిహారిక సోలోగా కనిపిస్తోంది. ఆకాశం సముద్రం కలిసే చోట నన్ను కలుసుకోండి! అంటూ టీజింగ్ పోస్ట్ ని నిహారిక యాడ్ చేసింది.

నాగ బాబు కుమార్తె నిహారికా కొణిదెల – చైతన్య ల వివాహం ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో అత్యంత వైభవంగా జరిగింది. వీరిద్దరి వివాహంలో మెగా ఫ్యామిలీ అంతా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన విషయం తెలిసిందే..