ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భ‌ట్ నిశ్చితార్ధం నేడు.. ఎక్క‌డో తెలుసా?

మ‌హేష్ భ‌ట్ గారాల ప‌ట్టి అలియా భ‌ట్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. హిందీలో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన అలియా భ‌ట్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు కూడా రానుంది. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇటీవ‌ల ఓ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన అలియా కొద్ది రోజులు షూటింగ్‌లో పాల్గొని తిరిగి ముంబై వెళ్లింది.

అలియా భ‌ట్ కొన్నాళ్ళుగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని పుకార్లు షికారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు క‌లిసి చెట్టాప‌ట్టాలు వేయ‌డం, ఒకే ఇంట్లో క‌లిసి ఉండ‌డం చూసి అభిమానులు వీరిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అనుకున్నారు. రీసెంట్‌గా ర‌ణ్‌భీర్ క‌పూర్ దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. క‌రోనా వ‌ల‌న మా పెళ్లి ఆల‌స్యం అయింద‌ని, అది రాక‌పోతే ఇప్ప‌టికే మా వివాహం జ‌రిగి ఉండేద‌ని అన్నారు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం నేడు (30 డిసెంబర్) రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌, నీతూ సింగ్ జైపూర్ వెళ్లేందుకు ముంబై ఎయిర్ పోర్ట్‌కు వెళ్ళారు. వీరి త్వ‌రాత ర‌ణ్‌వీర్ సింగ్‌- దీపికా కూడా పింక్ సిటీకు బ‌య‌లు దేరి వెళ్ళారు. ఆ త‌ర్వాత బ్ర‌హ్మ‌స్త్ర డైరెక్ట‌ర్ అయాన్ ముఖ‌ర్జీ, మహేష్ భట్ , రిద్దిమా కపూర్ , ఆదర్ జైన్, క‌ర‌ణ్ జోహార్ వంటి ప్రముఖులు కూడా జైపూర్ కు వెళ్ళారని స‌మాచారం.ఇంత మంది ప్ర‌ముఖులు, స్నేహితులు జైపూర్ బాట ప‌డుతుంటే ర‌ణ్‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్ ల నిశ్చితార్ధం నేడు జ‌ర‌గ‌నున్న‌ట్టు అభిమానులు భావిస్తున్నారు.