ఐపీఎల్‌లో 13 సీజ‌న్స్ ఆడిన ధోని.. ఆర్జించిన సంపాద‌న విలువ తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం!

మ‌హేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్రికెట్ చ‌రిత్ర‌లో ఆయ‌న సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఎంతో మంది యువ క్రికెట‌ర్స్‌ని తీసుకొచ్చిన ధోని వారితో చ‌రిత్ర‌లు కూడా సృష్టించాడు. ఐపీఎల్‌లోను ధోని సృష్టించిన రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లేదు. ఈ ఏడాది అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన మ‌హేంద్ర సింగ్ ధోని ..ఐపీఎల్‌లో మాత్రం కొన‌సాగుతున్నాడు. 12 సీజ‌న్స్ స‌క్సెస్‌ఫుల్‌గా త‌న టీంని ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకెళ్లిన ధోని ఈ సారి మాత్రం నిరాశ‌ప‌రిచాడు.

ఐపీఎల్‌లో ధోని సంపాద‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2008 నుండి ఐపీఎల్ జ‌రుగుతుండ‌గా, మొద‌టి సంవ‌త్స‌రంలో రూ.6 కోట్లు అర్జించాడు. కొంత కాలం రూ. 6 కోట్లు అందుకున్న ధోని ఐపీఎల్ 2020 సీజన్‌కి రూ.15 కోట్లు తీసుకున్నాడు. 2008 నుండి మూడు సంవ‌త్స‌రాల పాటు రూ. 6 కోట్లు అందుకున్న ధోని ..2011 నుంచి రూ.8. కోట్లు, 2014 నుంచి 2017 వరకూ రూ. 12.5 కోట్లు తీసుకుంటూ వచ్చాడు. అయితే ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో 2016, 2017 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి సంబంధించి నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ధోనీ ఆడిన విషయం తెలిసిందే.

ధోనీ తర్వాత ఐపీఎల్‌ ద్వారా ఆర్జనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్నారు. 2018లో ధోని మ‌ళ్ళీ చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో రీఎంట్రీ ఇచ్చారు. 13 సీజ‌న్స్ ఆడిన ధోని రూ. 137 కోట్లు ఆర్జించాడు. ఇక ధోని త‌ర్వాత రోహిత్ శ‌ర్మ ఉండ‌గా, ఆయ‌న రూ. 131 కోట్లు అందుకున్నారు. విరాట్ కోహ్లీ గ‌త మూడేళ్ల నుండి రూ. 17 కోట్లు అందుకుంటున్నాడు. అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 126 కోట్లు అందుకున్నాడు. ఏదేమైన అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్ బై చెప్ప‌డం సినీ ప్రేక్ష‌కుల‌కి నిరాశ‌ప‌రిచే విష‌య‌మే.