సినీ కెరీర్ లో మహేష్ బాబు బిగ్గెస్ట్ హిట్.. సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

సినీ ఇండస్ట్రీలో ప్రయోగాల వెల్లువ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కథలో బలం, అభినయంతో పాటు ప్రయోగాల్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు సినీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ మహేష్ బాబు ఆ ప్రయోగానికి రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ప్రయోగం ఏంటనే వివరాల్లోకి వెళితే.. ప్రిన్స్ మహేష్ బాబు గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన కెరీర్ స్టార్టింగ్ లో ఒక్కడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ బాబు ఎంటైర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.


తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తెరెక్కిస్తున్నట్లు ఆ సినిమాని నిర్మించిన నిర్మాత యం.యస్.రాజు రీసెంట్ గా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇప్పటికే ఈయన మహేష్ బాబు ఇమేజ్ తగ్గట్లు ఓ కథను రెడీ చేయిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా ఒక్కడు సినిమాకి సీక్వెల్ గా రాబోతుందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో తలెత్తుతున్నాయి. దానికి యం. యస్. రాజు కూడా అవుననే మాటలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఒక్కడు సినిమాకి సంబంధించిన సీక్వెల్ కథను యం. యస్. రాజు రెడీ చేశారు. ఇఫ్పుడు మహేష్ బాబు ఈ స్టోరీ విని ఒకే చెబుతారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు టాప్ హీరోస్ సీక్వెల్స్ సక్సెస్ అయ్యిన నమూనాలు లేవు. మరి మహేష్ బాబు ఆ సెంటిమెంట్స్ ని పక్కన పెట్టి.. సూపర్ హిట్ సినిమాని సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది చూడాలి.