Home News మ‌ళ్ళీ ఫ్లైటెక్కిన మ‌హేష్ ఫ్యామిలీ.. ఈ సారి వెకేష‌న్ ఎక్క‌డికో అంటూ చ‌ర్చ‌లు

మ‌ళ్ళీ ఫ్లైటెక్కిన మ‌హేష్ ఫ్యామిలీ.. ఈ సారి వెకేష‌న్ ఎక్క‌డికో అంటూ చ‌ర్చ‌లు

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీతో మాత్రం విలువైన స‌మ‌యాన్ని కేటాయిస్తాడు. లాక్‌డౌన్ వ‌ల‌న ఏ సినిమా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన మ‌హేష్ చిన్న‌పిల్లాడిలా మారి త‌న‌యుడు గౌత‌మ్, కూతురు సితార‌తో క‌లిసి స‌రదాగా గ‌డిపాడు. ఇంట్లో మ‌హేష్ చేసే ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఎప్పటిక‌ప్పుడు న‌మ్రత త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

Mahesh 2 | Telugu Rajyam

అయితే క‌రోనా ఉదృతి కాస్త త‌గ్గాక దుబాయ్ టూర్ వేసిన మ‌హేష్ ఫ్యామిలీ అక్క‌డ కొద్ది రోజులు స‌రదాగా గడిపారు. అనంత‌రం ముంబై వెళ్ళారు. అక్క‌డికి వెళ్లొచ్చాక తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో క‌లిసి హైద‌రాబాద్ లో క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇక ఈ నెల‌లో ప‌రశురాం తెర‌కెక్కిస్తున్న స‌ర్కారు వాటి పాట చిత్రాన్ని ప్రారంభిస్తాడ‌ని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో మ‌హేష్‌- నమ్రత- సితార- గౌతమ్ బ్యాగ్‌లు త‌గిలించుకొని ఎయిర్ పోర్ట్‌లో క‌నిపించారు.

అంద‌రిని ఎయిర్ పోర్ట్‌లో చూసే స‌రికి సూపర్ స్టార్ లేటెస్ట్ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేశాడ‌ని అర్థమవుతోంది. ఈ సారి వెకేషన్ ఏ సాగర తీరానికి అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో మ‌హేష్ ఫ్యామిలీని ఫొటోగ్రాఫ‌ర్స్ కెమెరాలో బంధించ‌డంతో అవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోలో మ‌హేష్ చాలా హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. దాదాపు ఈ నెల‌లోనే స‌ర్కారు వారి పాట షూటింగ్‌ని మొద‌లు పెడ‌తార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, ఈ చిత్రాన్ని 2021లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అంటున్నారు. ఈ మూవీ తర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. 

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

Latest News