KTR: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూ సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు గ్రామంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా గ్రామస్తులు కలెక్టర్ పై అలాగే ఇతర ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడమే కాకుండా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా అధికారులపై దాడి చేసింది రైతులు కాదని రైతుల ముసుగులో ఉన్న బిఆర్ఎస్ నాయకులే అంటూ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేయడమే కాకుండా స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత ఆయన ఎప్పటిలాగే కేబిఆర్ పార్క్ వద్ద వాకింగ్ కోసం వెళ్లగా పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనని పరామర్శించడం కోసం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఇతర నేతలు నేడు ఉదయం 11 గంటలకు మూలఖత్ లో భాగంగా నరేందర్ రెడ్డిని కలవనున్నారు. ఇలా ఆయనతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ జైలు ఆవరణంలో మీడియా సమావేశంలో కూడా మాట్లాడనున్నారు.
ఇక ఇటీవల పట్నం నరేందర్ రెడ్డిని కోర్టుకు హాజరు పరచగా ఈయన అరెస్టుపై కోర్టు కూడా తెలంగాణ పోలీసులను హెచ్చరించింది. పట్నం నరేందర్ రెడ్డిని ఈ దాడి విషయంలో ఒక తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు చేయడం ఏంటని మండిపడింది. ఇక పట్నం నరేందర్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నీ పతనం కొడంగల్ నియోజకవర్గం నుంచి మొదలైంది. గుర్తుపెట్టుకో నిన్ను ఘోరంగా ఓడిస్తాను అంటూ సవాల్ విసిరారు.