KTR: అదానీ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒకలా గల్లీలో ఒకలా స్పందిస్తున్నారు అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ అవినీతిపరుడు అయితే రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడు రాహుల్ గాంధీ చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు.
అదానీ విషయంలో కెన్యాలాంటి చిన్న దేశాలే ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. మరి తెలంగాణ ఎందుకు రద్దు చేసుకోలేకపోతుందని ఈయన ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి షర్మిల సలహాలు ఇస్తూ మరోసారి అదానీ ఒప్పందాలపై పునరాలోచన చేసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి షర్మిల చెప్పిన మాట విను అంటూ కేటీఆర్ మరో సలహా ఇచ్చారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి అదానీకి గజమాలవేసే సత్కరించగా అదే మహారాష్ట్రకు వెళ్లి ఆయనని గజదొంగ అంటూ విమర్శలు కురిపించారు. అదానీ వ్యవహరంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజుమైందన్నారు కేటిఆర్. మోదీ, అమిత్ షా, రాహుల్, రేవంత్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన కేటిఆర్ అదానీతో దేశానికి నష్టం కలిగితే తెలంగాణకు జరగదా అంటూ ప్రశ్నించారు.
స్కిల్ యూనివర్శిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్పా? కాదా? అని ప్రశ్నించారు. కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్య మీటింగులు నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా అదానీతో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల రూపాయలను తీసుకున్నారని అందుకే ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి వెనకడుగు వేస్తుందని కేటీఆర్ రేవంత్ వ్యవహార శైలి అలాగే అదానీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.