స్టన్నింగ్ డ్యాన్స్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్న క‌త్రినా.. వైర‌ల్‌గా మారిన వీడియో

బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైప్ ఇటీవ‌ల త‌న సినిమాల‌తో అంత‌గా అల‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, స్ట‌న్నింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌తో అంద‌రి మ‌తులు పోగొడుతుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ అమ్మ‌డు ప‌లు వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు కావ‌ల‌సినంత వినోదం అందించింది. ముఖ్యంగా కత్రినా డ్యాన్స్ వీడియోల‌కు అభిమానులు మంత్ర‌ముగ్ధ‌లుయ్యారు. క‌త్రినా అస‌లు డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్ చూడాలంటే అగ్నిపథ్ సినిమాలోని చిక్నీ చమేలి ధూమ్ 3 మూవీలోని కమ్లీ పాటలు చూస్తే ఆమెలో ఎంత ప‌ర్‌ఫార్మెన్స్ దాగుందో అర్ద‌మ‌వుతుంది.

Kat | Telugu Rajyam

తాజాగా క‌త్రినా కైఫ్ పాట‌ని మ్యూట్‌లో పెట్టి డ్యాన్స్ చేసింది. ఇలా చేయ‌డానికి కార‌ణం ఏంటా అని ప‌రిశీలిస్తే తాను ప్ర‌స్తుతం న‌టిస్తున్న ‘ఫోన్ బూత్’ మూవీలోని పాటకు ప్రాక్టీస్ చేస్తూ ఆ వీడియోని ఇంట‌ర్నెట్‌లో షేర్ చేసింది. అయితే సాంగ్‌లో మ్యూట్ పెట్ట‌డానికి కార‌ణం చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా రిలీజ్ చేసే సాంగ్‌ని తాను ముందుగా రిలీజ్ చేయ‌డం ఇష్టం లేక అలా చేసింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం క‌త్రినా కైఫ్ సూర్య‌వంశీ, ఫోన్ బూత్ అనే సినిమాలు చేస్తుంది.

మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన క‌త్రినా ఆ త‌ర్వాత టాలీవుడ్ వైపే చూడ‌డం మానేసింది. బాలీవుడ్ చిత్రాల‌తో బిజీబిజీగా ఉంటుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం ఆమెకు సోషల్ మీడియాలో దాదాపు నాలుగున్నర కోట్ల ఫాలోయింగ్ ఉంది. ఈ భామ తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అందధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను ‌ చేయనున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles