అరణ్య సినిమాకి డేట్స్ ఫిక్స్.. ఇద్ద‌రు హీరోల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న బిగ్ ఫైట్

సినీ ఇండస్ట్రీ అంటేనే పోటీ ప్రపంచం.. అలాంటి ప్రపంచంలో స్టార్స్ అంతా కాంపిటేటర్సే మరి.. అయితే ప్రస్తుతం ఈ పోటీ ఎవరికో తెలుసా.. నితిన్ కి, రానా కి మధ్య. హీరో నితిన్, కీర్తిసురేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ రంగ్ దే సినిమాకి, రానా దగ్గుబాటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన అరణ్య సినిమాలు ఒకే రోజున రిలీజ్ కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అరణ్య ఫిల్మ్ టీమ్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ బిగ్ న్యూస్ ని పోస్ట్ చేశారు. ప్రేక్షకులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రానా దగ్గుబాటి నటిస్తున్న అరణ్య సినిమాను ఈ ఏడాదిలో మార్చి 26న విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించారు.

Ranaa | Telugu Rajyam

టాలీవుడ్ లో స్టార్ డమ్ హీరో రానా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న సినిమా అరణ్య. ఈ సినిమా తెలుగులో అరణ్య గా.. హిందీలో హాథీ మేరా సాథీ, తమిళ్ లో కాదన్ పేరుతో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో అప్డేట్స్ ఇప్పటికే హీరో రానా, ఫిల్మ్ టీమ్ ఎన్నో సార్లు తమ అభిమానులకు తెలయజేశారు. మొదట ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు నితిన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా విడుదల డేట్ కూడా అదే రోజు కావడం విశేషం. థియేటర్ల రీఒపెన్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర అభిమానులకు ఈ రెండు సినిమాలు డబుల్ ధమాకా గా నిలవబోతున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రంగ్ దే సినిమాకి సంబంధించి టీజర్, పోస్టర్స్ రిలీజ్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఓ పక్క కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రంగ్ దే.. మరో పక్క ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ట్రిబ్యూట్ అరణ్య గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles