అవినాష్, అరియానాల ర‌చ్చ మాములుగా లేదుగా.. వీకెండ్ మస్తీలో బిజీగా అవియానా!

అరియానా, అవినాష్.. వీరిద్దరికి బిగ్ బాస్ హౌస్ లో మంచి క్రేజ్ ఉంది. హౌస్ ఫన్నీ ఇష్యూస్ మీద, సీరియస్ ఇష్యూ మీద ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే వీరిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవారు. వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా ప్రేక్షకుల్ని అంతే ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత వీరిద్దరి యాంకరింగ్ తో హైప్ క్రియేట్ చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రోగ్రామ్స్ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ అయిన దగ్గర్నుండి రకరకాల వీడియోస్ తో తమ ఫ్యాన్స్ ని, నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. ఆఖరికి నెటిజన్స్ వీరిద్దర్ని అవియానా అని పిలిచే స్టేజ్ కి వచ్చేశారు.

లేటెస్ట్ గా జబర్థస్త్ ఆర్టిస్ట్ ముక్కు అవినాష్, అరియానా తో కలిసి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ రొమాంటిక్ సాంగ్ తో దుమ్ము రేపుతున్నాడు.. వీకెండ్ మస్తీ అంటూ ట్యాగ్ చేసి ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే సాంగ్ కి వీరిద్దరూ ఎక్సె ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. అరియానా రెడ్ శారీ లో మెరిసిపోతుంటే.. అవినాష్ బ్లూ బ్లేజర్ లో కలర్ ఫుల్ గా ఉన్నారు. అయితే వీరిద్దరూ కలిసి త్వరలోనే ఓ బుల్లితెర కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి ఫస్ట్ ఫోటోషూట్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో వీరి పెయిర్ సోషల్ మీడియా మరింత పాపులరిటీ సంపాదించుకుంది. ఎ డేట్ విత్ అరియానా అంటూ అవినాష్ ట్యాగ్ చేయడం విశేషం.

అయితే రీసెంట్ గా బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత సోషల్ మీడియా లైవ్ లో అరియానా గ్లోరీ ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అందుకే తనకు కనెక్ట్ అయ్యానని చెప్పాడు. ఏది ఏమైనా అరియానా, అవినాష్ ల పెయిర్ చూడ్డానికి చాలా బావుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.