India Vs SA: రబాడాకు సారీ చెప్పిన టీమిండియా కెప్టెన్

India Vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్‌ రాహుల్‌ అధ్బుతమైన ఫామ్‌ తో దూసుకుపోతున్నాడు. తొలి టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన రాహుల్‌.. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. కాగా భారత రెగ్యులర్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా దూరం కావడంతో ఈ టెస్టుకు తాత్కాలికంగా కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా కి సారీ చెప్పాడు. రెండో టెస్ట్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా రబాడా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో బంతి వేయడానికి పరిగెత్తుకుంటూ వస్తుండగా రాహుల్ పక్కకు తప్పుకుని సారీ చెప్పాడు అంపైర్ వైపు చూస్తూ అలాగే స్లిప్, ఫీల్డర్లు వైపు చూస్తూ క్షమాపణలు చెప్పడంతో టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ను అభిమానులు అభినందిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అర్ధ సెంచరీ సాధించగా.. అశ్విన్‌ (46) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్‌ 4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోయి 35 పరుగులు చేసింది.