డాక్ట‌ర్ సుధాక‌ర్ చంద్ర‌బాబు వ‌దిలిన బాణ‌మా?

Vizag Doctor Sudhakar

డాక్ట‌ర్ సుధాక‌ర్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వంపై కొవిడ్-19 కిట్స్ లో భాగంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి మీడియాలో హైలైట్ అయ్యారు. అటుపై సుధాక‌ర్ విశాఖ‌ న‌డిరోడ్డు మీద చేసిన యాగికి క‌ట‌క‌టాల‌పాల‌య్యారు. ఇప్పుడా కేసు పోలీసులు…కోర్టులు దాటి సీబీఐ చేతిలోకి వెళ్లింది. ఏపీ హైకోర్ట్ ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదికలో గాయాలు లేవ‌ని..మేజిస్ర్టేట్ నివేదిక‌లో శ‌రీరంపై గాయాలున్నట్లు ధ‌ర్మాసనం తాజాగా పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీని వెనుక భారీ కుట్ర ఉంద‌ని ఆ కార‌ణంగానే కేసును సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఢొంకంతా క‌దిల‌నుంది.

సీబీఐ ద‌ర్యాప్తులో పూర్తి వివ‌రాలు వెల్ల‌డైతే? దొంగ ఎవ‌రు? దొర ఎవ‌రు? అన్న‌ది క్లారిటీ వ‌స్తుంది. అస‌ల‌ కేసు పూర్వాప‌రాలు ఓసారి ప‌రిశీలిస్తే ఆస‌క్తికర‌ అనుమానాల‌కు తావిస్తోంది. సుధాక‌ర్ అన‌స్తీషియా ఇచ్చే ప్ర‌భ‌త్వ డాక్ట‌ర్. ప్ర‌భుత్వానికి లోబ‌డి ప‌నిచేయాలి. కానీ ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌భ‌త్వంపై ఆరోప‌ణలు చేసారు. అటుపై విశాఖ‌లో న‌డిరోడ్డు మీద ముఖ్య‌మంత్రిని దూషించారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసారు. కేజీహెచ్ డాక్ట‌ర్లు సుధాక‌ర్ మాన‌సిక ప‌ర‌స్థితి స‌రిగ్గా లేద‌ని నిర్ధారించారు. అంత‌కు ముందు సుధాక‌ర్ కుమారుడ్ని పోలీసులు అరెస్ట చేయ‌డంతోనే సుధాక‌ర్ మాన‌సికంగా డిస్టర్బ్ అయ్యాడ‌ని తెలుస్తోంది.

అయితే సుధార్ వెనుక ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు సుధాక‌ర్ విష‌యంలో స్పందించ‌డం దానికంటే ఎక్కువ‌గా రియాక్ట్ అయి రాజ‌కీయం చేయాల‌ని చూసిన‌ట్లు టాక్ వినిపించింది. సుధాక‌ర్ ని వ్య‌క్త‌గ‌తంగా రెచ్చ గొట్టి ప్ర‌భ‌త్వం మీద‌కు పంపించ‌డంలో ఆయన‌ పాత్ర కీల‌కంగా ఉద‌ని వెబ్ మీడియా క‌థనాలు వేడెక్కిస్తున్నాయి. ప్రతీ విష‌యాన్ని రాజ‌కీయం చేసే చంద్రబాబు రాష్ర్టంలో సంచ‌ల‌న‌మైన సుధాక‌ర్ ని ఎందుకు వ‌దిలిపెడ‌తాడు? అన్న కోణం ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ అవుతోంది. సుధాక‌ర్ ని ప్ర‌భుత్వం మీద‌కు బాబు ఓ బాణంలా వ‌దిలాడ‌ని వైకాపా నేత‌లు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్ర‌భుత్వ అధికారుల‌ది గానీ, సుధాకర్ ది గానీ త‌ప్పుంటే ప‌నిష్ మెంట్ త‌ప్ప‌దు. న్యాయ స్థానానికి ఎవ‌రైనా ఒక్క‌టే. అలా కాకుండా ఇందులో చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని తేలితే మాత్రం ఆయ‌నతో పాటు, పార్టీ ప‌రువు కూడా పోతుంది. ఫ‌నిష్ మెంట్ త‌ప్ప‌దు. నాలుగు దశాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం మంట‌గ‌లిసిపోతుంది.