సిల్వర్ స్క్రీన్ పై మరో తెలుగు డాన్స్ మాస్టర్.. భారీ స్కెచ్ వేసిన దిల్ రాజు!!

డాన్స్ మాస్టర్స్ హీరోలుగా మారడం సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ప్రభుదేవా, రాఘవ లారెన్స్ అమ్మరాజశేఖర్, జానీ మాస్టర్ ఇలా ప్రముఖ డాన్స్ మాస్టర్స్ ముందుగా హీరోలతో స్టెప్పులు వేయించి.. ఇప్పుడు వాళ్లే హీరోలుగా మారిపోయారు. వీరి హీరోయిజాన్ని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కూడా స్వాగతించాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్న యువ డాన్స్ మాస్టర్ యష్ కూడా వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడన్న టాక్ సినీ ఇండస్ట్రీ సర్కిళ్లలో తెగ హల్చల్ చేస్తోంది.

Yash 2 | Telugu Rajyam

టాలీవుడ్ అగ్ర నిర్మాత, లక్కీఎస్ట్ ప్రొడ్యూసర్ ఎవరన్న? క్వశ్చన్ వస్తే మొదటగా వినిపించే పేరు దిల్ రాజు. తెలుగు సినీ పరిశ్రమకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు, దర్శకులను పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు మరో హీరోను పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నారు. డాన్స్ మాస్టర్ యశ్ను హీరోగా పరిచయం చేయడానికి దిల్ రాజు సన్నాహాలు మొదలుపెట్టారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే డాన్స్ మాస్టర్ జానీ కూడా హీరోగా సినిమా చేస్తున్నాడు.

అయితే ఇప్పటికే దిల్ రాజు నిర్మెస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్లు చేస్తున్న ఎఫ్3 చిత్రీకరణలో ఉంది. ఈక్రమంలో దిల్ రాజు నిర్మిస్తున్న మరో మూడు సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ తరువాత దిల్రాజు చిన్న సినిమాలపై దృష్టి పెట్టనున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే డాన్సర్ యశ్ను హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జరుగుతున్న ప్రచారంపై ఇప్పటివరకు దిల్ రాజు కానీ, డాన్స్ మాస్టర్ యష్ కానీ అధికారికంగా స్పందించలేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles