కేసీఆర్ క‌ల‌లుగ‌న్న బంగారు తెలంగాణలో క‌రోనా చావులా?

తెలంగాణ‌ని బంగారు తెలంగాణ చేస్తాన‌న్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఆ న‌మ్మ‌కంతోనే రెండ‌వ‌సారి క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీని మ‌ళ్లీ అంద‌లం ఎక్కించారు ప్ర‌జ‌లు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి కేసీఆర్ చీక‌టి రాజ‌కీయాల‌ను ఒక్కొక్క‌టిగా బ‌హిర్గంతం చేస్తోంది. క‌రోనా పేరుతో మీడియా సాక్షిగా కేసీఆర్ ఆండ్ హిజ్ కేనిబినేట్ ఎలాంటి అబ‌ద్ద‌పు ప్ర‌చారాల‌కు పూనుకుంటుందో ఈ నాలుగు నెల‌ల కాలంలో ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నారు. క‌రోనా ప‌రీక్ష‌ల ద‌గ్గ‌ర మొద‌లైన కేసీఆర్ అబద్దం చావుల వ‌ర‌కూ ఎంత దాష్టికంగా వ్య‌వ‌రిస్తోందో స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది. క‌రోనా ప‌రీక్ష‌ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని, తెలంగాణ ప్ర‌జ‌ల్ని ఎంత‌గా మోసం చేసిందో బ‌ట్ట‌బ‌య‌లైన తీరు నిర్ఘాంత‌పోయేలా చేసింది.

ఇక మొన్న‌టి రోజు క‌రోనా సోకిన రోగుల ప‌ట్ల ప్ర‌భుత్వం ఎలాంటి వైద్యం అందిస్తుందో కూడా ప్ర‌జ‌ల‌కి తెలిసొచ్చింది. ఆక్సీజ‌న్ తీసేసి బ‌ల‌వంతంగా చంపేస్తున్నార‌ని ఓ యువ‌కుడి ఆవేద‌న‌తో దేశం ఒక్క‌సారిగా మూగ‌బోయింది. `నేను శ్వాస తీసుకోలేక‌పోతున్నాను. నా ఆక్సిజ‌న్ తొల‌గించారు. నాన్న నేను చ‌నిపోతున్నాను. నా గెండె ఆగిపోయేలా ఉంది. బాయ్ నాన్`నా అంటూ ఆయువ‌కుడు ఎంత‌గానో ఆవేద‌న చెందాడు. ఆ యువ‌కుడి వీడియో చూస్తే ఎంత క‌రుడ‌గ‌ట్టిన వాడైనా క‌రిగిపోవాల్సిందే. క‌న్నీరు ఉప్పొంగాల్సిందే. మ‌రో పేషెండ్ కూడా అలాగే చ‌నిపోయాడు. `చికిత్స అందిస్తున్న వార్డులో ఎవ‌రూ ఉండ‌టం లేద‌ని, త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని` చెప్పిన గంట‌లోనే క‌న్ను మూసాడు.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో క‌రోనా రోగుల పాలిట వైద్యం ఎంత నిర్ల‌క్ష్యంగా ఉందో అర్ధ‌మ‌వుతోంది. రిపోర్ట‌ర్ మ‌నోజ్ మ‌ర‌ణం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌భుత్వంపై మీడియా నిఘా మ‌రింత ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని విష‌యాలు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. కేసీఆర్ ప్ర‌భుత్వం బ‌య‌ట‌కు చెబుతోంది ఒక‌టి..లోప‌ల చేసేది మ‌రొక‌టి. ఆ మ‌ర‌ణాల‌పై పింక్ పార్టీ ఎలా స్పందించిందో కూడా తెలిసించే. చ‌నిపోయిన వాళ్ల‌నే అవి ఓ అబ‌ద్ద‌పు చావులంటూ ఆ మ‌ర‌ణాల‌పైనా కారు పార్టీ రాజ‌కీయం చేసే ప్ర‌య‌త్నం చేసింది. చేసిన త‌ప్పును ఒప్పుకోలేదు. అదే పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌ల‌కు క‌రోనా సోకితే కార్పోరేట్ వైద్యం అందిస్తోంది.

ఈ విష‌యాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గ‌ట్టిగా నిన‌దించారు. ఆ మంత్రుల‌కు గాంధీ ఆసుప‌త్రిలో వైద్యం అందిస్తే సామాన్యుడి వ్య‌ధ అర్ధ‌మ‌వుతుంద‌ని మండిప‌డ్డారు. దీంతో కేసీఆర్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. ఇదేనా కేసీఆర్ క‌న్న బంగారు తెలంగాణ‌? ఇందుకేనే ప్ర‌త్యేక తెలంగాణ సాధించుకున్న‌ది! క‌రోనా పేరుతో ప్ర‌భుత్వమే హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. ప‌క్క రాష్ర్ట సీఎం క‌రోనా ప‌ట్ల ఎంత శ్ర‌ద్ద చూపించి ప‌నిచేస్తున్నార‌ని కేసీఆర్ విధానంపై ప్ర‌తిప‌క్షం స‌హా, ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు.