చంద్రబాబు చెప్పినా కార్యకర్తలు వినట్లేదా.. ?

2024 అసెంబ్లీ ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉండటంతో టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతలు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ కార్యకర్తలతో సమావేశాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫలితాలు ఆశించిన విధంగా ఉండవని పార్టీల అధినేతలు భావిస్తున్నారు.

అయితే అధికారంలో ఉన్న జగన్ కార్యకర్తల సలహాలు, సూచనలు వింటూ కార్యకర్తలు చేయాల్సిన పనులను వివరించి చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. చంద్రబాబు సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు కొట్టుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు మాటలకు వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతూ ఆయనకు షాకిస్తున్నారు.

చంద్రబాబు కార్యకర్తలకు ఏదైనా పని ఇచ్చినా కార్యకర్తలు ఆ పనిని పట్టించుకోవడం లేదు. మరోవైపు జగన్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవకుండా అక్కడ వైసీపీపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ చేజిక్కించుకోవడంతో చంద్రబాబు సైతం ప్రస్తుతం ఒకింత టెన్షన్ పడుతున్న పరిస్థితి నెలకొంది.

ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే టీడీపీ, జనసేన ఏపీలో బలపడకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను ఓడిస్తే రాష్ట్రంలో టీడీపీ పుంజుకునే అవకాశం లేదని జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు మైనస్ పాయింట్లు జగన్ కు ప్లస్ పాయింట్లు అవుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే మాత్రం వైసీపీ ఒక విధంగా విజయం సాధించినట్టేనని చెప్పవచ్చు.