విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ వార్.. చిచ్చు పెట్టిందెవ‌రో తెలిస్తే షాక‌వుతారు!

ప్ర‌స్తుత భార‌త క్రికెట్ జ‌ట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్ ఎవ‌రు అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ. అద్భుత ప్ర‌తిభ ఉన్న ఈ ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్స్ భార‌త్‌కు ఎన్నో విజ‌యాలు అందించారు. వీరిద్ద‌రు క్రీజ్‌లో ఉంటే ప్ర‌త్య‌ర్ధి టీంకు గుండెల‌లో ద‌డ మొద‌లవ్వ‌డం ఖాయం. మంచి స్నేహితులుగా ఉంటూ వ‌స్తున్న రోహిత్, విరాట్ కోహ్లీలు భార‌త్‌కు దొరికిన ఆణిముత్యాల‌నే చెప్పాలి. వీరిద్ద‌రికి లెక్క‌లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టారు ఓ ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్‌.

Koro | Telugu Rajyam

వివరాల‌లోకి వెళితే టీమిండియా ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌ల‌లో ఎవ‌రు బెస్ట్ అనే చర్చ కొన్నాళ్ల నుండి న‌డుస్తుంది. ఈ గొడ‌వకు ఆజ్యం పోసి చోద్యం చూశాడు ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్‌. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి అభిమానులు ఒక‌రినొక‌రు ఎందుకంత‌లా ద్వేషిస్తారు? ఆ ఇద్ద‌రూ ఇండియ‌న్ ప్లేయ‌ర్సే క‌దా. నాకు స‌మాధానం కావాలి అంటూ క్లోయీ అమందా బెయిలీ అనే జ‌ర్న‌లిస్ట్ ట్వీట్ చేసింది.

న‌సీరుద్దీన్ షా చెప్పిన గునా హై( ఇది నేరం ) అనే డైలాగ్ కూడా పోస్ట్ చేసింది. దీంతో చల్ల‌బ‌డింద‌న్న గొడ‌వ మ‌ళ్లీ మొద‌లైంది. కోహ్లీని రోహిత్ చాలా సార్లు ప్ర‌శంసించాడు. కాని కోహ్లీ .. రోహిత్‌ని పొగిడిన సంద‌ర్బాలు చాలా త‌క్కువ‌. కోహ్లి ఖాతాలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదు . రోహిత్ త‌న టీంకు ఎన్ని అందించాడో తెలుసు క‌దా! ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ ఆడ‌క‌పోవ‌డ‌నికి కార‌ణం కూడా కోహ్లీనే అంటూ ఎవరికి ఇష్ట‌మొచ్చిన‌ట్టు వారు తిట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గొడ‌వ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles