Home News ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిని కొట్ట‌డానికి మార్ష‌ల్స్ నేర్చుకున్నాడో తెలిస్తే, షాక‌వుతారు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిని కొట్ట‌డానికి మార్ష‌ల్స్ నేర్చుకున్నాడో తెలిస్తే, షాక‌వుతారు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న గురించి ఏ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన అది ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవ‌డం వెనుక ఓ కార‌ణం ఉంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. టాలీవుడ్‌లో సుమ‌న్, భాను చంద‌ర్ త‌ర్వాత మార్ష‌ల్ ఆర్ట్స్‌లో మంచి అనుభ‌వం ఉన్న హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్పక ఉంటాడు.

Pawan 1 | Telugu Rajyam

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవ‌డం వెనుక పెద్ద క‌థే ఉంద‌ట‌. చిరంజీవి త‌న పెద్ద త‌మ్ముడు నాగ‌బాబుకు మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్పించాల‌ని చాలా క‌ల‌లు క‌న్నాడు. కాని అత‌ను లాయ‌ర్ అవుతానంటూ వెల్ళిపోయాడు. ప‌వ‌న్ కూడా మార్ష‌ల్స్ పై ఏ మాత్రం ఆస‌క్తి చూపలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవ‌లసి వ‌చ్చింది. చిరంజీవి హీరోగా ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ కాలేజీకు వెళుతుండేవాడు. ఆ స‌మ‌యంలో కొంద‌రు త‌న అన్న‌ని తిట్ట‌డం కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కొట్టాల‌నే కోపం ఉన్న‌ప్ప‌టికీ రివ‌ట‌లా ఉండే స‌రికి ధైర్యం స‌రిపోయేది కాదు.

దీంతో క‌చ్చితంగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవల‌సి వ‌చ్చింది ప‌వ‌న్ కు. తన అన్నయ్యను కామెంట్ చేస్తున్న వాళ్ల తుక్కు రేగ్గొట్టాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన శిక్షణ తీసుకున్నట్లు పవన్ సన్నిహితులే చెప్తుంటారు. మార్ష‌ల్స్‌లో బ్లాక్ బెల్ట్ కూడా అందుకున్న ప‌వ‌న్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, బద్రి, ఖుషీ, జల్సా లాంటి సినిమాల్లో త‌న ప‌ర్‌ఫార్మెన్స్ చూపించాడు. ప్ర‌స్తుతం అడ‌పాద‌డపా కూడా మార్ష‌ల్స్ ప్ర‌స్తావ‌న తెస్తుంటాడు.

 

- Advertisement -

Related Posts

స్వలింగ వివాహం .. కేంద్రం ఏం చెప్పిందంటే ?

ఒకే జెండర్‌ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన...

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

Latest News