Bheemla Nayak DJ Song: భీమ్లా నాయక్ డీజే సాంగ్ వచ్చేసింది..!

Bheemla Nayak DJ Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ ‘లా లా భీమ్లా’ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో డీజే వెర్షన్ ను చిత్ర యూనిట్ తాజాగా చేసింది. పవన్ ఫాన్స్ కు న్యూ ఇయర్ కిక్ ఇచ్చింది. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నది. కౌండిన్య పాడగా, తమన్ మ్యూజిక్ అందించాడు.

ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు విశేషాదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని ‘లాలా భీమ్లా’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ఈ సాంగ్ కు.. 36 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి.

మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.

YouTube video player