Ambanti: అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం.. బన్నీకి మద్దతుగా వైకాపా నేత ట్వీట్!

Ambanti: అల్లు అర్జున్ అరెస్ట్ ఇటు తెలంగాణలోనూ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక నేషనల్ అవార్డు అందుకున్నటువంటి హీరోని ఇలా అరెస్టు చేయడం భావ్యం కాదు అంటూ బిఆర్ఎస్ నేతలు మరోవైపు భాజపా నేతలు కూడా మండిపడుతున్నారు. కేవలం పోలీస్ బందోబస్తు కల్పించలేక ప్రభుత్వం విఫలమైందని, తొక్కిసలాట జరిగితే అందుకు అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేయడం సరైనది కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. సంధ్య థియేటర్ తొక్కి సలాట వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టు చేయటం అన్యాయం అంటూ ఈయన అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్ కు తాము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము అంటూ ఈయన అల్లు అర్జున్ తో పాటు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇక అల్లు అర్జున్ విషయంలో అంబంటి రాంబాబు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు. పుష్ప విడుదల సమయంలో కూడా ఈ సినిమాని అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఈ సినిమాకు పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అరచేతితో సూర్యకాంతిని ఆపడం ఎంత కష్టమో అల్లు అర్జున్ సినిమాని కూడా ఆపడం అంతే కష్టం అంటూ ఈయన పుష్ప2 సినిమాకు అలాగే అల్లు అర్జున్ కు ఎప్పటికప్పుడు మద్దతు తెలియజేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ కు తన పూర్తి మద్దతును తెలియజేస్తూ ట్వీట్ చేశారు.