Home News అఖిల్‌కు అభిమాని గిఫ్ట్‌.. బ‌హుమ‌తి చూసి బిత్త‌ర‌పోయిన సీజ‌న్ 4 ర‌న్న‌ర‌ప్

అఖిల్‌కు అభిమాని గిఫ్ట్‌.. బ‌హుమ‌తి చూసి బిత్త‌ర‌పోయిన సీజ‌న్ 4 ర‌న్న‌ర‌ప్

బిగ్ బాస్ సీజ‌న్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒక‌రు అఖిల్‌. తొలి రోజు నుండి గేమ్ విష‌యంలో క‌సిగా ఆడుతూ వ‌చ్చిన అఖిల్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. మోనాల్‌తో రిలేష‌న్ విష‌యంలో హాట్ టాపిక్‌గా మారిన అఖిల్‌.. అభిజిత్‌తో ఫైటింగ్‌, సోహెల్‌, మెహ‌బూబ్‌తో మంచి స్నేహ బంధాన్ని కొన‌సాగిస్తూ అంద‌రి దృష్టి ఆకర్షించాడు. అయితే అఖిల్, సోహెల్‌లు అన్న‌ద‌మ్ముల వ‌లే హౌజ్‌లో మెలుగుతూ రాగా, ప‌లు సంద‌ర్బాల‌లో ఎవ‌రు గెలిచిన కూడా మ‌నీ షేర్ చేసుకుందాం అని డీల్ కుదుర్చుకున్నారు. అలానే ‘నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్‌, బైక్‌ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా అని ముచ్చ‌టించుకున్నారు.

Akhil | Telugu Rajyam

అఖిల్ ర‌న్న‌ర‌ప్‌గా నిల‌వ‌గా, సోహెల్ టాప్ 3 పొజీష‌న్‌లో నిలిచాడు. దీంతో వీరిద్ద‌రు కుదుర్చుకున్న డీల్‌కు బ్రేక్ ప‌డింది. అయితే అఖిల్ కోరికను జ‌య‌ల‌క్ష్మీ అనే మ‌హిళా అభిమాని తీర్చింది. విజ‌యవాడ‌లో ఉంటున్న ఆమె అఖిల్‌కు గిఫ్ట్ ఇచ్చేందుకు ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్‌కు వ‌చ్చి అత‌నిని క‌లుసుకుంది. అంతేకాదు అత‌నికి విలువైన ల్యాప్ టాప్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చింది. ఇది చూసిన అఖిల్ ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయాడు. ఇది నిజ‌మా క‌లా అనే డైల‌‌మాలో ప‌డ్డాడు. ఏదేమైన త‌ను అనుకున్న‌ది ఓ అభిమాని గిఫ్ట్ రూపంలో రావ‌డం ప‌ట్ల చాలా సంతోషం వ్య‌క్తం చేశాడు.

అఖిల్ ఈ త‌తంగానికి సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. మీరు చూపించిన ప్రేమ‌, ఆప్యాయ‌త‌కు ధ‌న్య‌వాదాలు అని త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియోకు స్పందించిన సోహైల్ కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం అఖిల్ సినిమా ఆఫ‌ర్స్ వేట‌లో ఉండ‌గా,ఇటీవ‌ల అత‌నికి గోపిచంద్ సీటీమార్ అనే చిత్రంలో చిన్న క్యారెక్ట‌ర్ ల‌భించింద‌ట‌. ఈ సినిమాతో అఖిల్ మ‌రెన్నో ఆఫ‌ర్స్ అందుకోవాల‌ని భావిస్తున్నాడు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News