చిరు షాక్ ఇచ్చాడు.. టికెట్ రేట్లు పెరగక తప్పేలా లేదు

చిరు షాక్ ఇచ్చాడు.. టికెట్ రేట్లు

చిరు షాక్ ఇచ్చాడు.. టికెట్ రేట్లు పెరగక తప్పేలా లేదు

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల్స్ ఇవాళ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’ మీద ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. చరణ్ కూడ సినిమాలో నటిస్తుండటంతో బిజినెస్ భారీగా జరిగింది. సుమారు 145 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేశారు నిర్మాతలు. ఒక నాన్ పాన్ ఇండియా సినిమాకు ఇది చాలా పెద్ద బిజినెస్. బిజినెస్ ఈ స్థాయిలో జరిగింది అంటే డిస్ట్రిబ్యూటర్లకు గుండెల్లో గుబులే కదా. ఈ పెద్ద మొత్తం వెనక్కు రావాలంటే సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఒకవేళ అటు ఇటు అయితే నట్టేట మునిగినట్టే.

అందుకే సేఫ్ జోన్ చూస్తున్నారు అందరూ. మొదటి వారాంతంలో టికెట్ ధరలకు పెంచాలని భావిస్తున్నారు. అది కూడ 20, 30 కాదు ఏకంగా డబుల్ రేట్. అంటే ప్రజెంట్ 150 ఉన్న టికెట్ ఆచార్యకు 300 వరకు వెళ్ళవచ్చు. ఈ రేటు పెడితేనే ఫస్ట్ వీకెండ్ వసూళ్లు సేవ్ చేసేలా ఉంటాయని, అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ తగ్గి ఒకవేళ సినిమా ఆకట్టుకోకపోయినా తక్కువ నష్టాలతో బయటపడవచ్చని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారట.

సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన ధరల షాక్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ప్రేక్షకులకు టికెట్ రేట్ల రూపంలో తగిలింది. రేట్లు పెంచినా సినిమా విపరీతంగా ఆకట్టుకుంటే ఆ భారాన్ని ప్రేక్షకులు, అభిమానులు మర్చిపోయే వీలైతే ఉంది.