“సర్కారు వారి పాట” లో మరో సర్పైజ్ ని యాడింగ్..డీటెయిల్స్ ఇవే.!

ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ ఏక్షన్ మరియు మెసేజ్ డ్రామా “సర్కారు వారి పాట”.

దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరో హిట్ గా నిలవగా ఎట్టి పరిస్థితుల్లో మహేష్ కి ఈ సినిమాని హిట్ గా ఇవ్వాలని దర్శకుడు పరశురామ్ పెట్ల చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తో వెరీ స్టైలిష్ గా తీశారు.

అయితే ఈ సినిమా లో సూపర్ హైలైట్ గా ఈ సినిమాలో అనేక అంశాలు ఉండగా ఇప్పుడు వీటిలో ఇంకో అదిరే హైలైట్ ని రేపటి నుంచి యాడ్ చేస్తున్నట్టు సినీ వర్గాల వారు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంతకీ ఆ అదిరే సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో రిలీజ్ చేసిన సాంగ్స్ కాకుండా మరో సాంగ్ కూడా ఉందని ఆ మధ్య టాక్ వచ్చింది.

మహేష్ హిట్ సినిమా “మురారి” టైటిల్ తో ప్లాన్ చేసిన మురారి బావ అనే ఈ ట్రాక్ ని ఇప్పుడు చిత్ర బృందం థియేటర్స్ లో జోడిస్తుందట. దీనితో ఈ సినిమా వసూళ్లు ఎఫ్ 3 పోటీ ఉన్నా కూడా పెంచేందుకు రేపు నుంచి వీకెండ్ కావడంతో మరింత మంది ప్రేక్షకులను రప్పించేందుకు చేస్తున్న ప్లాన్ అని అర్ధం అవుతుంది. అయితే ఈ సాంగ్ ఆడియో అయితే రాలేదు.

డైరెక్ట్ థియేటర్స్ లో చూడాల్సిందే. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ పట్ల మహేష్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు.