వేల పాటలతో కోట్లాది శ్రోతలను ఎంతగానో అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం. ఆయన పాటలకు పరవశించిన వారు లేరు. తెలుగు, తమిళం,హిందీ, మలయాళం ఇలా ఒకటేమిటీ 16 భాషలలో 40 వేలకు పైగా పాటలు పడారు. అనేక స్టేజ్ షోస్ ఇచ్చారు. బాలు ప్రతిభను గుర్తించిన ప్రభుత్వాలు నంది అవార్డులు, ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయనను సత్కరించాయి. తాజాగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021 ఏడాదికిగాను 119 మందికి పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఇందులో ఎస్పీ బాలుతోపాటు ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు.
దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డ్ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. నా ప్రియమైన సోదరుడు బాలుకు పద్మ విభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. ఆ అవార్డ్‌కు ఆయన అర్హుడు. కాకపోతే బ్రాకెట్స్‌లో మరణానంతరం అని చేర్చి ఉండటం బాధను కలిగిస్తోంది. ఎక్కడున్నా ఆయన ఈ అవార్డును స్వీకరించి ఉంటారని ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. చిరంజీవి, బాలు కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి.
బాలు సాంగ్‌కు చిరు వేసిన స్టెప్స్ ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం చిరు ఆచార్య అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. సామాజిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు లూసిఫర్ అనే చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న మెగాస్టార్, వేదాళం రీమేక్‌ను మెహర్ రమేష్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే కసితో ఉన్నాడు చిరు.