బన్నీ వాసుకి చుక్కలు కనిపిస్తున్నాయ్

Jaathiratnalu shock to Bunny Vas

Jaathiratnalu shock to Bunny Vas

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాస్ నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా నిన్ననే రిలీజ్ అయింది. పాజిటివ్ బజ్ నడుమ విడుదలైనా కూడ సినిమా వసూళ్లు చాలా బలహీనంగా ఉన్నాయి. సినిమా విడుదలకు జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ తమ సినిమా చాలా త్వరగా ఓటీటీలో వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది తగదని అన్నారు. కరెక్టుగా చెప్పాలంటే రాజకీయాలు మానుకోమని వార్నింగ్ ఇచ్చేశారు.

ఆయన వార్నింగ్ ఇచ్చింది ఎవరికో కాదు ‘జాతిరత్నాలు’ పిఆర్ బృందానికి. గత వారం విడుదలైన ‘జాతిరత్నాలు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. భారీ వసూళ్లను రాబడుతోంది. లాభాలు 25 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఆ సినిమా ప్రమోషన్ల కోసం తమ సినిమా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బన్నీ వాస్ ఆగ్రహించారు. తమ సినిమా రిలీజైతే ‘జాతిరత్నాలు’కు షాక్ ఖాయమన్నట్టు కనిపించారు.

కానీ లెక్కలు తారుమారయ్యాయి. ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీస్ ముందు తేలిపోతోంది. ఫస్ట్ డే కేవలం 1.65 కోట్ల షేర్ మాత్రమే చేసింది. సినిమా బిజినెస్ చూస్తే 13 కోట్ల వరకు ఉంది. మొదటి రోజు ఒకటిన్నర కోటితోనే సరిపెట్టుకున్న సినిమా 13 కోట్లను రికవర్ చేస్తుందనుకోవడం ఇంపాజిబుల్. మరోవైపు ‘జాతిరత్నాలు’ మాత్రం రెండో వారం కూడ మంచి కలెక్షన్స్ అందుకుంటోంది.