దారుణంగా పడిపోతున్న “థాంక్ యూ” వసూళ్లు..!

ఈ జూలై నేలలోకి వచ్చాక తెలుగు సినిమా దగ్గర పలు సినిమాలు పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలిసిందే. గడిచిన మూడు నాలుగు వారాల్లో కూడా వచ్చిన సినిమాలు ఊహించని విధంగా ఫలితాలు అందుకుంటున్నాయి. దీనితో ఈ ఆకస్మిక పరిస్థితిలో నిర్మాతలకు హీరోలకి అసలు ఏమీ అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఇక ఈ పరిస్థితిలో కాస్త డిఫరెంట్ గానే ఏదోకటి చేద్దాం అని మంచి ప్రమోషన్స్ తో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “థాంక్ యూ”. దర్శకుడు విక్రమ్ కుమార్ అలాగే అక్కినేని నాగ చైతన్య కాంబోలో వచ్చిన మరో సినిమాగా ఇది రిలీజ్ కాగా రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాల కన్నా దారుణ పరిస్థితి లోకి ఈ చిత్రం వెళ్ళిపోయింది.

మొదటి రోజు 2 కోట్లు కూడా షేర్ ప్రపంచ వ్యాప్తంగా దాటక పోగా తెలుగు రాష్ట్రాల్లో అయితే కొన్ని ప్రముఖ థియేటర్స్ లో ఈ ఆదివారం సెలవు రోజు కూడా 7 వేలు కూడా వసూలు చేయలేకపోతోంది అట. దీనితో ఈ దారుణ పరిస్థితిలో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందా అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

దీనితో నాగ చైతన్య సినిమా పరిస్థితి ఏ స్థాయిలో ఉంది. మరి ఈ లెక్కన అయితే ఇక ఈ సినిమా బిజినెస్ లో 25 శాతం అయినా వెనక్కి తిరిగి వస్తాయో లేదో చూడాలి. ఇంకా ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నైర్, అవికా గోర్ లు హీరోయిన్స్ గా నటించగా దిల్ రాజు నిర్మాణం అందించారు. 
naga chaitanya s thank you collections drops huge way