“అంటే సుందరానికి” నిడివి ఎక్కువే..అంతసేపు నాని బోర్ కొట్టించకుండా ఉంటాడా?

Ante Sundaraniki

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “అంటే సుందరానికి”. యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా నాని కెరీర్ లో మరో మంచి మోసర్ అవైటెడ్ సినిమాగా వస్తుంది. పూర్తిగా ఒక కొత్త నాని ని ప్రెజెంట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో పాటు మరిన్ని ఆసక్తికర వార్తలు ఈ సినిమాపై వినిపిస్తున్నాయి. లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ సినిమాకి బాగా ఎక్కువ రన్ టైం వచ్చిందట. మంచి ఫన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 3 గంటల నిడివి మేర వచ్చేసిందట.

అయితే ఇది ఒకింత ఎక్కువే అని చెప్పాలి. మరి ఫైనల్ కట్ లో ఎంత వస్తుందో అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అంత ఉంటే మాత్రం నాని బోర్ కొట్టించకుండా ఉంటాడో లేదో అనేది పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా చేయగా ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లో అడుగు పెడుతుంది. అలాగే వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.