fbpx
Home TR Exclusive విందు + కనువిందు = నవాబ్స్ కిచెన్

విందు + కనువిందు = నవాబ్స్ కిచెన్

 

(సుమబాల)

తొంభైవేల పెట్టుబడి, సంవత్సరంన్నర కాలం, విభిన్నంగా ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్న తపన…కట్ చేస్తే నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఛానల్ ఆరున్నర లక్షల సబ్ స్క్రైబర్స్ తో ఆరుగురు వ్యక్తులు ఛానల్ మీద ఆధారపడి జీవించగలిగే స్థాయిలో దూసుకుపోతోంది.

ప్రత్యేకత

ఇంతకు నవాబ్స్ కిచెన్ స్పెషాలిటీ ఏంటీ అంటే వంట చేయడం చూపడమొక్కటే కాదు…కళ్లకు పండుగలా చిత్రీకరించడం..పెద్ద మొత్తాల్లో వంట చేయడం..వండిన పదార్థాలను అనాథలకు, అన్నార్థులకు చేరువచేయడం…ఇదే వారిని ఫుడ్ ఛానల్స్ లో నవాబులను చేసింది.

ప్రారంభం

ఒక న్యూస్ ఛానల్ లో పనిచేసే శ్రీనాథ్, మొయిన్ ఖాజా, భగత్ స్నేహితులు. రెగ్యులర్ బీట్స్ ను వదిలి కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. జనాల్లోకి తొందరగా వెళ్లేది ఫుడ్, సినిమాలే కాబట్టి. ఈ రెండిట్లో ఫుడ్ ను ఎంచుకున్నారు. శ్రీనాథ్ కెమెరా, మొయిన్ యాంకర్, భగత్ ఎడిటింగ్ పనులు పంచుకున్నారు. అప్పటికే వీరికి సొంతంగా కెమెరా, ఎడిట్ సూట్లు ఉండడం వారి పని సులువయ్యింది. తలా ముప్పైవేలు వేసుకున్నారు. పని ప్రారంభించారు.

ప్రారంభంలోనే ఎదురుదెబ్బ ఆఫీసులో ఈ విషయం తెలిసి ఇబ్బంది మొదలయ్యింది. అంతే నాలుగంకెల జీతాలు వదిలేసి ఏదైతే అదయిందని పూర్తిగా దీనిమీదే ఆధారపడ్డారు. తాము పెట్టిన పెట్టుబడి ఎనిమిది ఎపిసోడ్స్ కే అయిపోయింది. ఆపేయాలా…ముందుకు సాగాలా…అనే సందేహం. ముందుకు సాగాలంటే చిన్న ప్రయోగం చేద్దామనుకున్నారు. చివరి ఎపిసోడ్ చివర్లో స్పాన్సర్స్ కోసం ప్రకటించారు. వెయ్యి మెయిల్స్ వచ్చాయి. ఒక్కరు మాత్రమే డబ్బులు పంపారు. అది చిరుమొత్తమే అయినా తమకు చాలా స్పూర్తినిచ్చిందని చెబుతారు మొయిన్ ఖాజా.

యూ ట్యూబ్ వంటల ఛానల్స్ లో సరికొత్త సంచలనం నవాబ్స్ కిచెన్. ఫుడ్ ఫర్ ఆల్ అనేది ట్యాగ్ లైన్. వంటకు, సేవను చేర్చి ముగ్గురు స్నేహితులు చేస్తున్న ప్రయోగం అనేకమంది అన్నార్థుల కడుపులు నింపుతోంది. దేశవిదేశాల్లో ఎంతోమంది అభిమానానికి కారణమవుతోంది. వారికీ లాభాలను తెచ్చిపెడుతోంది.

ఆ తరువాత తిరిగి చూసుకోలేదు. ప్రతి ఎపిసోడ్ స్పాన్సర్ దొరికారు. అలా రెండురోజులకో వీడియో చొప్పున నెలకు 15నుండి 18 వీడియోలు అప్ లోడ్ చేసేవారు. మొదట్లో మిగతా ఛానల్స్ కంటే డిఫరెంట్ గా ఉండాలని చేసిన వీరి ప్రయత్నం వీరిని సేవ వైపు మళ్లేలా చేసింది. వండిన పదార్థాలను పేద విద్యార్థులకు పెట్టడమే కాదు పుస్తకాలు, చదువులకు సాయం కూడా చేశారు.

పేరు వెనుక

నవాబ్స్ కిచెన్ అని పెట్టడానికి హైదరాబాద్ నవాబులకు ప్రసిద్ధి కావడమే కారణం అని చెప్పారు.  మొయిన్ ముస్లిం వేషధారణలో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో వంటకాలు చేయడం కూడా హైదరాబాదీ ట్ చ్ ఇవ్వడానికే నని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం చెప్పి ఆశ్చర్యపరిచారు మొయిన్. తనకసలు వంటే రాదని..ఈ పని చేయాలని తలచుకున్నప్పుడు వంట నేర్చుకుని చేస్తున్నానని…కాకపోతే తన అదృష్టం తన చేతితో ఏది చేసినా రుచిగా తయారవుతుందని చెప్పారు.

వందలరకాలు

చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, కల్యానీ చికెన్ బిర్యానీ, బ్లాక్ చికెన్, కొరియాండర్ చికెన్, చికెన్ హాంగ్ కాంగ్, క్రిస్పీ చికెన్ పకోరా, చికెన్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ కర్రీ, మటన్ బిర్యానీ, గోట్ లెగ్ సూప్, హోల్ లాంబ్ రోస్ట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్, బాదాం మిల్క్, డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్, చాకొలెట్ మిల్క్ షేక్…ఇలా వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, డెజర్ట్స్, జ్యూస్ లు ఏదైనా సరే పెద్ద మొత్తాల్లో తయారు చేస్తారు. అన్నార్థులకు అందిస్తారు.

మొదట్లో అన్ని పనులు మొయిన్, శ్రీనాథ్, భగత్ లే చేసుకునేవారు.  లొకేషన్ వెతకడం దగ్గరినుండి వంటసామాగ్రి, కెమెరాలు మొసుకెళ్లడం వరకు అంతా వీళ్లే. ఆ తరువాత నెమ్మదిగా ముగ్గరు అసిస్టెంట్లను పెట్టుకున్నారు. ఇప్పుడు తాము వదిలేసి వచ్చిన జీతాలకంటే ఎక్కువే సంపాదిస్తున్నామని చెబుతున్నారు.

ఇప్పుడు వీరు తాము బతకడమే కాదు సమాజసేవ చేస్తున్నారు. అదే సమయంలో మరో ముగ్గురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. త్వరలో మరో ప్రాజెక్టునూ ప్రారంభించబోతున్నారు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ రివ్యూ!

  ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలయ్యింది. తమిళంలో ‘కలైగరన్’ (హంతకుడు) గా నిర్మించి తెలుగులోకి డబ్ చేసిన ‘కిల్లర్’ కి ఆండ్రూ లూయిస్దర్శకత్వం వహించాడు. ఇతను 2012 లో కొత్త వాళ్లతో...

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘సీత’వివాదం: తేజ క్షమాపణ చెప్పాల్సిందే,లేదా కేసు

వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదా అనే విధంగా ప్రతీ సారి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’...

‘టిక్‌ టాక్‌’ టాప్ సెలబ్రిటీని దారుణంగా చంపేసారు

ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్‌‌లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 24ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని...

‘జబర్దస్థ్’ లో సడెన్ ట్విస్ట్… సీన్ లోకి సీనియర్ కమిడియన్

తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్' అనేది ఎవరూ కాదనిలేని సత్యం. ఆ పోగ్రాం సక్సెస్ అవటంతో ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. అదీ...

న్యూడ్ ఫొటోలు పంపి షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

గత కొంతకాలంగా చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యగా మీటూ అంటూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రముఖ తమిళ పాటల...

బాబూ బెల్లంకొండ ఏంటీ కామెడీ,నవ్వుకుంటున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. అయితే తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని అంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తన తాజా చిత్రం సీత ప్రమోషన్ లో...

అదనపు బలగాలపైనా మండిపోవటమేనా ?

కౌంటింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. అదనపు బలగాలను మోహరించటంపైన కూడా చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎలక్షన్ కమీషన్ చేసే ప్రతీ పనినీ...

జపాన్ లో రానా తుఫాన్

అవును ..ఇప్పుడు జపాన్ లో దగ్గపాటి రానా సినిమాల తుఫాను వస్తోంది అక్కడ వరస పెట్టి ఆయన సినమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల...

వెయ్యి కోట్లకు చేరుకున్న బెట్టింగులు ?

రాష్ట్రంలో బెట్టింగుల జోరుతో మారు మోగిపోతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయళ్ళు బరిలోకి దిగినా తర్వాత మెల్లిగా ఊపు తగ్గిపోయింది. పోలింగ్ ముగిసిన రోజు నుండి దాదాపు పది రోజులు బెట్టింగ్...

ఓడిపోతే….అందుకే సాకులు వెతుక్కుంటున్నారా ?

చూడబోతే  అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం.   పదే పదే ఈవిఎంలుని వివి ప్యాట్లని ఒకటే దేశవ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వాదనను కోర్టులు కొట్టేస్తున్న మళ్ళీ...

ఈ మంత్రి గెలుపు కష్టమేనా ?

చంద్రబాబునాయుడు క్యిబినెట్ లో మంత్రులందరూ రెండోసారి పోటీ చేశారు. అయితే వీరిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే మిగిలిన మంత్రుల సంగతి పక్కన పెడితే ఒక మంత్రి గెలుపోటముల విషయంలో మాత్రం...
 Nate Gerry Jersey