క‌రోనా ఆర్టిఫిషియ‌ల్ వైర‌స్.. కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌!

క‌రోనా వైర‌స్ భార‌త్ ని క‌కావిక‌లం చేస్తున్నా ఆ వైర‌స్ పుట్టు‌క గురించి ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా కామెంట్ చేయ‌లేదు. త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌లేదు. కేంద్రంలో అధికార ప‌క్షంగానీ…ప్ర‌తిప‌క్షంగానీ దీనిపై ఎలాంటి ఓపీనియ‌న్ షేర్ చేయ‌లేదు. అయితే అగ్రరాజ్యం అమెరికా మాత్రం మొద‌టి నుంచి వైర‌స్ కి పురుడు పోసింది చైనా వాళ్లేనని బ‌ల్ల‌గుద్ది చెబుతోంది. ఒక‌టికి ప‌దిసార్లు చైనా చేసిన పాప‌మే…చైనా ప్ర‌పంచ వినాశానాన్నే కోరుకుంద‌ని.. అందుకు కం‌క‌ణం క‌ట్టుకుంద‌ని పెద్ద ఎత్తున ఆరోపించింది. ఇంకొన్ని దేశాలు అమెరికా మాట‌కు మ‌ద్ద‌తునిస్తున్నాయి. కానీ భార‌త్ మాత్రం అమెరికాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు.. చైనా వైర‌స్ కాద‌ని చెప్ప‌లేదు.

ఈ విష‌యంలో భార‌త్ కాస్త ముసుగులో గుద్దులాట వైఖ‌రినే ప్ర‌ద‌ర్శిస్తోంది. భార‌త ప్ర‌జలు మాత్రం చైనా మ‌హమ్మారే మ‌న‌ల్ని కాటేయ‌డానికి వ‌చ్చింద‌ని బ‌లంగా విశ్వ‌సించి చైనా పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా మ‌రికొన్ని ప్ర‌పంచ దేశాలు చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్ బ‌య‌ట‌కొచ్చింద‌ని ప్ర‌క‌టించాయి. కొవిడ్-19 మొద‌టి కేసు అక్క‌డే నమోదైంది. కాబ‌ట్టి ఈ వైర‌స్ కి చైనా పురుడి పోసి.. దాన్ని పెంచి పెద్ద‌దాన్ని చేసి ప్ర‌పంచ దేశాల మీద‌కు ప‌గ తీర్చుకోమ‌ని వ‌ద‌లింద‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ ప‌క్క ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ హెచ్ ఓ) కూడా వైర‌స్ పుట్టుక గురించి ఎలాంటి కామెంట్ చేయ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ క‌రోనా వైర‌స్ ని ఆర్టిఫిషియ‌ల్ వైర‌స్ గా చెప్పుకొచ్చారు. సాధార‌ణ `వైర‌స్` ఏదీ స‌హ‌జంగా మ‌నుషుల మీద‌కు రాలేద‌ని ఓ ఇంట‌ర్వూలో వెల్ల‌డించారు. క‌రోనాని సృష్టించార‌నే అభిప్రాయాన్ని గ‌ట్టిగా చెప్పారు. అంటే వైర‌స్ చైనా సృష్టి అని భార‌త్ ఇప్ప‌టికైనా ఒప్పుకున్న‌ట్లేనా? అంటే ప్ర‌స్తుతానికి అలాగే అనుకోవాల్సిందే. మోదీ జీ దీనిపై నేరుగా మాట్లాడ‌కుండా ఇలా మంత్రివారిని సీన్ లోకి దింపారు! అంటూ జాతీయ మీడియా క‌థ‌నాలు వేడెక్కించేస్తున్నాయ్‌.