20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ లెక్క ఇదే

ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన 20 లక్ష‌ల కోట్ల ఆర్ధిక ప్యాకేజ్ పై పూర్తి వివ‌రాల‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం వెల్ల‌డించారు. వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం ప్యాకేజీకి రూప‌క‌ల్ప‌న చేసామ‌న్నారు. స్వ‌దేశీ బ్రాండ్ల‌ను త‌యారు చేయ‌డ‌మే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మోదీజీ ముందుంటారు. గుజ‌రాత్ భూక‌పం నుంచి ప్ర‌స్తుత ప్యాకేజీ ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ అది నిరూప‌ణ అవుతూనే ఉంది. సూచ‌న‌లను కూడా ఈ ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న‌లో ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని స్ప‌ష్టం చేసారు.

ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి ఎంతో దోహ‌ద ప‌డుతుంద‌న్నారు. `స్వీయ ఆధారిత భార‌తం` పేరుతో ప్యాకేజీకి రూప‌క‌ల్ప‌న చేసామ‌న్నా రు. ఐదు సూత్రాలతో ఈ ప్యాకేజీని రూపొందించామన్నారు. అందులో ఒక‌టి ఆర్థిక, రెండు మౌలిక, మూడు సాంకేతిక, నాలుగు దేశ జనాభా, ఐదు డిమాండ్ ప్రధాన సూత్రాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2వేల కోట్ల రూపాయ‌ల‌ను ఇబ్బందుల్లో ఉన్న చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు అందిస్తామ‌న్నారు. దీంతో 2 ల‌క్ష‌ల ప‌రిశ్ర‌మ‌లు లాభ‌ప‌డ‌తాయని పేర్కొన్నారు.

ఎన్‌పీఏలు, అన్ని ఎంఎస్ఎంఈలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. స్థానిక ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచ వ్యాప్తం చేయ‌డ‌మే ల‌క్ష్మంగా ప‌నిచేస్తామ‌న్నారు. గ‌త 40 రోజుల్లో మ‌న శ‌క్తి ఏంటో ప్ర‌పంచానికి తెలిసింద‌న్నారు. న‌వ భాత‌ర నిర్మాణ‌మే ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ అని మూల సూత్ర‌మ‌న్నారు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవాళ్ల నుంచి ఒక్కొక్క‌టిగా వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.