చిచ్చు చిచ్చు చిచ్చు .. ఏపీ లో రేగిన చిచ్చు – అక్కడెక్కడో మంటలు రేపింది !

బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి మనందరికీ. ఎక్కడో ఎదో జరిగితే ఇంకెక్కడో ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్న రెండు రాష్ట్రాలను చూస్తే ఈ బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ నిజమనే అనిపిస్తుంది. ఆ రెండు రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళ నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం బయటకు వచ్చింది.

రాష్ట్రంలో ఇప్పుడు ఈ అంశంపై అధికార పక్షం, ప్రతిపక్షం రోజు కొట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు రాజధానుల అంశం పక్క రాష్ట్రమైన తమిళ నాడులో కూడా మొదలైంది. తమిళ నాడుకు మధురైని రెండవ రాజధానిగా చెయ్యాలనే కొత్త వాదన బయటకు వచ్చింది. మదురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదాన్ని మంత్రిగా ఉన్న ఉదయ్ కుమార్ వినిపించడం ప్రారంభించారు. మరో వైపు తిరుచ్చిని రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని ఎంజీఆర్‌ హయాంలోనే ప్రతిపాదనలు ఉన్నాయని అక్కడి అన్నాడీఎంకే నేతలు డిమాండ్లు ప్రారంభించారు.

ప్రాంతాల మధ్య పోటీ పెట్టి విభజన రాజకీయం చేయడానికి తమిళ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మధురైను రాజధానిగా ప్రకటించాలని అన్ని డిమాండ్స్ అన్నాడిఎంకే నుండే వస్తున్నాయి. తమిళ నాడులో ఇప్పుడు రాజకీయ పోటీ పెరిగింది. అన్నాడిఎంకేలో ఇప్పుడు అధికార లోపం కూడా ఉంది. ఆలాగే ఇప్పుడు హీరోలు కూడా పార్టీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తమకు గట్టి పోటీ తప్పదని భావించిన అన్నాడిఎంకే ఈ ప్రాంతీయ సెంటిమెంట్ కు తెర లేపింది. మదురైను రాజధానిగా చేసి అక్కడ ప్రజల బలం కలిగిన డీఎంకేను దెబ్బ తీయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ప్రాంతీయ సెంటిమెంట్స్ రానున్న ఎన్నికల్లో ఆన్నాడీఎంకేకు ఎలా ఉపయోగపడనున్నాయో వేచి చూడాలి. ఏపీ రాజకీయాల ప్రభావం పక్క రాష్ట్రాలపై కూడా బలంగా ఉంది. ఏపీలో వైసీపీ నాయకులు పెట్టిన చిచ్చు తమిళ నాడులో పొగలు రేపుతోంది.