క‌రోనాపై షాకింగ్ నిజాలు..భార‌త్ ప‌రిస్థితి ఏంటి?

Covid - 19

కోవిడ్-19 మందు లేని..మందు రాని జ‌బ్బు అని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ తేల్చేసింది. ఇది ఎయిడ్స్ లాంటి రోగ‌మ‌ని క‌రోనా తో క‌లిసి బ్ర‌త‌కాల్సిందేన‌ని చేతులెత్తేసింది. ఓవైపు ప్ర‌యోగా శాల‌లో వ్యాక్సిన్ కోసం శ్ర‌మిస్తున్నా ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా రావ‌డం లేదు. ర‌క‌ర‌కాల రీసెర్చ్ ల అనంత‌రం డ‌బ్లూ హెచ్. ఓ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. డిసెంబ‌ర్ నుంచి డ్రాగ‌న్ దేశం చైనా వ్యాక్సిన్ క‌నిపెట్టే ప‌నిలో ఉంది. వైర‌స్ ని మ‌న‌మే పుట్టించాం..మ‌న‌మే చంపాల‌న్న క‌సితో ప్ర‌యోగ శాల‌ల్లో శ్ర‌మిస్తున్నా వృద్ధా త‌ప్ప స‌రైన ఫ‌లితాలు రావ‌డం లేదు. అటు అగ్ర‌రాజ్యం అమెరికా, భార‌త్, ద‌క్షిణ కొరియా, ఉత్త‌ర కొరియా, స్పెయిన్, ఇట‌లీ స‌హా ప్ర‌పంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ఎవ‌రు ప్ర‌య‌త్నాలు వాళ్లు చేస్తున్నారు.

అయినా ఆశ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. దీంతో చైనా కొవిడ్-19పై మ‌రో సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించ‌డం మ‌రింత విస్మ‌యానికి గురిచేస్తోంది. కొవిడ్-19 తీవ్రంగా ప్ర‌భావిత‌మైన వారిలో దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు కొన‌సాగ‌వ‌చ్చ‌ని షాకింగ్ నిజం వెల్ల‌డించింది. గుండె, ఊపిరితిత్తులు, ఇత‌ర అంత‌ర్గ‌త అవ‌య‌వాలు దెబ్బ‌తిన‌డం, కుంగుబాటు వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తవ‌చ్చ‌ని తెలిపింది. వీట‌న్నింటిని దీర్ఘ కాలిక వ్యాధులుగా గుర్తిస్తూ చైనా ప్ర‌భుత్వం బీమా ఫ‌రిదిలోకి తెచ్చింది. ఈ మేర‌కు చైనా జాతీయ ఆరోగ్య క‌మీష‌న్( ఎన్ హెచ్ సీ) మార్గ దర్శ‌కాలు విడుద‌ల చేసింద‌ని హాంకాంగ్ కేంద్రంగా న‌డుస్తోన్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప‌త్రిక ఆదివారం ప్ర‌చురించింది.

క‌రోనా నుంచి కోలుకోవ‌డానికి ఆయా వ్య‌క్తుల అంత‌ర్గ‌త అవ‌య‌వాల‌పై ప‌డుతున్న ప్ర‌భావాలు రోజు రోజుకూ బ‌య‌ట‌ప‌డు తున్నాయి. ఒక మోస్తారు ల‌క్ష‌ణాల‌తో ఈ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డిన వారిలో ఏ స‌మ‌స్య ఉండ‌ద‌ట‌. తీవ్రంగా ప్ర‌భావిత‌మైన వారిలో మాత్రం వారిలో కోలుకున్నా గుండె, ఇత‌ర అవ‌య‌వాలు దెబ్బ‌తిన్న స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయ‌ని ఎన్ హెచ్ సీ నివేదిక పేర్కొన్న‌ట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్ల‌డించింది. ఇదే గ‌నుక నిజ‌మైతే భార‌త్ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారే అవ‌కాశం ఉంది. కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరువ‌వుతోంది.

మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ బాధితుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. దీంతో వారిలో ఎంత మందిపై వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపింద‌న్న‌ది ఇప్పుడ‌ప్పుడే తేలే విష‌యం కాదు. ఇంకా వైర‌స్ వ్యాప్తి అంత‌కంత‌కు పెరిగిపోతుంది. దీంతో భ‌విష్యత్ లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌పంచ దేశాల్లో చైనా త‌ర్వాత అత్య‌ధికంగా 135 కోట్ల జ‌నాభా క‌ల్గిన దేశం.