సోనుసూద్ సేవ‌ల‌పైనా రాజ‌కీయాలా?

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ వ‌ల‌స కార్మికుల ప‌ట్ల ఎంత‌గా చలించిపోయాడో ఆయ‌న చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది. ఇత‌ర రాష్ర్టాల్లో లాక్ అయిన కార్మికుల‌ను స్వ‌రాష్ర్ట‌ల‌కు త‌ర‌లించేందుకు సొంతంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి బ‌స్సులేసి త‌ర‌లించాడు. దీంతో సోనూసూద్ వ‌ల‌స కార్మికుల‌పట్ల దేవుడ‌య్యాడు. ప్ర‌జ‌ల్లో మంచి సేవా దృక్ఫ‌థంగ‌ల వ్య‌క్తిగా నిలిచాడు. సోనూసూద్ సేవ‌ల‌కు వివిధ రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు ఫిదా అయిపోయారు. నువ్వు రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. నీకు తిరుగులేదు వ‌చ్చేయి అంటూ చాలా పార్టీలు ఆహ్వానించాయి. ఇక ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ మాజీ అమరిందర్ సింగ్ త‌దిత‌రులు సోనూ సూద్ ని ఎంత‌గానో ప్ర‌శంసిచారు.

ఆ ప్ర‌శంస‌లు..సోనూ సూద్ సేవ‌లు సోష‌ల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా న‌లిగాయి. ఓ న‌టుడిగా క‌న్నా…మాన‌వ‌త్వం ఉన్న మంచి వ్య‌క్తిగా ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యాడు. అలాంటి గొప్ప ప‌నులు చేసిన సోనుసూద్ ని కొన్ని రాజ‌కీయ పార్టీలు వ‌ద‌ల పెట్ట‌లేదు. దాన్ని రాజ‌కీయం చేయాల‌ని చూసాయి. సోను సూద్ ని ఓ రాజ‌కీయ పార్టీకి అంట‌గ‌డుతూ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. బ‌స్సుల అనుమ‌తి కోసం సోనుసూద్ అక్క‌డ గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసాడు. వెంట‌నే అనుమ‌త‌లు వ‌చ్చాయి. దీంతో మ‌హారాష్ర్ట‌లోని ఎన్సీపీ-శివ‌సేన అక్క‌డ ప్ర‌భుత్వాన్ని చెడు చేసేందుకే ఆ న‌టుడు గ‌వ‌ర్నర్ ని క‌లిశాడ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అక్క‌డితే ఆగితే స‌రిపోయేది. కానీ మ‌రీ హీరోపై విషం చిమ్మే ప్ర‌య‌త్నాలు చేసాయి ఆ రెండు పార్టీలు. ప్రచారం కోసం వీళ్ళు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారంటూ 2019 లో కోబ్రా పోస్ట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ని సంఘమిత్ర అనే నాయకురాలు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. సోనుకి బీజేపీ అన్ని అనుమ‌తులు ఎలా ఇస్తుంది? స‌్థానిక ప్ర‌భుత్వాల అనుమ‌తులు అవ‌స‌రం లేదా? అంటూ నీచ రాజ‌కీయాలు చేసే ప్ర‌య‌త్నం చేసారు. ఇదంతా బీజేపీ ఆడిస్తోన్న డ్రామా అంటూ వ్యాఖ్యానించాయి ఆ పార్టీలు. అయితే అదే సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు ఆ పార్టీల‌పై నిప్పులు చెరిగారు. మీ దిక్కు మాలిన రాజ‌కీయాలు మానేయండి అంటూ మండిప‌డ్డారు.