భారత్-చైనా వివాదం పై కేఏ పాల్ కామెంట్ ఇదే!

భార‌త్ – చైనా మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం అలుముకుంటుంది. దొడ్డి దారిలో దొంగ‌దెబ్బ తీసి 20 మందికిపై గా భార‌త్ సైనికుల్ని చైనా పొట్ట‌న‌బెట్టుకుoది. ప్ర‌తి దాడిలో అంత‌కు మించి న‌ష్టాన్ని చైనా చూసింది. అయినా చైనాకు ఆ ట్రీట్ మెంట్ స‌రిపోదు. భార‌త్ దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని క‌సితో ర‌గిలిపోతుంది. వార్ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక సంకేతాలు పంపింది. ఢీ కొట్ట‌డానికి భార‌త త్రివిధ ద‌ళాలు సిద్ధంగా ఉన్నాయి. భార‌త గ‌డ్డ‌ని చూడాలంటేనే వెన్నులో ఒణుకు పుట్టించేలా తెగ‌బ‌డ‌టానికి సిద్దంగా ఉన్నామ‌ని ఇండియ‌న్ ఆర్మీ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. భారత్ -పాక్ త‌ల‌ప‌డినా…భార‌త్-చైనా త‌ల‌ప‌డిన అది మూడ‌వ ప్ర‌పంచ యుద్ధానికే దారి తీస్తుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా క‌థ‌నాలు వేడెక్కించాయి. తాజాగా ఈ వివాదంపై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రెండు దేశాల మ‌ధ్య మూడ‌వ ప్ర‌పంచ యుద్దానికి దారి తీస్తుంద‌ని తాను ముందే చెప్పాన‌న్నారు. 20 మంది సైనికులు చ‌నిపోయారంటే దానికి కార‌ణం ఎవ‌రంటూ ? ప్ర‌శ్నించారు. చైనాకు ధీటైన నాయ‌కుడు ప్ర‌పంచంలో లేక‌పోవ‌డం వ‌ల్లేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికా అద్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో బ‌య‌ట‌కి తెలియ‌ని వ్యాపారాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ర‌ష్యా మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని అన్నారు. మ‌న దేశాన్ని ర‌క్షించాల‌ని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ క‌లిసి పాటుప‌డ‌దామ‌ని..దీనిలో భాగంగా ముస్లీంలు, హిందువులు, క్రైస్త‌వులు భౌద్ధులు, జైనులు, సిక్కులు అంతా ఏక‌మ‌వ్వాల‌ని తాను అనేక స‌మావేశాల్లో చెప్పాన‌న్నారు. ఈ విష‌యంపై అంద‌ర్నీ క‌ల‌పాల‌ని క‌పిల్ సిబాల్ తో కూడా మాట్లాడిన‌ట్లు పాల్ చెప్పుకొచ్చారు.

అలాగే క‌రోనా వైర‌స్ చైనా నుంచి వ‌చ్చింద‌ని..ఆ దేశ‌మే ప్ర‌పంచ దేశాల మీద‌కు కావాల‌ని వ‌దిలిపెట్టింద‌ని అన్నారు. ప్ర‌పంచ దేశాలు అన్ని క‌లిసి చైనా పై దాడి చేయాల‌ని పాల్ గ‌తంలో వెల్ల‌డించారు. కాగా దేశంలో బ‌ర్నీంగ్ ఇష్యూల‌పై త‌న‌దైన శైలిలో యూ ట్యూబ్ ల ద్వారా స్పందించ‌డం పాల్ కు అల‌వాటే. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, వివాదాస్ప‌ద అంశాల విష‌యంలోనే పాల్ వేలు పెట్టి సోష‌ల్ మీడియాలో హైలైట్ అవుతుంటారు. అదే వేదిక‌పై పాల్ కామెంట్లు అంతే ఆస‌క్తిగా, స‌ర‌ద‌గానూ ఉంటుంటాయి.