fbpx
Home National అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా మళ్లీ తొలగించిన కేంద్రం

అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా మళ్లీ తొలగించిన కేంద్రం

అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి కేంద్రం  మళ్లీ తొలగించింది. ప్రధాని నాయకత్వంలోని హై పవర్ డ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వివరాలు అందాల్సి ఉంది. రెండు రోజుల కిందటే  హైకోర్టు ఆయనను సిబిఐ డైరెక్టర్ గా నియమించింది. ఆయన నిన్ననే విధుల్లో చేరారు. చేరిచేరగానే తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దు చేశారు. గురవారం నాడు మరొక ఐదుగురిని బదిలీ చేసి సంచలనం సృష్టించారు.

అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా నియమిస్తూ ఆయన  భవితవ్యం మీద వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు మల్లి కార్జున ఖర్గే ఉన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలోఅలోక్ వర్మను తొలగించాలన్న నిర్ణయాన్ని ఖర్గే వ్యతిరేకించారు. అయితే, మెజారిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను బలపర్చడంతో అలోక్ వర్మ పదవీచ్యుతుడయ్యాడు. సమావేశానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తరఫున జస్టిస్ ఎకె సిక్రి హాజరయ్యారు.

అలోక్ వర్మ పదవీ కాలం జనవరి 31న ముగుస్తున్నది. అయితే, సిబిఐ ఉన్నత స్థాయిలో అవినీతి అరోపణలు, కొట్లాటలు జగడంతో అలోక్ వర్మతో పాటు, స్పెషల్ డైరెక్టర్ అస్తానాను కేంద్రం బాధ్యతలనుంచి తప్పించింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ