ఇప్పటికీ అమలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నాగర్జున… ఏం మాటిచ్చాడో తెలుసా…?

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ అమలతో ప్రేమలో పడి ఆమెను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే మొదట హీరో వెంటకేష్ గారి సోదరి లక్ష్మితో నాగార్జునకి మొదటి వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ కూడా విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలని రెండవ వివాహం చేసుకున్నాడు.

అయితే ఇలా సినిమా ల ద్వారా నాగార్జున బాగా సంపాదించాడు. సినిమాలలో మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టి ఆస్తిని వెనకేసుకున్నాడు. ప్రముఖ బుల్లితెర ఛానల్ మా టీవీ లో నాగార్జునకి భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికీ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు టీవీ షోలు చేస్తూ నాగార్జున బాగా సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉండగా పెళ్లి అయిన కొత్తలో నాగార్జున నుండి అమల ఒక మాట తీసుకున్నట్లు సమచారం. ఇప్పటికీ నాగార్జున ఆ మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అమలకు మూగ జంతువులు అంటే చాలా ఇష్టం. మూగ జంతువుల సంరక్షణకు ప్రతి ఏటా ఆమె ఎంతో డబ్బు ఖర్చు చేసి వాటికి సదుపాయాలను దగ్గరుండి మరి చూసుకుంటుంది.

ఈ క్రమంలో నాగార్జునతో పెళ్లి జరిగిన తర్వాత అమల ప్రతిఏటా మూగజీవాల సంరక్షణ కోసం తాను సంపాదించే డబ్బులలో కొంత డబ్బు ఖర్చు చేయాలని నాగార్జునతో మాట తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పుడు అమలకి ఇచ్చిన మాట నాగార్జున ఇప్పటికీ మర్చిపోలేదని..ప్రతి సంవత్సరం తాను సంపాదించిన దాంట్లో కొంత డబ్బు మూగజీవాల సంరక్షణ కోసం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నాగార్జున అమల పట్ల ఉన్న ప్రేమని తెలియచేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించాడు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.