Home Movie Reviews Telugu Movie Reviews ‘సీత’ రివ్యూ - నాన్ స్టాప్ డైలాగ్ డ్రామా!

‘సీత’ రివ్యూ – నాన్ స్టాప్ డైలాగ్ డ్రామా!

 దర్శకుడు తేజ టీనేజీ ప్రేమ సినిమాల వైపు నుంచి క్రమంగా పక్కకు జరుగుతూ స్టార్స్ తో మాస్ సినిమాలు తీస్తున్నారు. రానా – కాజల్ అగర్వాల్ లతో ‘నేనేరాజు నేనేమంత్రి’ అనే పొలిటికల్ డ్రామా తీసి సక్సెస్ అయ్యాక, ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ లతో ‘సీత’ అనే యాక్షన్ డ్రామా తీశారు. ట్రాక్ రికార్డు సరిగా లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం, సాక్ష్యం, జయ జానకీ నాయక, స్పీడున్నోడు, రభస, అల్లుడు శ్రీను… ఇలా తన మార్కెట్ కి మించిన స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ దెబ్బతింటూ వచ్చాడు. సమంతా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ల వంటి పాపులర్ స్టార్స్ తో కలిసి నటించినా పాత మూస కాలం చెల్లిన పాత్రల వల్ల, సినిమాల వల్ల, శ్రీనివాస్ సినిమా జర్నీ స్పీడందుకో లేదు. లాస్ ఏంజిలిస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుంచి యాక్టింగ్ డిగ్రీ పొందిన తను యాక్ట్ చేస్తున్నవి లో- డిగ్రీ సినిమాలై పోయాయి. ఇక ఈసారైనా సినిమాల షేపు మార్చుకున్న తేజ సారధ్యంలో తన షేపు కూడా మారిందా? మరోసారి కాజల్ అగర్వాల్ సహకారంతో  ‘సీత’ తో ఫ్లాపుల గీత దాటాడా? అలాగే తేజ రెండో మాస్ కమర్షియల్ ప్రయత్నం ఫలించిందా? ఇవి తెలుసుకునేందుకు రివ్యూలో కెళ్దాం…

కథ 

          వ్యాపార మనస్తత్వంతో బంధుత్వాలు పట్టించుకోని సీత (కాజల్ అగర్వాల్) తండ్రికి చేసిన ఛాలెంజితో వంద కోట్లు సంపాదించాలనుకుంటుంది. ఒక స్థలాన్ని పదికోట్లకి కొనేసి ఇరుక్కుంటుంది. ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ప్రజలు నివసిస్తూంటారు. వాళ్ళని ఖాళీ చేయించడానికి ఎమ్మెల్యే బసవరాజు (సోనూ సూద్) ని ఆశ్రయిస్తుంది. ఆమె అందచందాలకి పడిపోయిన బసవరాజు, తనని పెళ్లి చేసుకుంటే సహాయ పడతానంటాడు. పెళ్ళీగిళ్ళీ జాంతానై జావ్ అంటుంది. తర్వాత అతడితో నెలరోజుల సహజీవనానికి ఒప్పుకుని సంతకం పెడుతుంది. బసవ రాజు ఆ స్థలం ఖాళీ చేయించాక అడ్డం తిరుగుతుంది. దీంతో బసవరాజు పగబట్టి ఆమెకి ఆర్ధికపరమైన ఇబ్బందులు కల్పించి, బెడ్ మీదికి లాగాలన్న పథకం ప్రారంభిస్తాడు. ఇందులో భాగంగా చెక్ బౌన్స్ కేసు పెట్టిస్తాడు. ఇంతలో సీత తండ్రి (భాగ్యరాజ్) చనిపోతాడు. ఐదువేల కోట్ల ఆస్తిని భూటాన్ లో రామ్ (బెల్లంకొండ) కి రాసేస్తాడు. భూటాన్ లో బౌద్ధ మఠంలో మాయామర్మం తెలియకుండా అమాయకంగా పెరిగిన రామ్ ని బురిడీ కొట్టించి, ఐదువేలకోట్లు కొట్టేసి బసవరాజు పెట్టే కష్టాల్లోంచి బయట పడాలనుకుంటుంది సీత. ఇప్పుడేమైంది? అనుకున్నట్టు చేసిందా? అమాయకుడైన రామ్ ఆమె చేతిలో కీలు బొమ్మగా మారేడా? ఎట్టి పరిస్థితిలో ఆమెని బెడ్ మీదికి లాగాలన్న బసవరాజు కోరిక నెరవేరిందా? ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ 

          పాత ఫార్ములా కథే. కోట్ల ఆస్తికి  చెల్లెలి కొడుకు వారసుడై, అతణ్ణి (బావని) పెళ్లి చేసుకుంటేనే ఆ ఆస్తిని అనుభవించగలవని, తలపొగరు కూతురికి తండ్రి షరతు పెట్టే ఫార్ములా డ్రామా ఈ నాటి యూత్ కి పట్టేది కాదు. కాకపోతే ఈ కథలోనే వున్న ‘నెలరోజుల సహజీవన ఒప్పంద పత్రం’ పాయింటుని వైరల్ చేసి,  కథకి యూత్ అప్పీల్ తీసుకురావచ్చు. తను సహాయం కోరితే ఎమ్మెల్యే ఇలా పత్రం రాయించుకున్నాడని సీత పాత్ర గనుక ఆ కాగితాన్ని బయటపెడితే, లేదా బయటపెట్టకుండా బ్లాక్ మెయిల్ చేస్తే, ఆ ఎమ్మెల్యేనే ఇరుక్కుని పోతాడు. ఆ పత్రం ఆమె చేతిలో ‘మీ టూ’ అస్త్రం లాంటిది నిజానికి. అంత తెలివైన సీత ఇదెందుకు ఆలోచించలేదో? ‘ఉంగరం పడిపోయింది…పోతేపోనీ …పోతేపోనీ’ అన్న పాటలాగా అస్త్రాన్ని జారవిడుకుని, సీతని పారిపోయేలా చేస్తూ ఏదేదో కథ నడిపారు. ఇలా సెకండాఫ్ కి కథే లేకుండాపోయి ఖాళీ అయింది స్క్రీన్ స్పేస్. 
          మరొకటేమిటంటే, ఈ కథకి సినిమా స్థాయి లేదు. చెక్ బౌన్స్ కేసు, ఆ కేసులోంచి బయట పడేందుకు హీరోయిన్ ప్రయత్నాలు – ఇదే ప్రధాన కథవడంతో సినిమాగా  కూర్చోబెట్టడానికి కురచదై పోయింది. ఇక హీరో పాత్ర వెరీ బ్యాడ్ ఐడియా. 

ఎవరెలా చేశారు 

          బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలోకి హైజాక్ అయి వచ్చినట్టుంది. ‘కవచం’ తర్వాత ఎక్కడో చిల్ అవుతున్న తనని తేజ చెప్పా పెట్టకుండా హైజాక్ చేసి తెచ్చి, కాజల్ అగర్వాల్ కథా ప్రపంచంలో పడేసినట్టుంది. సాయి శ్రీనివాస్ కి పాత్రేమిటో అర్ధంగావడం లేదు, కథేమిటో అర్ధం గావడం లేదు. చిన్నప్పుడు మేనత్త వాతలు పెడితే మానసికంగా దెబ్బతిన్నాడు. మేనమామ ఎక్కడో పరదేశం భూటాన్ మఠంలో చేర్పిస్తే, ఆ మఠ గురువులు మానసికంగా బాగు చెయ్యరేమో  – అదే చిన్నపిల్లాడి మనస్తత్వంతో పెరిగి పెద్ద వాడవుతాడు. దీనికి తేజగారు ఆడియెన్స్ కనిపెట్టేసి, ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్ పాత్ర అని ఎక్కడనేస్తారో అన్నట్టు తానే – స్వాతిముత్యం గాడు…స్వాతి ముత్యంగాడు – అని హీరోయిన్ చేత అన్పిస్తూ సేఫ్ అయిపోయారు.

 
          ఇక ‘స్వాతిముత్యం’ కమల్ హాసన్ తో సాయి శ్రీనివాస్ పాట్లు చూడాలి. చూడలేక మనం నవ్వుకోవాలి. ఇదే తను అందించే ఎంటర్ టైన్మెంట్ అయింది. యాక్షన్ హీరో పాత్రలు చేసుకోక ఎందుకు ఈ నటించలేని పాత్ర చేయడమో అంతుబట్టదు. తననుంచి మాస్ ప్రేక్షకులు కూడా ఆశించేది ఇది కాదు.

          కాజల్ అగర్వాల్ ఎంత బలహీన సీన్ ని కూడా తన స్పార్క్ తో మెరిపిస్తూ పోయింది. అయితే పాత్రకి, కథకి తగిన బలం లేకపోడం ఆమెకి గుది బండగా మారింది. సీత పేరుపెట్టుకుని శూర్పణఖలా ప్రవర్తించే ఆమె,  బసవరాజు ముక్కే కత్తిరించే పనులు చేయాలి నిజానికి తన శీలాన్ని

కొనుక్కోబోయినందుకు.  ఇదొక బిగ్ ఎరోటిక్ థ్రిల్లర్ అవ్వాల్సింది. ఆమెకి సోనూ సూద్ (బసవరాజు) తో ఈ ఎరోటిక్ గేమ్ లేక, ఇటు సాయి శ్రీనివాస్ తో ఎలాటి రోమాన్సూ లేకా – ఉత్త డ్రై పాత్రలాగా మిగిలిపోయింది- పనికిరాని చెక్ బౌన్స్ కేసు కంగారుతో. 

          ఇక సోనూ సూద్ బసవరాజు పాత్ర ‘కందిరీగ’ లో హీరోయిన్ ప్రేమ కోసం తను పోషించిన పాత్ర లాంటితే. అందులో హీరోయిన్ కోసం తన కామెడీ విలనీ ఆ సినిమా మంచి హిట్ అవడానికి కారణమైంది. ‘సీత’ లో సీరియస్ కరుడుగట్టిన విలన్ గా హీరోయిన్ తో ఈ లవ్ యాంగిల్ తెగి,  రావణుడి రూపంగా మిగిలాడు. ఎందుకు దీన్ని రాముడు – సీత- రావణ ట్రయాంగిల్ లో రామాయణంలా చేయాలనుకున్నారో అర్ధంగాదు. 

          ఈ మూడు పాత్రలు పోగా, తనికెళ్ళ భరణి సోనూ సూద్ పక్కన పంచులిచ్చే పాత్ర పోషించారు. అభిమన్యూ సింగ్ ది చెక్ బౌన్స్ కేసులో కాజల్ అగర్వాల్ ని పట్టుకోవడానికి వెంటబడే పోలీసు పాత్ర. ఇక ఇత శాఖలు చూస్తే అనూప్ రూబెన్స్ సంగీతంలో నిజమేనా అనేపాట, ఇంకో ఐటెం సాంగ్ బావున్నాయి. శీర్ష్ కెమెరా వర్క్ బావుంది. సాధారణంగా తేజ సినిమాల్లో కెమెరా వర్క్ బాగానే వుంటుంది. 

చివరికేమిటి  


          ‘నేనేరాజు నేనే మంత్రి’తో కొత్త తేజగా ఎంట్రీ ఇచ్చిన తేజ, ఈ రెండో మాస్ కమర్షియల్ ని హేండిల్ చేయడంలో వెనుకబడ్డారు. చెక్ బౌన్స్ అనే బలహీన పాయింటు మీద కథ నడుపుతూ, అడుగడుగునా ట్విస్టులతో నింపేస్తూ, ఒక క్షణం కూడా గ్యాప్ లేని డైలాగుల మోతతో పాత డ్రామా లాగా మార్చేస్తూ విఫలయత్నం చేశారు. ఎరోటికానీ, రోమాన్స్ నీ కచ్చితంగా డిమాండ్ చేస్తున్న ఈ కంటెంట్ లో వీటి ఊసే లేకుండా చేశారు. ఫస్టాఫ్ లో అనేక ట్విస్టులతో కథ భారమై పోగా, సెకండాఫ్ లో చెక్ బౌన్స్ చుట్టూ కథే లేకుండా పోయింది. కాజల్ అగర్వాల్ పాత్రని అలాఅలా చూడగల్గినా, బెల్లంకొండ పాత్ర చాలా మైనస్ అయింది సినిమాకి. పైగా నిడివి కూడా పెరిగిపోయింది. తేజ, బెల్లంకొండ ఇద్దరూ ‘సీత’ ని నవ్వించే ఆధునిక సీతగా చేసుకుని లాభ పడలేకపోయారు.

రచన- దర్శకత్వం : తేజ 
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా, సోనూసూద్ తనికెళ్ళ భరణి, అభిమన్యు సింగ్ తదితరులు 
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : శీర్ష్ 
బ్యానర్ :
 ఏకే ఎంటర్ టైన్మెంట్స్ 
నిర్మాత : అనిల్ సుంకర, సుంకర రామబ్రహ్మం 
విడుదల : మే 24, 2019
2 / 5 

సికిందర్  

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...

విశ్వ‌క్‌సేన్ దృష్టిలో `ఎఫ్‌2` విలువ అంతేనా?

కోరి వివాదాల్లో ఇరుక్కోవ‌డం.. త‌న‌కు తోచింది మాట్లాడ‌టం హీరో విశ్వ‌క్‌సేన్‌కి అల‌వాటుగా మారింది. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసి వార్త‌ల్లో...

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...

రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో...