Home Movie Reviews Telugu Movie Reviews రివ్యూ: మణికర్ణిక - ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ

రివ్యూ: మణికర్ణిక – ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ

―సికిందర్
Rating:2.5 / 5

వారం వారం బయోపిక్కులు విడుదలవుతూ ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇన్ని చూడలేక కొన్ని మిస్సవుతున్నారు. ఇన్నాళ్ళూ కాలక్షేప సినిమాలు చూస్తూ అరగంటలో రివ్యూలు రాసేసే రివ్యూ రైటర్లు, బయోపిక్ చూసినప్పుడల్లా రివ్యూ రాయాలంటే చరిత్ర పుస్తకాలూ తిరగేయాల్సిన మోతబరువు మీద పడింది. ఎవరెవరి చరిత్రలు, ఎన్నెన్ని చరిత్రలు. ఇప్పుడు ‘మణికర్ణిక’ మరో చరిత్ర. ఈ చరిత్రలేవీ చరిత్ర లిఖించడం లేదు. ఒక కొత్త వ్యాపార వస్తువుగా సొమ్ముచేసుకునే స్వకార్యం తప్ప, స్వామి కార్యం కన్పించడం లేదు. ఈ తాజా బయోపిక్ కూడా ఇలాగే వుందా? ఇది తెల్సుకుందాం…

 

కథ

బాల్యంలోనే తల్లిని కోల్పోయిన మణికర్ణిక (కంగనా రణౌత్), తండ్రి పెంపకంలో పోరాట విద్యల్లో ఆరితేరుతుంది. ఝాన్సీ సంస్థాన రాజగురువు ఆమె విద్యల్ని గమనించి కోడలిగా తెచ్చుకోవాలని రాజు తండ్రికి సలహా చెప్తాడు. ఆమె క్షత్రియ కాదని రాజు తండ్రి సంశయిస్తే, ఆమె బ్రాహ్మణ యువతి అయినప్పటికీ, పోరాట విద్యల్లో ఆరితేరిన ఆమె ఝాన్సీ రాజ్యానికి అవసరమని రాజగురువు నచ్చ జెప్తాడు. అలా ఝాన్సీ రాజుకి భార్యగా వస్తుంది మణికర్ణిక. ఆమె పేరుని లక్ష్మీబాయిగా మారుస్తారు. పుత్రుడ్ని ప్రసవిస్తుంది. ఆ పుత్రుడు నాలుగు నెలల్లో మరణిస్తాడు.

 

రాజు మరొక పుత్రుడ్ని దత్తత తీసుకుని మరణిస్తాడు. రాజ్య భారం లక్ష్మీబాయి మీద పడుతుంది. అయితే ఇప్పటికే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దొరలు రాజ్యం మీద పెత్తనం చేస్తూంటారు. వాళ్ళు లక్ష్మీబాయి దత్తపుత్రుడ్ని వారసుడిగా ప్రకటించడానికి ఒప్పుకోరు. ఆమెని రాజ్యం విడిచి వెళ్లి పొమ్మని ఆదేశిస్తారు.

రాజభవనం స్వాధీనం చేసుకుని వెళ్ళగొట్టేస్తారు. ఇక సామాన్య జనంలోంచే వచ్చిన లక్ష్మీబాయి, ఆ సామాన్య జనంతో కలిసి కంపెనీ సైన్యాల మీద ఎలా తిరగబడిందీ, తర్వాత 1857 లో మొదటి స్వాత్రంత్ర్య సమరం సిపాయిల తిరుగుబాటులో ఎలాటి ప్రముఖ పాత్ర పోషించి ప్రాణత్యాగం చేసిందనేదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వీరవనిత ఝాన్సీ లక్ష్మిబాయి (1828 -58) బయోపిక్ ఇది. బయోపిక్ ని తప్పులో కాలేస్తూ డాక్యుమెంటరీయో, డైరీయో, ఉపోద్ఘాతమో చేయకుండా రక్షించి, సినిమా కథగా బాక్సాఫీసుకి పనికొచ్చేలా చేశారు. సినిమా కథగా పనికొచ్చే కథనమే ఆమె జీవితం. కథ, స్క్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. మొదటి దర్శకుడు క్రిష్, తర్వాతి దర్శకురాలు కంగన స్క్రీన్ ప్లే విషయంలో భాగస్వాములై వుంటారు. ఫైనల్ గా తెరమీద తేలిన స్క్రీన్ ప్లే మాత్రం బలహీనంగా వుంది.

లక్ష్మీబాయి రెండిటికి ప్రసిద్ధురాలు : ఆమెకి మాతృభూమి అన్నా, పోరాటతంత్రమన్నా పంచప్రాణాలు. వీటి మీద ఫోకస్ చేసి కథ నడిపివుంటే, క్యారెక్టర్ గా ఆమె భావోద్వేగం (మాతృభూమి) ఎమోషనల్ యాక్షన్ గానూ, ఆమె లక్ష్యం (పోరాటతంత్రం) ఫిజికల్ యాక్షన్ గానూ కన్పిస్తూ, అలాటి గొలుసుకట్టు దృశ్యాలతో కథనం ఏకత్రాటిపై వుంటూ కట్టిపడేసేది.

 

పాత్ర చిత్రణ సంబంధమైన ఈ రెండిటినీ పక్కన బెట్టి కథ నడపడం వల్ల ఆసక్తి కల్గించని ఏదో కథయితే నడించింది, చివరి దృశ్యాల్లో ఆ భావోద్వేగం, పోరాటతంత్రం ఉన్నట్టుండి తెచ్చి ఎంత కలిపినా కృతకంగానే మిగిలాయి. పక్క పాత్రలతో ఆమెని ఎంత కీర్తించినా అదీ కనెక్ట్ కాలేదు.

ఎవరెలా చేశారు

కంగనా రణౌత్ పాత్ర, కథ ఎలా వున్నా, ఇంత భారీ సినిమా మొత్తాన్నీ తానొక్కదాన్నీ భుజాల మీద మోసెయ్యగలనన్న ఆత్మనిశ్వాసం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇందులో పూర్తి విజయం సాధించింది కూడా. ఐతే ఈ ఆత్మ విశ్వాసమే పాత్రని డామినేట్ చేసేలా తయారైంది. ఎందుకని ప్రతీ సీనులో లక్ష్మీబాయి కన్పించక, కంగనానే కన్పిస్తోందని ఆలోచిస్తే కారణం ఇదీ.

ఇంకో వైపున ఇండో – బ్రిటిష్ ప్రాజెక్టుగా ‘స్వోర్డ్స్ అండ్ సెప్ట్రే’ అనే ఇంకో ఝాన్సీ బయోపిక్ స్వాతీ భిసే దర్శకత్వంలో పూర్తయి విడుదలకి సిద్ధమౌతోంది. ఇందులో ఝాన్సీ గా నటించిన దర్శకురాలి కుమార్తె దేవికా భిసే, కట్టుబొట్టు ఆహార్యంతో, పీరియడ్ లుక్ తో, నేటివిటీతో అత్యంత సహజంగా కన్పిస్తోంది (స్టిల్స్ చూడండి). దీన్ని అచ్చమైన మట్టి కథగా తీశారు.

కంగనాది గిల్టు కథ. అట్టహాస ఆహార్యంతో, కులీన స్త్రీ పోకడలతో, నేటివిటీ అంటని డిజైనర్ చరిత్రలా తీశారు.

 

రాణి అయినప్పటికీ లక్ష్మీ బాయి, కోటలో వుండేది కాదు. బయట సమాన్య జీవితంలోంచి వచ్చిన తను, ఆ సామాన్యుల మధ్యే తిరుగుతూండేది. ఇలాగే చూపించారు. అత్తగారు ఎంతగా కట్టడి చేసినా ఆగేది కాదు. ఏదో రాణిగా వున్నప్పుడు వదిలేస్తే, దానికి ముందూ తర్వాతా ఆమెని మాసిండియా ప్రేక్షకులకి దగ్గరగా తీసికెళ్ళే సీదాసాదా నేటివ్ లుక్ లోకి మార్పు చేయాల్సింది.

ఒకచోట శత్రు సైనికులకి దుర్గా మాతలా కన్పిస్తుంది. ఇక్కడ కూడా మెలో డ్రామా సృష్టించి లక్ష్మీ బాయిని ఎలివేట్ చేయలేదు. అసలు ఈ పాత్రతో మెలోడ్రామా ఎక్కడా కన్పించదు. లేనిపోని సినిమాల్లో దేశభక్తిని మారు మోగిస్తున్నప్పుడు, దేశభక్తితోనే ముడిపడి వున్న లక్ష్మీబాయిని కనీసం దేశభక్తి మెలో డ్రామాతో నైనా కనెక్ట్ చేయలేదు.

ఫెమినిస్టుతో ఇలాటి సినిమా తీస్తే ఇలాగే వుంటుందేమో. తనకి వైధ్యవ్యమని గుర్తు చేసినప్పుడు, ఇంకో బాలిక వితంతువుగా ఎదురైనప్పుడు లాంటి సీన్లు మాత్రం కంగనా ఇష్టంతో పెట్టించుకున్నట్టుంది. ఆ ఫెమినిజం పరమైన డైలాగులు కొడుతుంది.

మీ అమ్మ ఇచ్చిందాన్ని (బొట్టు) లాగేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ ఆ బాలికకి కుంకుమ పూసేస్తుంది. ఈ డైలాగులో కావలసినంత మాతృస్వామ్య భావజాల ప్రకటన! డైరెక్షన్ లోకి కూడా ఇదే జొరబడి క్రిష్ వెళ్ళిపోవాల్సి వచ్చిందేమో. కానీ సినిమాకి కావాల్సింది లక్ష్మీ బాయి మాతృ భూమి ప్రేమ – దాని ప్రకటన!

ఇందులో బ్రిటిషర్లుగా నటించిన నటులు ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేకపోగా, బీగ్రేడ్ సినిమాల్లో వెర్రిమాలోకం విలన్స్ లా వున్నారు. వీళ్ళకంటే ‘అల్లూరి సీతారామరాజు’లో రూథర్ ఫర్డ్ గా నటించిన జగ్గయ్య ఏంతో బెటర్. ఒక్కరికీ నటన రాదు, డైలాగులు చెప్పడం రాదు. విగ్గులు మాత్రం ఆర్భాటంగా వుంటాయి. అందరూ ఒకేలా రివటల్లా వుంటారు. మెయిన్ విలనెవరో అర్ధంగాదు. ఇందులో కూడా ఆవిడ ఫెమినిజం దెబ్బ పడిందేమో తెలీదు. ఎవరెలా నటించాలో డైరెక్షన్ లిచ్చిన ఘనత ఆవిడదేనని క్రిష్ ఫిర్యాదు కదా?

లక్ష్మీ బాయి దళపతి గులాం గౌస్ ఖాన్ గా డానీ డాంగ్జోపా నటించాడు చాలా కాలానికి. ఆమె ఇతర ముఖ్య అనుచరులైన గుల్ మహ్మద్ గా రాజీవ్ కచ్చర్, ప్రాణ్ సుఖ్ యాదవ్ గా నిహార్ పాండ్యా, బ్రిటిషర్ లతో కుమ్మక్కయిన సదాశివ్ రావ్ గా మహ్మద్ జీషాన్ అయూబ్, రాజగురువుగా కుల్భూషణ్ కర్భందా నటించారు. తత్యా తోపే గా అతుల్ కులకర్ణి నటించాడు.

పాటల్లో హిట్స్ ఏమీ లేవు. ఛాయగ్రహణం, వీఎఫ్ఎక్స్ ఇతర సాంకేతికాలు 100 కోట్ల బడ్జెట్ కి తగ్గట్టున్నాయి. ముందనుకున్న బడ్జెట్ 70 కోట్లే. క్రిష్ తప్పుకున్నాక కంగనా 30 పెంచి జీ ఫిలిమ్స్ మీద వేస్తే, జీ ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టు బాధ్యుడ్నిడిస్మిస్ చేసి ఆమెకి జవాబు చెప్పింది. ఆమె నవ్వుతూ ఈ విషయాలు చెప్పింది.

 

చివరికేమిటి

ఎప్పుడో 1953 లో షోరాబ్ మోడీ దర్శకత్వంలో ‘ఝాన్సీకీ రాణి’ తీశారు. అందులో ఆయన భార్య, 53 సినిమాల హీరోయిన్, మెహతాబ్ అలియాస్ నజ్మాఖాన్ లక్ష్మీబాయిగా నటించింది. ఆ తర్వాత బయోపిక్ ఇదే. ఇంకోటి ఇండో – బ్రిటిష్ ప్రాజెక్టుగా రాబోతోది. రెండు టీవీ సీరియల్స్ పూర్వం వచ్చాయి. ‘మణికర్ణిక’ లో యాక్షన్ దృశ్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టి, మొదట్నుంచీ ఆమె నేర్చున్న వేట, గుర్రపు స్వారీ, కత్తి సాము, తుపాకీ కాల్పులు, జిమ్నాస్టిక్స్ వంటి పోరాట విద్యల ప్రదర్శనకి ఎక్కువ స్కోప్ ఇస్తూ, యాక్షన్ పాత్రగా మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు.

ఒక ఉదాత్త కాన్సెప్ట్ తో ఎమోషనల్ చారిత్రక పాత్రగా చూపించ లేకపోయారు. పాత్ర ఎంట్రీ కూడా ‘పద్మావతి’ లో దీపికా పడుకొనే పాత్ర ఎంట్రీ లాగే చూపించడంతో, సినిమా ప్రారంభమే ఉస్సూరనిపిస్తుంది. కంగనా పలికే ఒక డైలాగు కూడా ‘మొహెంజో- దారో’ లో హృతిక్ రోషన్ డైలాగుకి మక్కీకి మక్కీ కాపీ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హృతిక్ తో తనకి అసలే పడదు మరి.

‘మణికర్ణిక’ బయోపిక్ ని, ఒక మంచి యాక్షన్ కొరియో గ్రఫీ కోసం చూడొచ్చు, క్లయిమాక్స్ దృశ్యాలతో కలుపుకుని.

దర్శకత్వం : క్రిష్, కంగనా రాణౌత్
తారాగణం : కంగనా రాణౌత్, అతుల్ కులకర్ణి, జిష్షూ సేన్ గుప్తా, డానీ డాంగ్జోపా, మహమ్మద్ జీషాన్ ఆయుబ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : విజయేంద్ర ప్రసాద్; మాటలు, పాటలు : ప్రసూన్ జోషి
సంగీతం : శంకర్ –ఎహెసాన్- లాయ్, ఛాయాగ్రహణం : కిరణ్ ధియోన్స్, జ్ఞాన శేఖర్
బ్యానర్ : కైరోస్ కంటెంట్ స్టూడియోస్
నిర్మాతలు : జీ స్టూడియోస్, కమల్ జైన్, నిశాంత్ పిట్టి
విడుదల : జనవరి 25, 2019

Telugu Latest

కేసీఆర్ ఎక్కడ..? ఇప్పుడిదే ట్రెండింగ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి వివాదాస్పదమైంది.  రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 3700 వరకు చేరిన నేపథ్యంలో కేసీఆర్ అందుబాటులో లేరనే వార్తలు సంచలంగా...

భేష్ వైఎస్ జగన్..  మిలియన్ మార్క్ దాటిన కరోనా పరీక్షలు

కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాప్తిని పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు.  రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఈ నేపథ్యంలో భారీ ఎత్తున...

కేర్ లో కరోనా దందా.. కేసీఆర్ ఎక్క‌డున్నారో?

క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం క‌రోనా వైద్యం, టెస్టుల‌కొర‌కు ప్ర‌యివేట్ ఆసుప‌త్రుల‌కు అనుమ‌తులిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అపోలో, కేర్ స‌హా ప‌లు ఆసుప‌త్రుల్లో ఇప్పుడు కొవిడ్...

కాన‌రాని పీవీపీ జాడ‌..పోలీసుల వేట ముమ్మ‌రం

వైకాపా నేత‌, సినీ నిర్మాత పీవీపీ కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్. ఆయ‌న ఇంటి ప‌క్క‌న మొద‌లైన వివాదం ద‌గ్గ‌ర నుంచి పోలీసుల‌పై వ‌దిలిన కుక్క‌ల కేసు వ‌ర‌కూ పీవీపీ పేరు...

అమృత వ్య‌వ‌హారాన్ని చ‌ట్ట‌ప‌రంగా తేల్చుతాన‌న్న వ‌ర్మ‌!

రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న మ‌ర్డ‌ర్ సినిమాపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ప్ర‌ణ‌య్ తండ్రి, అమృత మామ పెరుమాళ్ బాల‌స్వామి ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మిర్యాల గూడ...

నాలుగు నెల‌ల పాటు ప‌వ‌న్ ఒంటిపూట భోజ‌నం

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌లన నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఏస్టార్ హీరోగానీ, ఏ పొలిటిక‌ల్ లీడ‌ర్ గానీ, చివ‌రికి సామాన్య మాన‌వుడు సైతం తీసుకొని నిర్ణ‌యం...

అలియాభట్ కు అతడంటే చాలా ఇష్టమట!?

   దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అంటే అలియాభట్ కు చాలా ఇష్టమట!. `బాహుబలి`లో అతడి  నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆ సినిమా చూసి ప్రభాస్‌కు అభిమానిగా మారిపోయా. అవకాశం వస్తే ప్రభాస్‌తో నటించాలని...

భక్తి బాటలో తమన్నా!? 

మిల్క్ బ్యూటీ  తమన్నా భక్తి బాటలో అడుగులు వేస్తోందిట. 'అవును మరి.. అవకాశాలు లేనప్పుడు అన్నీ ఎలాంటి ఆలోచనలే వస్తాయి' అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు,  ఆమె సన్నిహితులు. తమన్నా అమ్మకు ఆధ్యాత్మిక చింతన...

రాజ‌ధానిపై చంద్ర‌బాబు చేతులెత్తేసిన‌ట్లేనా? అదేనా హింట్!

రాజ‌ధానిపై టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు చెతులెత్తేసిన‌ట్లేనా? ఇక చేయ‌డానికి ఆయ‌న చేతుల్లో ఏమీ లేన‌ట్ల‌నా? అందుకే భార‌మంతా మోదీపేనా వేసారా? అంటే అవున‌నే తెలుస్తోంది. రాజ‌ధాని త‌ర‌లింపును ఎన్నిర‌కాలుగా...

అల్లూరి జిల్లాగా అన‌కాప‌ల్లా? అర‌కునా?మ‌ంత్రిగారు!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసారు. ఏడాది పాల‌న‌లో భాగంగా సంక్షేమ ప‌థ‌కాల‌పై ఫోక‌స్ పెట్టిన జ‌గ‌న్ ఇప్పుడు పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల ఆధారంగా...

ఆ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది? అందులో వాస్త‌వ‌మెంత‌!

కోలీవుడ్ స్టార్ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది? మొన్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్...నేడు త‌మిళ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్! రేపు మ‌రొక స్టార్ హీరో? ఇలా ఎంత మంది హీరోలు ఈ టెన్ష‌న్...

ఆముదవు విత్తనాలు ఆణిముత్యాలు అవుతాయా రాధాకృష్ణా?

ఎండ్రగాయ ఎప్పుడూ ఏటవాలుగానే నడుస్తుందన్నట్లు మన క్షుద్రజ్యోతి బాధాకృష్ణకు మూలశంక బాధ నానాటికీ అధికం అవున్నదే తప్ప ఆవగింజంత కూడా ఉపశమనం లభించడం లేదు.  తన కులంవాడికి అధికారం పోవడంతో పాటు తాను...

న‌టిపై డ‌మ్మీ సీఈవో అత్యాచారం

ఆమె ఓ న‌టి. క‌న్న‌డ‌లో చాలా సినిమాల్లో నటించింది. ఆ క్రేజ్ తో కోలీవుడ్ లోనూ బాగానే అవ‌కాశం అందుకుంది. అక్క‌డా బిజీ స్టార్ గా మారుతోంది. ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు పెరుగుతున్నాయి. అయితే...

మోకా మ‌ర్డ‌ర్ వెనుక‌ ఆ ఇద్ద‌రు కూడా: మ‌ంత్రి కొడాలి నాని

వైకాపా నేత‌, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచ‌రుడు మోకా భాస్క‌ర‌రావు హ‌త్య కేసులో టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది రాజ‌కీయ హ‌త్య అని మంత్రి...

బాబోయ్ క‌రోనా బ‌స్సు..తెలంగాణ‌లో టెర్ర‌ర్

కరోనా రోగి అంటేనే ఆమడ దూరం ప‌రిగెత్తే ప‌రిస్థితి. అస‌లిప్పుడు ఆ రోగం పెరెత్తితే ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఒక‌ప్పుడు లైట్ తీసుకున్న జ‌నాలు ఇప్పుడు అదే క‌రోనా పేరు చెబితే గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నారు. ముఖ్యంగా...

English Latest

Why is Harish Rao furious

Harish Rao, nephew of Telangana CM KCR has been in the silent mode ever since the second stint of KCR government in the state....

Chiranjeevi’s tango with Vijay Devarakonda

Mega Star Chiranjeevi is lining up crazy projects at supersonic speed. After showing his power with Sye Raa-Narasimha Reddy, he is starring in Acharya...

Star comedian denies signing TV serials

In the last two days, news came out that legendary comedian, Brahmanandam will be doing TV serials from now on as he has not...

Anjali’s flop film to premiere on Zee5

ZEE5, besides offering 100+ Originals across genres and languages, has been a reliable source for direct-to-web OTT releases of Telugu films. The latest film...

Who is Pawan’s inspiration JP or AK?

Everyone creates one creates their own destiny. But very few realize this. It is good, to be honest, but however, people will not support...

RRR in Nalgonda?

Ram Charan, NTR's much awaited multistarrer RRR with Rajamouli is waiting in the wings to resume shooting. Ever since the respective state governments have...

Bunny’s brothers in Pushpa revealed

Stylish Star Allu Arjun created a sensation during sankranti with his romantic entertainer Ala Vaikunthapuramlo. Allu Arjun's dances, mannerisms and dialogues became an instant...

Balakrishna turning Superman?

Natasimha Balakrishna is popular for his high octane mass action entertainers. He failed to show his power last year as his films NTR Kathanayakudu,...

RGV gets Murder shock

Ram Gopal Varma with his maverick ways is hogging the media limelight during coronatimes and in the lockdown. RGV announced the project Murder, inspired...

Dil Raju’s makeover becomes the talk of the town

Dil Raju has not been seen much these days thanks to his new marriage. Ever since the lockdown has been announced he shocked many...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show